అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి లో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు తనను పాలకమండలి సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్. సుధాకర్ పిటీషన్ వేశారు. అయితే వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మరికొన్ని పిటీషన్లలో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి, టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటీషనర్ల తరపున న్యాయవాదులు ఆశ్వినీకుమార్, యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఉమామహేశ్వర నాయుడు, పాలకవర్గంలో నేరచరితులపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటీషన్లు దాఖలు చేశారు. తుది వాదనలు వినేందుకు కేసు విచారణను హైకోర్టు జూన్ 20కి వాయిదా వేసింది.
టీటీడీలో నేరచరితులపై హైకోర్టులో విచారణ
