జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాది రాష్ట్రంలో ఉంటే,ఎవరూ ప్రశాంతంగా బతకలేరు

Spread the love

– యువత, విద్యార్థులు రోడ్లపై నిర్భయంగా తిరగలేరు
– సంకరజాతి ప్రభుత్వాన్ని, వైసీపీ రాక్షసమూకను రాష్ట్రంనుంచి తరిమికొట్టేవరకు విశ్రమించేదిలేదని ప్రజలంతా ప్రతిజ్ఞచేయాల్సిన సమయం వచ్చింది
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
నేడు, రాష్ట్ర అసెంబ్లీలో జరిగినసంఘటనపై ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారంతా తీవ్రఆవేదనకుగురయ్యారని, ప్రజలనే దేవుళ్లుఇచ్చి అధికారాన్ని, తీర్పుని మర్చిపోయి, ఆ ప్రజలే బాధపడేలా, వారికి తప్పుచేశారనేభావన కలిగేలా ప్రభుత్వంలోనివారు వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాక్షసులు తపస్సుచేసి, దేవుళ్లను మెప్పించి వరాలుపొందాక తమకు చావేలేదన్న అహంకారంతో ఆ దేవుళ్లపైనే తిరగబడేవారు. ఆ రాక్షసుల ఉదంతాలు, చర్యలు మర్చిపోకముందే, జగన్మోహన్ రెడ్డి అనేరాక్షసుడు, తనతండ్రి చావు అనేదీక్షతో ప్రజలనుమోసగించి అధికారం లోకి వచ్చాడు. అధికారంలోకివచ్చింది మొదలు ప్రజలను హింసిస్తూ వారిని నరకయాతనకుగురిచేస్తున్నాడు. ప్రజల బాధను, వారివేదనను చూడలేక వారితరుపున, జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని చంద్రబాబునాయుడు ప్రశ్నిస్తుండటంతో, అదిఓర్వలేకనే ఈ ముఖ్యమంత్రి మైండ్ గేమ్ మొదలెట్టాడు.
దుశ్సాసనుడు ద్రౌపది వలువలు ఊడదీస్తుంటే దుర్యోధనుడు ఆనందించినట్లుగా, నేడు జగన్మోహన్ రెడ్డి నిండుసభలో ఆనందపడ్డాడు. 40ఏళ్ల రాజకీయఅనుభవం ఉన్నవ్యక్తి, అనేకఅభివృద్ధికార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఏడిపించాలనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి రావడం పోగాలం దాపురించే. ప్రపంచంలోనే రాజకీయ దురంధురుడిగా వెలుగొందినవ్యక్తిని దూషిస్తారా? చంద్రబా బునాయుడిని ఉద్దేశించి నేడు అసెంబ్లీలో మాట్లాడిన కామాంధులు, వెధవలు,కుక్కలైన కొడాలినానీ, అంబటి, చంద్రశేఖర్ రెడ్డి లాంటివాళ్లని చూస్తుంటే, మనుషులు జంతువులు కలిస్తే వాళ్లుపుట్టారా అనిపిస్తోంది. నిజంగా ఈ మాట అనడానికి బాధగా ఉన్నాకూడా, చంద్రబాబుగారి కన్నీటిబొట్టు అసెంబ్లీలో పడేలాచేసిన వీళ్లంతా మానవ-జంతుజాతి సంక్రమణంద్వారా ఉద్భవించినవారేనని అనక తప్పదు.
జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడు, నేరస్వభావం కలవాడు.. ఆఖరికి అధికారంకోసం సొంతతండ్రిని చంపడానికి కూడావెనుకాడని వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి ని ఎవరైతే చంపారని గతంలో జగన్ ఆరోపించాడో, అదే రిలయన్స్ వారుచెప్పినమనిషికి పదవులుకట్టబెట్టాడు. అదే తన తండ్రి చావుకి జగన్ కారణం అనడానికి నిదర్శనం. రాష్ట్రంలోని మహిళా తల్లుల్లారా… ఆడబిడ్డల్లారా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు పుట్టినప్పటినుంచీ చనిపోయేవరకు అవమానాలే అనడానికి, నేడుఅసెంబ్లీలో మాట్లాడిన మాటలే నిదర్శనం. చంద్రబాబునాయుడి సతీమణి గారైన భువనేశ్వరిని తూలనాడటం, ఆమె ఎలాంటివ్యక్తి అన్నది ఆలోచించకుండా, దూషించడమన్నది దుర్మార్గుడైన నేరస్వభావం కల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోని వారికే చెల్లింది.
మహిళలు ఎంతటిఉన్నతస్థానాల్లో ఉన్నా..వారెలాంటి వారైనా వారిని తిట్టడమే తమపని అన్నట్లు దానిపై అసెంబ్లీలో ఏదోచట్టంచేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో నేడు వైసీపీ ఎమ్మెల్యేలు నోరుపారేసు కున్నారు. ఓట్లు అడుక్కోవడానికి తండ్రిచావుని, బాబాయ్ చావుని వాడుకున్న వ్యక్తి, అధికారంలోకి వచ్చాక ప్రజలను రెండున్నరేళ్లనుంచి రాచిరంపానపెడుతున్నాడు. సొంత బాబాయ్ ని గొడ్డలిపోటుతో ఎవరుచంపారనేదానిపై రాష్ట్రప్రజ లకు స్పష్టతవస్తున్న తరుణంలో, జగన్మోహన్ రెడ్డే ఆపని చేయించాడా అనే ఆలోచనలో అందరూఉండగా, దాన్నుంచి ప్రజలను దారిమళ్లించడానికే ఈ తుగ్లక్ రెడ్డి, దేవాలయం లాంటి అసెంబ్లీని తనస్వార్థానికి వేదికగా చేసుకున్నాడు.
వివేకానందరెడ్డిని చంపింది తనకుటుంబసభ్యులేనన్ననిజం రాష్ట్రమంతా బయటకుపొక్కిన తరుణంలో, చంద్రబాబు నాయుడుగారు దాని లోతుల్లోకి వెళ్లి, ఎక్కడ తననేరాన్ని బయటపెడతాడోనన్న ఈర్ష్యాద్వేషాలతోనే జగన్మోహన్ రెడ్డి నేడు ఆయన్ని దూషించేలాచేశాడు. ఒకమానసిక ఉన్మాది ప్రయత్నం ఎలాఉంటుందో నేడు అసెంబ్లీలో అందరూ చూశారు. వివేకానందరెడ్డిని చంపిందిఎవరు…చంపించిన వారెవరో చంద్రబాబునాయుడు ప్రజలముందుకు తీసుకెళ్ల తాడన్నభయంతోనే ఆయనపై వ్యక్తిగతదూషణలకు పాల్పడ్డారు.
చర్చకు, రాజకీయాలకు సంబంధంలేని విషయాల గురించి మాట్లాడి, చంద్రబాబునాయుడు గారు బాధపడేలా చేశారు. ఒకతల్లిని, ఒకభార్యని గురించి అన్నవారంతా ముమ్మాటికీ సంకరజాతి వారే. వివేకాహత్యవ్యవహారంలో తనబండారం బయటపడుతుందనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేడు ఉన్మాదిలా, మానసికజాడ్యంతో ఆనందిం చాడు. ఉన్మాదులే ఎవరైనా చనిపోతున్నా…ఎవరైనా ఏడు స్తున్నా ఆనందిస్తారు. గతంలో తనపార్టీ ఎంపీ అయిన రఘురామరాజుని తిడుతున్నప్పుడుకూడా జగన్ తెగ ఆనందపడ్డాడు. సభ్యసమాజమంతా టీవీలుచూసి కన్నీరు పెట్టుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం పులకరించిపో యాడు.
