– బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
నల్గొండ: ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం. రేవంత్ రెడ్డి ,ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే మరొక అవకాశం ఉప ఎన్నికల రూపంలో ప్రజలకు వస్తుంది.