Suryaa.co.in

Telangana

తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టు బెయిల్‌

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది.

LEAVE A RESPONSE