సొంతభార్యని బ్లేడుతోకోస్తూ, సిగరెట్లు కాల్చి వాతలుపెట్టి ఆనందపడేఉన్మాదికంటే, నేడుజగన్ అనే ఉన్మాదిపడిన ఆనందం ఎక్కువగా ఉంది. జగన్ లాంటి ఉన్మాదే తల్లిని చెరబట్టి, తండ్రిని చంపి ఆనందిస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి నేడు అసెంబ్లీలో ప్రవర్తించినతీరు నిజంగా ఉన్మాదులే నివ్వెరపోయేలా ఉంది. కొడాలినానీ లాంటి కుక్కలు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి సంకజాతికుక్కలు, కామంతో కళ్లుమూసుకుపోయిన ఆంబోతుబాబులు మాట్లా డుతుంటే, అసెంబ్లీలో ఉన్నవారుఎవరైనా ఊరుకుంటారా? కనీసం మనిషిగా పుట్టినవాడెవడైనా సరే, అది మంచిదికాద ని వారించేవాడు. జగన్మోహన్ రెడ్డి ఏపుట్టుక పుట్టాడో … ఆయన మానసికస్థితిఏమిటో, ఆయన ఉన్మాదం ఏస్థాయిలో ఉందో నేడు ప్రజలందరికీ అర్థమైంది.
జగన్ స్రిప్ట్ ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడి గారి సతీమణిని దూషించారు. భూమ్మీద ఎవరూ శాశ్వతంకాదు.. కానీ చరిత్రలో అధికారంకోసం ఎంతటినీచాని కైనా దిగజారేవ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయాడు. ప్రజా స్వామ్యం అసెంబ్లీలో నిలువునా ఖూనీచేయబడుతుంటే, జగన్ రాక్షసానందం పొందాడు. చంద్రబాబునాయుడు గారు బాధపడ్డారని, కన్నీళ్లుపెట్టుకున్నారని టీడీపీ కార్యకర్తలెవరూ బాధపడాల్సినపనిలేదు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్రంలోని ప్రతి భిడ్డా చంద్రబాబునాయుడి గారి కన్నీటిబొట్టు సాక్షిగా ప్రమాణం చేయండి. ప్రతిజ్ఞచేయాల్సిన సమయం వచ్చింది.
చంద్రబాబునాయుడిని అన్నారులే మనకెందుకు అని భావించేవారందరూ ఏదోఒకరోజు రోడ్లపైకి వచ్చి బోరుమనక తప్పదని గుర్తుంచుకోండి. ఈరాష్ట్రంలో అరాచకంఉన్నంత కాలం ఎవరూ ఏమీమాట్లాడలేరు. ఓట్లువేయకపోయినా, రేషన్ అడిగినా, ఉద్యోగం లేదన్నా, మీ ఆస్తులు మీవేనన్నా మిమ్మల్ని చంపడంఖాయం. చంద్రబాబునాయుడి లాంటి వ్యక్తికే కన్నీళ్లు మిగిల్చారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజలు ప్రశాంతంగా ఏ పని అయినా చేసుకోగలరా.. విద్యార్థులు, యువత రోడ్లపై నిర్భయంగా తిరగగలరా? సంకరజాతి అసెంబ్లీని అరాచకా లకు అడ్డాగా మార్చుకుంది. అలాంటిజాతిని రాష్ట్రంలో లేకుండా తరిమితరిమి కొట్టేవరకు ప్రజలు ప్రతిజ్ఞచేయాలి.
చంద్రబాబునాయుడి శపథానికి మద్ధతుగా ప్రజలంతా కంకణబద్ధులై వ్యవహరించి, సంకరజాతి మంత్రులు, ఎమ్మెల్యేలకు బుద్ధిచెప్పాలని పిలుపు నిస్తున్నాం. ఎవరైతేచావుకి సిద్ధపడి పోరాటంచేస్తారో వారే రాష్ట్రంలో మిగులుతారు. జగన్మోహన్ రెడ్డి చివరకు తన కుటుంబసభ్యులను చంపడానికే వెనుకాడటంలేదు… అలాంటి వ్యక్తికి ప్రజలు ఒకలెక్కా…

Leave a Reply