అమ్మో గుండెనొప్పి

రామయ్య టెక్కలి దగ్గర ఒక మారుమూల పల్లెలో నివాసం,. ఉన్నట్లుండి చమటలు పట్టడం, వాంతికి వచ్చినట్లుండి, ఛాతీ పట్టేసి గుండెనొప్పి వచ్చింది.. ఎడమ చెయ్యంతా లాగడం మొదలైంది. కళ్ళు తిరగసాగాయి.
సురేష్ పత్తికొండలో నివాసం..పార్టీ కి వెళ్ళి కాస్త తీర్ధప్రసాదాలు తీసుకొని వచ్చి పడుకున్నాడు,.రాత్రి కడుపు మంట, అజీర్తి, చమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది పడసాగాడు.
రాజేంద్ర విజయవాడలో జర్నలిస్టు,, పని వత్తిడిలో ఉండి రాత్తి లేటుగా వచ్చి భోజనం చేసేటపుడు కడుపునొప్పి, ఎడమ దవడ మీద నొప్పి రాసాగింది,,ఛాతీ వెనకభాగం లో మంటగా ఉంది..

పైవన్నీ గుండెనొప్పిలే.. వివిధ రకాలుగా సిగ్నల్ ఇస్తాయి.. గుండెకు 3 రక్తనాళాలు రక్తం సరఫరా చేస్తాయి వాటిని కొరోనరీ ఆర్టరీలు అంటారు,, కుడి వైపుది ఒకటి, ఎడమ వైపు రెండు ఉంటాయి,, వీటిలో కొవ్వు చేరుకుంటూ ఉంటాది.. దానిని ప్లాక్ అంటారు.. ఇది క్రిటికల్ గా అంటే 60%-90% అయితే నొప్పి వస్తాది,, దానిని ఆంజైనా గుండెనొప్పి అంటారు,,ఇది 15 నిముషాలలో తగ్గుతుంది.. సార్బిట్రేట్ టాబ్లెట్ నాలుక కింద పెట్టుకుంటే తగ్గిపోతుంది.. కాని ఇపుడిది వాడడంలేదు..

ఆ ప్లాక్ పుండయితే దానిమీద సడన్ గా ప్లేట్ లెట్లు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలయితే ఓ అరగంటలో బ్లాక్ అయి *హార్ట్ అటాక్ వస్తాది., మనం ఆ క్లాటింగ్ ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375 mg రెండు టాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్-75mg 4 టాబ్లెట్ లు నమలాలి.. నోటినుంచే లాలాజలం ద్వారా అబ్జార్బవతాది,, లేదా పొడిచేసి నీటిలో కలిపి తాగాలి.. ఇది క్లాటింగును ఆపి ప్రాసెస్ ను కొంత సేపు ఆపతాది…

ఆంజైనా నొప్పి వస్తుంటే కార్డియాలజిస్టు దగ్గరకు వెళితే లిపిడ్ ప్రొఫైలు చేస్తారు,, ట్రైగ్లిజరైడ్సు పెరిగితే ఫీనోఫైబ్రేట్ టాబ్లెట్, కొలెస్టురాలు పెరిగితే అటారవోస్టాటిన్ వేసుకోమంటారు,, రెండుపెరిగితే కాంబినేషన్ ATOCOR+F వేసుకోమంటారు.,దానితో పాటు ఎకోస్పిరిన్ 75mg వాడాలి…
అలా కాకుండా ఎక్కువగా నొప్పి ఉంటే ఆంజియోగ్రాము చేస్తారు,, రెండు రక్తనాళములు బ్లాక్ అయితే స్టెంటులు. మూడు బ్లాక్ అయితే బైపాసు చేయాల..

