ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యం

– ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనలో వైద్యులు మమేకం కావాలి
– ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐ.ఎం.ఏ ) రాష్ట్ర శాఖ భవన నిర్మాణానికి స్థలం కోసం సీఎంతో మాట్లాడుతా
– తెలంగాణ ఉద్యమంలో వైద్యుల పాత్ర మరువలేనిది
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
– ఐ.ఎం.ఏ రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినోద్ కుమార్
నీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి ఏ.ఐ.జీ ఆస్పత్రి ఆడిటోరియంలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐ.ఎం.ఏ ) రాష్ట్ర సదస్సులో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనలో వైద్యులు మమేకం కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఐ.ఎం.ఏ రాష్ట్ర శాఖ భవన నిర్మాణానికి స్థలం కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని ఆయన హామీనిచ్చారు.తెలంగాణ ఉద్యమంలో వైద్యుల పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. సందర్భంగా ఐ.ఎం.ఏ. సావనీర్ ను వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ రాష్ట్ర సదస్సులో ఐ.ఎం.ఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం. సంపత్ రావు, పాస్ట్ ప్రెసిడెంట్ డా. లవకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.