హుజురాబాద్‌, బ‌ద్వేల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు

హుజురాబాద్‌: హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ 500 కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు కాంగ్రెస్ ను నిరుత్సాహపరిచాయి. రేపటి సమావేశంలో హుజురాబాద్ ఫలితాల పై చర్చిస్తాం- మ‌ధుయాష్కీ
హుజురాబాద్‌: 9 రౌండ్ల త‌రువాత బీజేపీకి 5,105 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్‌: 9వ రౌండ్‌లో 1835 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
హుజురాబాద్‌: 9వ రౌండ్ లో బీజేపీ లీడ్‌…
హుజురాబాద్‌: పోస్ట‌ల్ బ్యాలెట్ ఫ‌లితాలు… బీజేపీ 242, టీఆర్ఎస్ 455.
హుజురాబాద్‌: 8 రౌండ్ల ఫ‌లితాలు…
బీజేపీ 35,107 ఓట్లు,
టీఆర్ఎస్ 31,837 ఓట్లు,
కాంగ్రెస్ 1175 ఓట్లు.
8 రౌండ్లు ముగిసే స‌రికి బీజేపీకి 3270 ఓట్ల ఆధిక్యం
హుజురాబాద్‌: ఓట్ల లెక్కింపులో 30 నిమిషాలు భోజన విరామం
హుజురాబాద్‌: గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన హిమ్మత్ నగర్ లో ఈట‌ల‌ రాజేందర్ కు 191 ఓట్ల మెజారిటీ..
హుజురాబాద్‌: 8 రౌండ్లు ముగిసే స‌రికి బీజేపీకి 3270 ఓట్ల ఆధిక్యం
హుజురాబాద్‌: 8వ రౌండ్ ఫ‌లితాలు…
బీజేపీ 4086 ఓట్లు
టీఆర్ఎస్ 4248 ఓట్లు
హుజురాబాద్‌: 8 వ‌రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 162 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్‌: 8 వ రౌండ్‌లో గెల్లు శ్రీనివాస్‌, కౌశిక్ సొంత గ్రామాల ఓట్ల లెక్కింపు.
హుజురాబాద్‌: 8వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్‌.
హుజురాబాద్‌: ఏడు రౌండ్ల తర్వాత 1086 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్
హుజురాబాద్‌: ఐదోవ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్‌.
హుజురాబాద్‌: నాలుగు రౌండ్ల ఫ‌లితాలు…
బీజేపీ 17,969 ఓట్లు,
టీఆర్ఎస్ 16,144 ఓట్లు,
కాంగ్రెస్ 680 ఓట్లు
బ‌ద్వేల్‌: వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుథ విజ‌యం. 10 రౌండ్లు ముగిసే స‌రికి వైసీపీకి 85,505 ఓట్ల ఆధిక్యం. అధికారికంగా వెలువ‌డాల్సిన మ‌రో రౌండ్ ఫ‌లితం.
హుజురాబాద్‌: నాలుగో రౌండ్‌లో బీజేపీకి 1695 ఓట్ల ఆధిక్యం. నాలుగు రౌండ్ల త‌రువాత 2,968 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
హుజురాబాద్‌: నాలుగో రౌండ్ లోనూ బీజేపీ లీడింగ్‌.
హుజురాబాద్‌: మూడు రౌండ్ల ఫ‌లితాలు…
బీజేపీ 13,525 ఓట్లు,
టీఆర్ఎస్ 12,252 ఓట్లు,
కాంగ్రెస్ 446 ఓట్లు.
హుజురాబాద్‌:
మూడో రౌండ్‌లో మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు. హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోనూ బీజేపీకి ఆధిక్య‌త‌.
బ‌ద్వేల్‌: ఏడో రౌండ్ లో వైసీపీ 8,741 ఓట్ల ఆధిక్యం. ఏడు రౌండ్ల త‌రువాత వైసీపీకి 60,785 ఓట్ల ఆధిక్యం.
బ‌ద్వేల్‌: ఆరు రౌండ్ల ఫ‌లితాలు.. వైసీపీ 52,882 ఓట్లు, బీజేపీ 10,301 ఓట్లు, కాంగ్రెస్ 2,880 ఓట్లు.