హార్ట్ అటాకే వస్తే దగ్గర లో ICU ఉండే ఆసుపత్రి కి వెళ్ళాలి.. టెక్కలి, పత్తికొండ ప్రాంతాలలో ఉంటే ముందు ఆస్పిరిన్ రెండు నమిలి ఆస్పత్రికి పోతే ECG తీస్తారు.. ST ఎలివేషన్ హార్టు అటాక్ ఉంటే STEMI అంటారు..దాని అర్ధం గుండె రక్తనాళంలో క్లాట్ వచ్చిందని,,హార్టు కండరం చనిపోబోతుందని,, వెంటనే స్ట్రెప్టోకైనేజని 2000 రూపాయల ఇంజక్షన్ వేస్తే క్లాట్ కరిగి మామూలవుతుంది..త్రాంబోలైసిస్ అంటారు.. దీని తరవాత ఆంజియోగ్రాము కు పోవాల..త్రాంబోలైసిస్ అనేది ఏ MBBS/MD డాక్టరు చేయగలడు(కొంచెం ట్రైనింగు/ICU ఉండాలి)

అలా కాకుండా హైదరాబాద్, విజయవాడలాంటి క్యాధ్ లాబ్ ఉన్నచోట్లయితే మీరు ఒక గంటలోనే ఆసుపత్రి కి పోతే వెంటనే ఆంజియోగ్రాము చేస్తారు.. స్టెంటు వేస్తారు,,దీనినే ప్రైమరి ఆంజియోప్లాస్టీ అంటారు.. ఎమర్జన్సీ కావున ఛార్జీలు విపరీతంగా ఉంటాయి..

తమిళనాడులో STEMI INDIA ప్రాజెక్టు అని వుంది.. ఇందులో ICU ఫెసిలిటీ ఉన్నవాటిని ఒక గ్రూపుగా, క్యాధ్ లాబు ఉన్నవాటిని ఒక గ్రూపు గా చేసి రెఫరల్ సిస్టమ్ ఏర్పాటు చేసారు.. పల్లెలలో, PHC లలో ECG ఫెసిలిటీ పెట్టి అనుసంధానం చేస్తారు.. దీనివలన చాలా గుండెపోటు మరణాలు తగ్గించవచ్చు,, సంవత్సరానికి 30 కోట్లు ఖర్చవతాది.. చాలాకాలం కింద నే మేం ప్రభుత్వము లకు చెప్పాము.. ఆచరణకు నోచుకోలేదు..

ధూమపానం,మద్యపానం, మధుమేహం, బిపి, వ్యాయామం లేకపోవడం,ఎక్కువ కెలోరీల కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని వొత్తిడి, స్ట్రెస్సు గుండె నొప్పులకు కారణాలు.. అపుడపుడు 40 సంవత్సరాలయిన తరవాత పరీక్షలు చేయించుకోవాలి., అవసరమైతే మందులు, నియంత్రణ చేసుకోవాల.

అనవసర వాట్సప్ మెసేజులలో ఉండే చెత్తంతా ప్రాక్టీసు చేయరాదు..గుండెనొప్పి రాగానే విపరీతంగా దగ్గాలని, తుమ్మాలని… స్టెంటులు బైపాసులు లేకుండా బాంబేలో డాక్టరు 40లీటర్ల సెలైన్ ఎక్కిస్తే వేటి అవసరం లేదని… అసలు గుండె జబ్బే బోగస్ అనే ఆ హెగ్డే మాటలింటే ఇంతే సంగతులు..
ఇక చదివారుగా.. రెండు ఆస్పిరిన్ టాబ్లెట్లు ఇంటిలో పెట్టుకోండి,, పోద్దున్నే బద్ధకంగా పడుకోక లేచి నడవండి..షుగర్, రక్తపోటు కంట్రోలు లో ఉంచండి.. ఆహారం మితంగా తింటే ఔషధం అని తెలుసుకోండి,, ప్రపంచం ఎవరు లేక పోయినా ఉంటాది,,కావున టెన్షన్ పడక రిలాక్సు.. బాబా..రిలాక్స్ గా ఉండండి..గుండె జబ్బులను జయించండి…

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

Leave a Reply