ఇదిగో కేంద్రం ఇచ్చిన లెక్క.. ఇప్పుడేమంటవ్?

– కిషన్ రెడ్డి.. దమ్ముంటే ఈ బకాయిలు ఇప్పించండి
– సంజయ్.. గోబెల్స్ ను మించిపోయారు
– పాదయాత్ర లో అన్ని అసత్యాలే
– కేంద్రం లో 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయరు?
– మంత్రి టీ. హరీష్ రావు ప్రెస్ మీట్

బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర లో అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారు. సంజయ్ గోబెల్స్ ను మించిపోయారు.మా మంత్రి ktr స్పష్టంగా లెక్కలు చెప్పి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని స్పష్టంగా చెప్పారు. ktr సవాల్ పై బీజేపీ నేతలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు.

నేను ఆర్థిక మంత్రిగా సాధికారికంగా నిధులకు సంబంధించి లెక్కలు విడుదల చేస్తున్నా. మనకు హక్కుగా రావాల్సిన 7183 కోట్ల రూపాయల బకాయిలు కూడా తొక్కి పెట్టారు.ఎన్ని సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి కి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి ఇవ్వాల్సిన 1350 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. తప్పుగా ap కి కేంద్రం 454 కోట్ల రూపాయలు 2014 లో విడుదల చేసిన మొత్తం కూడా తెలంగాణ కు ఇంకా రావడం లేదు.

దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బకాయిలు ఇప్పించండి. హక్కుగా రావాల్సిన బకాయిలకే గతి లేదు.. వేరే నిధుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, కాకి కబుర్లు చాలించండి.

తెలంగాణ కు 3లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని బీజేపీ జూటా ప్రచారం చేసుకుంటోంది. పల్లెలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తే తెలంగాణ పల్లెలాగా వేరే రాష్ట్రాల పల్లెలు ఎందుకు లేవు. బండి సంజయ్ రాయచూరు వెళ్లి చూసొద్దామా అక్కడ పల్లెల పరిస్థితి. బీజేపీ నేతలవి జూటా బోగస్ మాటలే. సంజయ్ కు పాదయాత్రలో రాయచూరు రైతులు తెలంగాణ పథకాలు తమకు కర్ణాటక బీజేపీ సీఎం తోఇప్పించాలని వినతి పత్రం ఇచ్చారు.

అన్నీ నిధులు పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న తెలంగాణ లాగా గ్రామాల్లో ట్రాక్టర్లు డంప్ యార్డులు వైకుంఠ దామాలు వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవు? పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు బండి సంజయ్ కు కనిపించడం లేదు.. బొంకుతున్నాడు. పల్లె ప్రగతి తో గ్రామాల్లో మలేరియా కేసులు తగ్గాయని కేంద్రమే అవార్డు ఇచ్చింది ..సంజయ్ కు కనిపించడం లేదా?

కేంద్రం సెస్ ల రూపం లో రాష్ట్రాల ఆదాయాలకు గండి కొడుతోంది. పన్నుల్లో 41 శాతం వాటా రావాల్సి ఉన్నా సెస్ ల పుణ్యమాని 25 శాతానికి మించడం లేదు. రాష్ట్రాలను బలహీన పరిచే కుట్ర కు కేంద్రం తెరలేపింది. 11 శాతం ఆదాయాన్ని సెస్ ల రూపంలో కేంద్రం వసూలు చేస్తోంది.15 వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని చెప్పినా కేంద్రం పెడ చెవిన పెట్టింది.

బీజేపీ అంటే బడా జూటా పార్టీ ,బుల్డోజర్ పార్టీ, భాషణ్ జాదా పార్టీ బుట్టచోర్ పార్టీ గా మారింది..మాటలు ఎక్కువ పని తక్కువ చేసే పార్టీ. ఎందరో ఆర్థిక వేత్తలు మోడీ దగ్గర పని చేయలేక మధ్యలోనే మానేశారు. అరవింద్ సుబ్రమణ్యం, అరవింద్ పనగరియా, ఊర్జిత్ పటేల్ పదవీ కాలానికి ముందే రాజీనామా చేశారు.

