26 న చినగొన్నూరులో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ

Spread the love

– మంత్రి కొడాలి నానిని ఆహ్వానించిన సర్పంచ్ నాగు

గుడివాడ, డిసెంబర్ 24: మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు సర్పంచ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు నాగు ఆహ్వానించారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని సర్పంచ్ కోటప్రోలు నాగు కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 వ తేదీ ఉదయం 11 గంటలకు వంగవీటి మోహనరంగా 33 వ వర్ధంతి సందర్భంగా చినగొన్నూరు గ్రామంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారన్నారు. ఈ మహోత్సవానికి అధ్యక్షత వహించాలని మంత్రి కొడాలి నానిని కోరారు. గౌరవ అతిథులుగా బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్ తదితరులు విచ్చేస్తున్నారని కోటప్రోలు నాగు చెప్పారు.

Leave a Reply