దాచేపల్లి, గురజాల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు

– ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం
గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాలలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పిటిషనర్లకు రక్షణ కల్పించాలని ఆదేశించింది.
దాచేపల్లి, గురజాలలో జరగనున్న నగర పంచాయితీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో పోటీలో ఉన్న కొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వెనక్కు తీసుకోవాలని కొందరు బెదిరిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదించారు. ఈనేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు.
వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దాచేపల్లి, గురజాలలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.పిటిషనర్లకు రక్షణ కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికలను వెబ్‌ కాస్టింగ్‌ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది. పిటిషనర్ల వినతి ప్రకారం వెబ్కాస్టింగ్ నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Leave a Reply