-ఎంపీ నందిగం బెదిరింపు
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అరాచకం బయటపడింది. ఎంపీ సహాయం కోసం దళితుడు బాబురావు యత్నించారు. నేరుగా కలవడం కుదరక ఎంపీ ఫోన్‌కు బాబూరావు మెసేజ్ పెట్టారు. దీంతో సురేష్‌కు చిర్రెత్తుకొచ్చింది. తనకే మెసేజ్ పెట్టే అంత మొనగాడివా అంటూ బాబూరావును దూషించారు. ఎంపీ దూషణల ఆడియో రికార్డు అయ్యిందని అనుమానం ఎంపీని వెంటాడుతోంది. బాబురావు నివాసానికి తుళ్లూరు పోలీసులు వచ్చారు. బాబురావును ఎంపీ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. ఇంట్లో తలుపులు వేసి బాబురావును ఎంపీ సురేష్ చావబాదాడు. దళితుడిని పరుష పదజాలంతో సురేష్ దూషించారు. కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడితే వదిలిపెట్టారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను బాబురావు కలిశారు. బాబురావు మాజీ పోలీస్ ఉద్యోగి. అనారోగ్యం, కరోనా కారణంగా ఉద్యోగానికి బాబురావు దూరమైనారు.