ఆసరా పెన్షన్లు తెలంగాణ తరహా లో మరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా? 3వేల రూపాయల పెన్షన్ తెలంగాణ లో తప్ప ఎక్కడైనా ఇస్తున్నారా? ఆసరా పెన్షన్లలో తెలంగాణ కు కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 3 శాతం లోపే బీజేపీ నేతలు ఆసరా పై బోగస్ మాటలు మానాలి.

సంజయ్ కు ఏ సబ్జెక్టు పై అవగాహన లేనట్టు కనిపిస్తోంది.రాజోలి బండ ప్రాజెక్టు పై బండి సంజయ్ మాట్లాడుతున్న తీరు ను చూసి నడిగడ్డ ప్రజలు నవ్వుకుంటున్నారు.డీకే అరుణ rds కు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ న్యాయం చేశారు. డీకే అరుణ ను rds అరుణ గా పిలవాలని సంజయ్ పిలుపునివ్వడం మిల్లినియం జోక్. సంజయ్ కు కిషన్ రెడ్డి కి దమ్ముంటే తెలంగాణ కు జాతీయ ప్రాజెక్టు తేవాలి. కెన్ బట్వా, అప్పర్ భద్ర లకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి కి ఎందుకు ఇవ్వరు?

బీజేపీ నేతలకు తిట్ల పురాణం తప్ప మా నిజాలు జీర్ణం కావు. సుందిళ్ళ ను పదినెల ల్లోనే పూర్తి చేసి 55 వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాది. డీకే అరుణ మంత్రిగా పాలమూరు సాగునీళ్ల కోసం ఏం చేయలేక పోయారు. గద్వాల్ ప్రభుత్వ ఆస్పత్రి లో సౌకర్యాలు లేవని బీజేపీ సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. గద్వాలకు మెడికల్ కాలేజి, నర్సింగ్ కాలేజి మంజూరు చేశాం. icu డయాలసిస్ సెంటర్ కూడా గద్వాలకు ఇచ్చాము. డీకే అరుణకు ఈ వాస్తవాలు తెలియవా.. మంత్రిగా ఉండి ఏం చేశారు?

పెట్రో ఉత్పత్తుల పై నాలుగు రకాల సుంకాలు కేంద్రం విధిస్తోంది. upa హాయం కన్నా nda హాయం లో పెట్రో ఉత్పత్తుల పై భారీ గా సుంకాలు పెరిగాయి. పెట్రోల్ పై 27 రూపాయలు డీజిల్ పై 21 రూపాయలు కేంద్రం సెస్ రూపం లో వసూలు చేస్తోంది. గత సంవత్సరం కేంద్రం పెట్రోల్ డీజిల్ పై నాలుగు లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. తెలంగాణది సంక్షేమ ప్రభుత్వం కేంద్రానిది సతాయించే ప్రభుత్వం
గ్యాస్ సిలిండర్ రేటు ను 400 నుంచి వెయ్యి రూపాయలు పెంచలేదని చెప్పగలరా.. నేను ముక్కు నేలకు రాస్తా.

సబ్సిడీ ని 40 రూపాయలకు తగ్గించారు.సీలిండర్ రేటు పెరగడం తో మళ్లీ పొయ్యిల కట్టెల వైపు ప్రజలు చూస్తున్నారు. మేము అడవులను పెంచుతుంటే కేంద్రం విధానాలు అడవులను నరకమంటు న్నాయి. 15 లక్షల ఉద్యోగ ఖాళీలు కేంద్రం లో ఉన్నాయి ఎందుకు భర్తీ చేయరు? బండి సంజయ్ వీటన్నిటికీ సమాద్గానం చెప్పి పాదయాత్ర కొనసాగించాలి. బీజేపీ నేతల మాటలు ఉద్యమం సందర్భం లో సమైక్యాంధ్ర నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఇకనైనా బీజేపీ నేతలు నిజాయతీగా మాట్లాడాలి.

Leave a Reply