హుజురాబాద్‌:
మూడో రౌండ్ లో 42 వ పోలింగ్ స్టేషన్ ఈవీఎం లో త‌లెత్తిన స‌మ‌స్య‌లు.. పక్కన పెట్టిన అధికారులు
హుజురాబాద్‌: టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిదెల సతీష్ కుమార్ సొంత గ్రామం సింగాపురంలో బీజేపీ కి లీడ్
హుజురాబాద్‌: మూడు రౌండ్లు ముగిసేస‌రికి 1269ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
బద్వేల్‌ : ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం
హుజురాబాద్‌ : మూడో రౌండ్‌ లో బీజేపీకి ఆధిక్యత. మూడో రౌండ్‌ లో 911 ఓట్ల ఆధిక్యం
బ‌ద్వేల్‌ నాలుగు రౌండ్ల ఫ‌లితాలు: వైసీపీ 41,099 ఓట్లు, బీజేపీ 8,504 ఓట్లు, కాంగ్రెస్ 2,305 ఓట్లు
హుజురాబాద్ రెండు రౌండ్ల ఫ‌లితాలు: బీజేపీ 9461 ఓట్లు, టీఆర్ఎస్ 9,103, కాంగ్రెస్ 339 ఓట్లు.
హుజురాబాద్ రెండో రౌండ్ ఫ‌లితాలు: బీజేపీ 4851 ఓట్లు, టీఆర్ఎస్ 4659 ఓట్లు, కాంగ్రెస్ 220 ఓట్లు.
హుజురాబాద్‌: రెండు రౌండ్ల త‌రువాత 358 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
హుజురాబాద్‌: రెండో రౌండ్లో బీజేపీకి 192 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్‌: మొద‌టి ఐదు రౌండ్ల‌లో హుజురాబాద్ మండ‌ల ఓట్ల లెక్కింపు. కారు గుర్తుకు దెబ్బ‌కొట్టిన రోటిమేక‌ర్‌. కారును పోలిన రోటిమేక‌ర్ గుర్తుకు 122 ఓట్లు. క‌మ‌లం గుర్తును దెబ్బ‌కొట్టిన వ‌జ్రం గుర్తు. వ‌జ్రం గుర్తుకు 113 ఓట్లు.
బ‌ద్వేల్‌: నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 30,412 ఓట్ల‌ ఆధిక్యంలో వైసీపీ.
దాద్రా నగర్ హావేలి లోకసభ స్థానంలో శివసేన ముందంజ. మధ్యప్రదేశ్ (ఖంద్వా), హిమాచల్ ప్రదేశ్ (మండి) లోక్ సభ స్థానాల్లో ముందంజలో బిజెపి అభ్యర్థులు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు.
హుజురాబాద్‌: దళిత బంధు, రైతు బంధు ప్రారంభించిన శాలపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు లీడ్
హుజురాబాద్ తొలిరౌండ్‌: స్వ‌తంత్ర అభ్య‌ర్థి కంటె సాయ‌న్న‌కు 113 ఓట్లు.
బ‌ద్వేల్‌: ముగిసిన మూడో రౌండ్ కౌంటింగ్‌. 23,754 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ.
బ‌ద్వేల్ తొలిరౌండ్ ఫ‌లితాలు: వైసీపీ 8790 ఓట్లు, బీజేపీ 1688 ఓట్లు, కాంగ్రెస్ 580 ఓట్లు.
హుజురాబాద్ తొలిరౌండ్ ఫ‌లితాలు: బీజేపీ 4610 ఓట్లు, టీఆర్ఎస్ 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు. తొలి రౌండ్‌లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యం.
హుజురాబాద్‌: తొలిరౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
బ‌ద్వేల్‌: తొలి రౌండ్‌లో 8790 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ.
బ‌ద్వేల్: తొలిరౌండ్‌లో వైసీపీ ఆధిక్యం.
కొన‌సాగుతున్న హుజురాబాద్ ఈవీఎం ఓట్ల లెక్కింపు.
హుజురాబాద్‌: మొద‌టి రౌండ్‌లో హుజురాబాద్ మండ‌ల ఓట్ల లెక్కింపు.
హుజురాబాద్‌: టీఆర్ఎస్‌కు 503 పోస్ట‌ల్ ఓట్లు, బీజేపీకి 159 పోస్ట‌ల్ ఓట్లు, కాంగ్రెస్‌కు 32 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు. చెల్ల‌ని పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు 14.
హుజురాబాద్‌లో ఈవీఎంల లెక్కింపు ప్రారంభం.
హుజురాబాద్‌లో 753 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు. కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం. హుజురాబాద్ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో టీఆర్ఎస్ ఆధిక్యం.
బ‌ద్వేల్ పోస్ట‌ల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం
హుజురాబాద్ పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
హుజురాబాద్‌, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభం. మొద‌ట‌గా పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కిస్తున్న అధికారులు.
కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్‌.
హుజురాబాద్, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. మొద‌ట‌గా రెండు నియోజ‌క వ‌ర్గాల్లో పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం ఈవీఎం ఓట్ల‌ను లెక్కిస్తారు.

Leave a Reply