హుజురాబాద్‌లో అలా.. బద్వేల్‌లో ఇలా..
దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్ విషయంలో రెండు స్థానాల్లో స్పందన మాత్రం ఒకేలా లేదు.. హుజరాబాద్‌తో పోలిస్తే.. బద్వేల్ మాత్రం బాగా వెనుకబడింది.. ఇక, పోలింగ్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. హుజురాబాద్‌లో భారీగా పోలింగ్ పెరిగే అవకాశం ఉండగా.. బద్వేల్ మాత్రం కాస్త వెనుకబడే ఉండే అవకాశం ఉంది.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. హుజురాబాద్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదు కాగా.. బద్వేల్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ మాత్రమే రికార్డు అయ్యింది. ఇక, హుజురాబాద్‌లో భారీ స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు.. బద్వేల్‌లో కాస్త భిన్నంగా ఉంది పరిస్థితి.. అయితే, హుజురాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు.