-నువ్వు ‘గేమ్ చేంజర్’ మాత్రమే కాదు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూడా
-చిరంజీవి ట్వీట్
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ విజయంపై స్పందించారు.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ చేంజర్ వి మాత్రమే కాదు, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.