కందలో పోషకాలు పుష్కలం!

Spread the love

కందలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి.
ఇది ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
కాన్సర్‌ను అడ్డుకుంటుంది.
గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.
కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది.
శరీరంలో వేడి చేస్తే ఇది చలవనిస్తుంది.
కంద రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు.
మరి దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. 👇🏼
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటే మనం బంతిలా ఉబ్బుతూ ఉంటాం. అదే కందను తింటూ ఉంటే చెడు కొవ్వు కరిగిపోయి ఫిట్‌గా తయారవుతాం. కారణం ఇందులోని ఫైబరే. అధిక బరువు తగ్గాలనుకునేవారు వారానికో రెండుసార్లైనా కంద వండుకుంటే మంచిదే.
కందలో పోషకాలు మహిళలకు చాలా మేలు చేస్తాయి. కంద మహిళల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. వారానికి రెండుసార్లైనా మహిళలు, అమ్మాయిలూ కందను తినాలని డాక్టర్లు చెబుతున్నారు.ఫైబర్‌ ఉండే ఏ ఆహారమైనా బరువు తగ్గిస్తుంది. కందను తింటే ఇక ఆకలి వెయ్యదు. చాలా సేపు అలాగే ఉంటుంది. కాబట్టి ఇంకేవీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలుంటుంది.ఎంతో అరుదైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కందలో ఉంటాయి. అంతేనా… బీటా కెరొటిన్‌, విటమిన్‌ బీ6, విటమిన్‌ సీ, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
ముసలితనం త్వరగా రాకూడదని మీరు అనుకుంటే కందను తినండి అంటున్నారు డాక్టర్లు. కంద ముఖంపై ముడుతల్ని పోగొడుతుంది. ఇందులోని విటమిన్‌ సీ, యాంటీఆక్సిడెంట్స్‌ ముసలితనాన్ని అడ్డుకుంటాయి.
కందలో ఫైబర్‌ ఎక్కువ, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. ఇవి చాలు షుగర్‌ పేషెంట్లు కూడా దీన్ని తినడానికి. కంద శరీరంలో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరగనివ్వదు. అందువల్ల కందను చక్కగా తినొచ్చు.
మన శరీరంలో చెడు, విష వ్యర్థాలు ఉంటే కంద అస్సలు ఊరుకోదు. అవి బయటకు పోయే వరకూ పోరాడుతూనే ఉంటుంది. పొట్ట, పేగులు, లివర్‌ అన్నింటినీ క్లీన్‌ చేసి పారేస్తుంది.
మతిమరుపు వస్తున్నట్టు అనిపించితే మర్చిపోకుండా కందను వండుకొని తినాలి.
ఇందులో మెగ్నీషియం, సెలెనియం, జింక్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌… మెమరీ పవర్‌ పెంచుతాయి. మెదడు నరాలను చురుగ్గా చేస్తాయి.
రోగనిరోధక శక్తి పెరగాలంటే కంద తినాలి. అప్పుడు అడ్డమైన వైరస్‌లూ మన దరి చేరవు. కంద మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి మనల్ని యాంటీ బాడీలా మార్చేస్తుంది.
పైల్స్‌ ( మొలలు ) సమస్య ఉంటే నిత్య నరకమే. ఎక్కువ సేపు కూర్చునే వారికి, ఎక్కువ ఆయిల్‌ ఫుడ్‌ తినేవారికి, మలబద్ధకం సమస్య తీవ్రంగా ఉన్న వారికి పైల్స్‌ సమస్య తలెత్తుతుంది. కంద మీకు పొడి రూపంలో కూడా లభిస్తుంది. దాన్ని కొనుక్కొని రోజూ వాడేస్తూ ఉంటే అన్ని సమస్యలూ వాటంతట అవే తొలగిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.

Leave a Reply