అయ్యన్నపాత్రుడి తీగ లాగితే.. బాబు డొంక కదులుతుందా..!?

-“వేస్ట్ – మై సన్ లు” అంటే బాబు, లోకేషేనని అందరికీ తెలుసు
-మీరు ఎన్టీఆర్ వారసులు కాదు.. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు వారసుడు లోకేష్
-రాజకీయ అవసరాల కోసం తండ్రీకొడుకులు భువనేశ్వరిని వాడుకుంటున్నారు
-తల్లి మీద ప్రేమ ఉండిఉంటే… మీ నాన్న చేసిన నీచ రాజకీయానికి తల్లీకొడుకులిద్దరూ బాబును పక్కన పెట్టాలి
-టీడీపీ హయాంలో బాబుతో కలిసి చేసిన అక్రమాలు, గంజాయి లెక్కలు బయటకొస్తాయన్నదే వైజాగ్ వీరప్పన్(అయ్యన్న) భయం
-చీకటి పడితే రెండు చుక్కలు వేద్దామని చూసే నిత్య తాగుబోతు అయ్యన్నపాత్రుడు
– 41 నోటీసు ఇస్తే గుమ్మడికాయ దొంగలా అయ్యన్నపాత్రుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు?
– పిచ్చోడి చేతిలో రాయిలా బాబు, లోకేష్ చేతుల్లో టీడీపీ నడుస్తుంది
– వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్

గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే….
అయ్యన్న తీగ లాగితే.. బాబు డొంక కదులుతుందనే భయంతోనే..
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా కూడా గెలవలేక ఓడిపోయిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పుత్రరత్నం ఈరోజు లోకేష్‌ విశాఖ పర్యటనకు వచ్చారు. అయ్యన్నపాత్రుడుని, వారి కుటుంబసభ్యుల్ని పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి వచ్చానని లోకేష్ చెబుతున్నాడు. వాస్తవం ఏమిటని ఆరా తీస్తే… అయ్యన్నపాత్రుడి తీగ లాగితే.. చంద్రబాబు డొంక ఎక్కడ కదులుతుందనే భయంతో లోకేష్ పరుగెత్తుకుని వచ్చినట్టు తెలిసింది.

ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దలపైన అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో.. గోదావరి జిల్లా నుంచి వచ్చిన పోలీసులు ఆయనకు 41 నోటీస్‌ ఇచ్చారన్న ఉద్దేశంతో.. అయ్యన్నను ఈ ప్రభుత్వం ఏదో చేసేస్తుందనే వంకతో ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దల మీద నారా లోకేష్‌ నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు.

అయ్యన్నను పోలీసులు అరెస్ట్‌ చేస్తే.. అక్కడ తీగ లాగితే చంద్రబాబు డొంకంతా ఎక్కడ కదులుతుందో అనే భయంతోనే నారా లోకేష్‌ విశాఖ వచ్చినట్లు కనిపిస్తోంది. అయ్యన్నపాత్రుడు గతంలో మంత్రివర్గంలో పనిచేసినప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో… వీళ్లంతా కలిసి చేసిన అక్రమాలు, దోపిడీలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వీరికి ఉన్న గంజాయి లింకులు – లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మా ప్రభుత్వం విచారణ చేపడుతున్న నేపథ్యంలో, ఎక్కడ వీళ్ల బండారం అంతా బయటపడుతుందన్న భయంతో .. దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ విశాఖ వచ్చినట్లు కనిపిస్తోంది.

41 నోటీసులు ఇస్తే అయ్యన్నపాత్రుడికి ఎందుకంత ఉలికిపాటు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న పెద్దలను నోటీకి వచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే సహజంగానే చట్టం తనపని తాను చేసుకుపోతుంది. దానికి ఎందుకు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు, లోకేష్ లు ఇంతగా భయపడుతున్నారు అంటే దాని పరమార్థం వేరే ఉందనేది అర్థమవుతుంది.

లోకేష్ కు తల్లి మీద ప్రేమ ఉంటే పక్కన పెట్టాల్సింది బాబునే..
– లోకేష్‌ తల్లిని ఏదో అన్నట్లు… ఆయనకు తల్లిమీద ప్రేమ ఉన్నట్లుగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. నిజంగా మీ తల్లిమీద నీకు ప్రేమ ఉంటే… ఆరోజు మీ నాన్న చేసిన రాజకీయానికి మీ తల్లిగారు, నువ్వు కూడా మీ నాన్నను పక్కనపెట్టాలి. అలాంటిది మానేసి నువ్వు కూడా మీ తండ్రితో కలిసి మీ తల్లిగారిని ఇంకా రాజకీయానికి వాడుకుంటున్నారు. మీకు కనీసం సిగ్గు, లజ్జ ఉందా అని అడుగుతున్నాం. జన్మనిచ్చిన తల్లిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న మిమ్మల్ని ఏమనాలి? రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నాయకులుగా ఎందుకు అంగీకరించాలని అడుగుతున్నాం. తన కుటుంబంలో ఉన్న మహిళలు అంటే ప్రేమ, అభిమానాలు ఉండబట్టే జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ సంక్షేమ పథకం అమలు చేసినా, ప్రారంభించినా అది మహిళల పేరుమీదే ఇస్తానని చెప్పి, చేతల్లో అమలు చేసి చూపించారు.

