– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు అంటే రేవంత్ రెడ్డి కి ఎందుకు చిన్న చూపు ?
– రంగారెడ్డి జిల్లా ప్రజల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా?
– బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ,బీఆర్ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నదనేది తెలుసా ? కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు ఇవ్వనంత మాత్రాన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తారా ? హర్యానా లో గుర్గావ్ జిల్లా తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే ఐదు జిల్లాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకటి
రైతు భరోసా ను నేను రైతు బంధే అంటాను. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులకు రైతు భరోసా నిధులు ఎందుకు జమ చేయడం లేదు? తెలంగాణ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లేదా? ఎందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు అంటే రేవంత్ రెడ్డి కి ఎందుకు చిన్న చూపు ? ట్రిపుల్ వన్ జీవో విషయం లో రైతులకు మోసం చేశారు
రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లే రోడ్డును కూడా పట్టించుకునే స్థితిలో కూడా లేరు. రంగారెడ్డి జిల్లా ప్రజల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. మంత్రి వర్గం లో చోటుకు కూడా రంగారెడ్డి జిల్లా నోచుకోదా ?
వారం రోజుల్లో రైతు బంధు నిధులు రంగారెడ్డి జిల్లా రైతుల అకౌంట్లలో పడక పోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కు దిగుతా. రైతులకు పెట్టుబడి సాయం వారి హక్కు. కేసీఆర్ రైతులకు సాయం చేయడం ఓ భాద్యత గా భావించారు. రైతుల పట్ల కేసీఆర్ ది కన్నతల్లి ప్రేమ అయితే రేవంత్ రెడ్డి ది సవతి తల్లి ప్రేమ. సాయం చేసి చెప్పుకోవద్దు .పది మందిలో సంబరాలు చేసుకుంటారా ? బీ ఆర్ ఎస్ ఎన్నో సార్లు రైతు బంధు ఇచ్చినా సంబరాలు చేసుకోలేదు.
రైతులు ఎవ్వరూ సంబరాల్లో పాల్గొనడం లేదు. ఎవ్వరూ రేవంత్ పాలన పై సంతోషంగా లేరు. గ్రామాల్లో ఎవ్వరూ సంబరాలు చేసుకోవడం లేదు.
రంగారెడ్డి జిల్లా భూములు ప్రభుత్వ భూసేకరణకు పనికి వస్తాయి ..కానీ రైతు బంధు డబ్బులకు పనికి రావా ? రైతుల పై ఏ ఆంక్షలు పెట్టినా సరైన పద్దతి కాదు. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు . ప్రెస్ మీట్ లో రంగారెడ్డి జిల్లా బీ ఆర్ ఎస్ నేతలు రాము యాదవ్ , వెంకటేష్ కూడా పాల్గొన్నారు.