హీరో నాని వ్యాఖ్యలకు అర్థం ఏమిటో నాకు తెలియలేదు

Spread the love

– వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్ ,తిను బండారాలపై దోపిడీ జరుగుతోంది. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యతే. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లు ఎలా అవుతుంది? అశోక్ గజపతి రాజు ఏమైనా దైవాంశ సంభూతుడా? గర్భగుడిలోనే దేవాదాయశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా అశోక్ గజపతి రాజు మాట్లాడారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం ఎంతవరకు సరైంది?అశోక్ గజపతి రాజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం..తిరిగి మాపై ఆరోపణలు చేయడం తప్పు.అశోక్ గజపతి రాజు కోసం అధికారులు ప్రొటో కాల్ ను పాటించారు.40 ఏళ్లుగా రామతీర్థం ఆలయాన్ని అశోక్ గజపతి రాజు ఎందుకు అభివృద్ది చేయలేదు. ఉత్తర కుమారుడి లాగా లోకేష్ ప్రగల్భాలు పలుకుతున్నారు.రైతుల ఆత్మహత్యలను దాయాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు పరిపాలన కంటే వందరెట్లు ఎక్కువగా రైతు సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నాం.

Leave a Reply