ఆనాడు అసెంబ్లీలో కానీ, బయటకానీ నారా భువనేశ్వరిగారి గురించి ఎవరూ, ఎక్కడా ఏమీ అనలేదు. కానీ ఆవిడ పేరును బయటకు తీసుకుని వచ్చి రాజకీయాలు చేసి, మీ నాన్న ప్రెస్‌మీట్‌ పెట్టి వెక్కివెక్కి ఏడ్చారు. ఇప్పుడు నీవేమో, మీ రాజకీయ అవసరాల కోసం తల్లిని కూడా వాడుకుంటున్నావు. రాజకీయం కోసం బయటకు వచ్చిన ప్రతిసారీ, ప్రతి నిమిషం మీ తల్లిని మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం సమంజసం కాదు.

ఎన్టీఆర్‌ వారసులం అని చెప్పుకునే నారా లోకేష్‌… ఎన్టీఆర్‌ మరణానికి కారణమైనటువంటి వ్యక్తికి(చంద్రబాబుకు) వారసుడనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబుకు వారసుడు లోకేష్. ఏరోజు అయినా మా తాత ఖర్జూరనాయుడు అని చెప్పుకున్నావా?, ఏనాడూ చెప్పుకోని మీరు, ఎన్టీఆర్‌ గురించి, మరొకరి గురించో, జగన్‌ మోహన్‌ రెడ్డిగారి గురించో మాట్లాడే స్థాయి, నైతికత మీకు లేదు.

ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వ్యక్తులు, ఆయన ఫోటోలకు దండలు వేస్తూ.. ఎన్టీఆర్‌ వారసులమని చెప్పుకుంటున్నారంటే.. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏరకంగా అంగీకరిస్తారని అడుగుతున్నాం. ఆఖరికి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే దాన్ని కూడా సహించలేకపోతున్నారు. ఈ రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీ తండ్రి, ఎన్టీఆర్‌ వారసులమని చెప్పుకునే మీరు, ఏరోజు అయినా ఒక జిల్లాకు ఆయన పేరు పెడదామనే ఆలోచన, ప్రయత్నం చేశారా అని అడుగుతున్నాం. మీకు ఎన్టీఆర్‌ మీద ప్రేమ లేదు.

రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వారి రక్తపు మరకలపై పెరిగిన నాయకుడు బాబు
జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే మీరు దాన్ని సహించలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, రాజకీయంగా సహకరించినవారి రక్తపు మరకల మీద పెరిగిన నాయకుడు మీ తండ్రి చంద్రబాబు. అలానే, రాజకీయ భిక్ష పెట్టిన ఇందిరాగాంధీని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరోవైపు, రాజకీయంగా తనకు సమకాలికులుగా ఉన్నవారంతా, లాల్‌జాన్‌ భాషా నుంచి, హరికృష్ణ, ఎర్రన్నాయుడు, బాలయోగి తదితరులంతా ప్రమాదాల్లోనే చనిపోయారు. మాధవరెడ్డి బాంబ్‌ బ్లాస్ట్‌లో చనిపోయారు. ఎన్టీఆర్‌గారు గుండెపోటుతో మరణించారు. జాతీయ స్థాయిలో పేరుగాంచిన బాలయోగిగారు లోక్‌సభ స్పీకర్‌గా అవకాశం వచ్చి, మంచి నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు.

టీడీపీలో చంద్రబాబుకు సమకాలీకులుగా రాజకీయ భవిష్యత్‌ ఉన్నవారంతా కూడా ఏరకంగా అంతరించిపోయారో మనం చూశాం. ఇందులో భాగంగానే, మాధవరెడ్డి మరణంలో చంద్రబాబు పాత్ర ఉందని మేము అసెంబ్లీలో మాట్లాడితే.. సమాధానం చెప్పుకోలేక మహిళల్ని అడ్డు పెట్టుకుని వెళ్ళిన పరిస్థితి మీది. సొంత బామ్మర్ది అయిన హరికృష్ణ రాజకీయ ఎదుగుదలకు ఏరోజు సహకరించని వ్యక్తి చంద్రబాబు.

