చావుకు నేను సిద్ధమే…చంపేయండి: పట్టాభి

విజయవాడ : తన నివాసంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత పట్టాభి స్పందించారు. ఇంత మంది పోలీసులు ఉండి ఏం లాభమని, తనను ఎప్పుడు చంపాలా… అని ఎదురు చూస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే చెబితే… తాను అందుకు సిద్ధంగా ఉండేవాడినంటూ తన భార్య, బిడ్డలు ఏం‌ పాపం చేశారని ప్రశ్నించారు. ఇంటి మీద పడి ఇంత రాక్షసంగా చేస్తారా? ప్రభుత్వ లోపాలని ప్రశ్నిస్తే చంపేస్తారా… అని నిలదీశారు. చనిపోవడానికి కూడా సిద్దం… చంపేయండి… అని సవాల్ విసిరారు. పట్టాభి నివాసంపై దాడి నేపథ్యంలో ఆయన ఇంటికి పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతులు చేరుకున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు.