– పేదలపై బుల్డోజర్ రాజకీయం
– పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ గోడ దూకి బాసర ఐఐటీకి వెళ్లారు
– అధికారంలోకి వస్తే నాలుగు ఐఐఐటీలు పెడతామన్నారు
– బాసర ఐఐఐటీకి రెగ్యులర్ వీసీ లేరు
– తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
హైదరాబాద్: హైడ్రా పేరుతో పేదలపై బుల్డోజర్ రాజకీయం చేస్తున్నారు. ప్రజల వ్యతిరేకతతో హైడ్రామా హైడ్రాప్ అయింది. హైడ్రా విధివిధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. హైడ్రా పేరుతో ప్రభుత్వ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పక్కదారి పట్టిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసి ఎన్నికల ఖర్చులకు పంపాలనే అజెండా ఉంది.
మురళీమోహన్,రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇస్తారు. పేదల ఇళ్లపై పడి సమయం ఇవ్వకుండా కూలగొడుతున్నారు. పెద్దల ఇళ్ళు కూలగొట్టమని ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్ నోట్ లో ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన డైరెక్షన్ మేరకు, హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో చెరువుల ఎఫ్.టి.ఎల్ నిర్ధారించాలని చెప్పింది.
మానవ జీవన విధానం ప్రారంభం అయింది నదుల పక్కన. హెచ్.ఎం.డి.ఏ పరిధిలో 2,568 చెరువులకు ఎఫ్.టి.ఎల్ నిర్ధారించాలని హైకోర్టు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 260 చెరువులకు మాత్రమే ఎఫ్.టి.ఎల్ని ర్ధారణ జరిగింది.
హైడ్రా చేస్తున్న చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఇళ్లను కూల్చాలి అంటే, వారికి పునరావాసం కల్పించాలని హైకోర్టు చెప్పింది. చెరువు పరిధి నిర్ధారణ కాకుండా నోటీసులు ఎట్లా ఇస్తారు? రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రాను వాడుకుంటున్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు ఎందుకు
కూలగొట్టడం లేదు? సీఎం రేవంత్ రెడ్డికి ఫైళ్లు ఎవరికి పంపాలో తెలియడం లేదు. ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు. రైతు రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తే తుంగతుర్తిలో మాపై దాడులు చేశారు. వరద భాదితుల వద్దకు వెళ్తే, ఖమ్మంలో మాజీ మంత్రులపై దాడులు చేశారు. యూపీలో బుల్డోజర్ రాజకీయాలను రాహుల్గాంధీ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారు.
బాసర ఐఐఐటీ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా?: బిఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు: గెల్లు శ్రీనివాస్ యాదవ్
వారం రోజులుగా బాసర ఐఐఐటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం వైఫై సౌకర్యం కల్పించడంలేదు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గోడ దూకి బాసర ఐఐటీకి వెళ్లారు. అధికారంలోకి వస్తే నాలుగు ఐఐఐటీలు పెడతామని అన్నారు. బాసర ఐఐఐటీకి రెగ్యులర్ వీసీ లేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాసర ఐఐఐటీ నిర్మించింది.
బాసర ఐఐఐటీకి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం ఉన్నా ఐఐఐటీ సమస్యలు పరిష్కారం కావాలి.బాసర ఐఐఐటీ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా? బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి బాసర ఐఐఐటీని సందర్శించారు.
విద్యార్థులకు మినీ స్టేడియం కోసం మూడు కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాసర ఐఐఐటీని పట్టించుకోవడం లేదు.