ఇవన్నీ చూస్తేంటే మాకు, ప్రజలకు లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయంగా మీకు తోడుగా ఉండి, ఎలివేషన్‌ అవుతున్న నాయకుల్ని లేకుండా చేశారా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి అందరి తాలూకా మరణాల మీద విచారణ చేయాలనే అభిప్రాయం కలుగుతుంది.
అయ్యన్నపాత్రుడు గురించి మాట్లాడే పనేలేదు. ఉదయం లేస్తే రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసే వ్యక్తి ఆయన. చీకటి పడితే రెండు చుక్కలు వేద్దామనే నాయకుడు. మొన్న పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన సమావేశం కూడా రాత్రివేళలోనే జరిగింది. ప్యాంట్‌ వేసుకోవడం కూడా మర్చిపోయి లుంగీతోనే వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు.

విశాఖ వీరప్పన్ అయ్యన్నపాత్రుడు
విశాఖ వీరప్పన్‌గా పేరుగాంచిన అయ్యన్నపాత్రుడు, గతంలో తెలుగుదేశం హయాంలో గంజాయి అక్రమ రవాణాకు ఆద్యుడైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే అడ్డుకట్ట వేయాల్సిన నాయకులు, ఆయనకు మద్దతుగా రోడ్డు మీదకు వచ్చి తోడుగా నిలబడుతుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీ నీచ రాజకీయాలకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెబుతారు. నీతులు గురించి వల్లె వేస్తున్న అయ్యన్నపాత్రుడికి, నీతి నిజాయితీలు ఉంటే, శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి, రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అని ప్రశ్నిస్తున్నాం.

పైగా.. మై సన్‌ అన్నాను, అంతే కదా అంటూ అయ్యన్నపాత్రుడు సమర్థించుకుంటూ తాగుబోతు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు, తన కొడుకు భవిష్యత్తును వదిలేసి, అందరినీ “ఆ నా కొడుకు, ఈ నా కొడుకు” అంటుంటే … చివరికి మీ కొడుకు లోకేష్ ఏమైపోయాడో అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారే విషయాన్ని మర్చిపోతున్నారు. “చెత్త నా కొడుకు ఎవడో, మై సన్‌ అంటే ఎవడో, వేస్ట్‌ మై సన్‌ అంటే ఎవరో… రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించారు. వేస్ట్‌ అంటే చంద్రబాబు నాయుడు, మై సన్‌ అంటే లోకేష్‌” అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ గుర్తించాలి.

బూతుల సత్యనారాయణ మూర్తి
బండారు సత్యనారాయణ మూర్తి చచ్చినపాములాంటోడు. ఇలాంటి వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదు. ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. రాష్ట్ర మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట ప్రజలంతా షాక్‌లో ఉంటే… బండారు మాత్రం అడ్డగోలు మాటలు మాట్లాడాడు. యువ మంత్రి మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. బండారు సత్యనారాయణ మూర్తిని బూతుల సత్యనారాయణ మూర్తి అని మార్చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలంతా అనుకుంటున్నారు. ఇలాంటి చచ్చిన పాముల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం.

ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా..?
లోకేష్‌ విశాఖ రావడానికి కారణం.. తీగ లాగితే తండ్రీ కొడుకుల బండారం బయటపడుతుందనే భయంతోనే. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వీరు… వచ్చే ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేసి గెలవగలమని ధైర్యంగా చెప్పగలరా? ఆ దమ్ము, ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. మీరు చేసే నీచ రాజకీయాలకు రాష్ట్రంలో టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయి.

గత రెండున్నరేళ్లుగా విశాఖలో అభివృద్ధిని అడ్డుకుంటున్నదెవరో ఉత్తరాంధ్ర ప్రజలంతా చూస్తున్నారు. ఈ ప్రాంతానికి ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, వారి తాలుకా వ్యక్తులు అడ్డంకులు సృష్టించి, కోర్టుల్లో కేసులు వేసింది మీరు కాదా అని అడుగుతున్నాం.

తెలుగుదేశం పార్టీని చూస్తే జాలేస్తోంది. ఒక తాగుబోతు ఫుల్‌గా తాగి కారు నడిపితే ఎలా ఉంటుందో, ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో… ఈరోజు చంద్రబాబు, లోకేష్‌ చేతిలో తెలుగుదేశం పార్టీ అలా ఉంది. ఏ నిమిషం ఆ పార్టీలో ఏం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ఎక్కడ అంతరించిపోతుందో అని నిత్యం భయంతో నాయకులు, కార్యకర్తలు బతుకుతున్నారు.

రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించలేని రాజకీయ పార్టీని మేము సీరియస్‌గా తీసుకోవడం లేదు. కేవలం శవ రాజకీయాల మీద.. ఏ ప్రాంతంలోనైనా ఒక అంశం వస్తే… దాన్ని పట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందాలనే నీచమైన స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది.