అసెంబ్లీని రద్దు చేసి వైసీపీ గెలిస్తే టీడీపీనే మూసేస్తాం

– ఎన్నికలకు వెళ్లగల దమ్ము, ధైర్యం ఉన్నాయా?
– ప్రజాభిమానంతో గెలిచామనే నమ్మకముంటే, ముఖ్యమంత్రి తక్షణమే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలి
• కుప్పంలో గెలుపుకోసం ఎన్ని దారుణాలు చేయాలో అన్నీ చేసిన దొంగఓట్ల మంత్రి, సిగ్గులేకుండా నవ్వుతున్నాడు
• ఆఖరికి మీ గెలుపుకోసం ఆడబిడ్డలు సిగ్గుతో ముఖందాచుకునేలా చేశారు
• వైసీపీ విజయాన్ని డీజీపీకి అంకితమివ్వాలి
• ఈ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తల పోరాటం చిరస్మరణీయంగా నిలుస్తుంది. ప్రతికార్యకర్తకు శిరస్సువంచి ప్రణామం చేస్తున్నా
• ముఖ్యమంత్రి , మంత్రులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం, ప్రభుత్వ సంక్షేమం బేతంచర్లలో, దర్శిలో, జగ్గయ్యపేటలో ఏమైంది?
• ఆర్థికమంత్రి సొంతవార్డులో టీడీపీ గెలిచింది. జబ్బలుచరుస్తున్నవారు దానికేం సమాధానం చెబుతారు?
• జగ్గయ్యపేటలో కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యేకి ఏం పని?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
సాధారణంగా ఏప్రభుత్వంపై అయినా చిట్టచివరి సంవత్సరంలో ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి మొదలవుతాయని, కానీ తాజాగా వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలుఎంతవ్యతిరేకత ఉన్నారో తేలిపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రజల్లో ఉన్నవ్యతిరేకతకు ప్రస్తుతఎన్నికల ఫలితాలు దర్పణంపడుతున్నాకూడా చూశాక కూడా ముఖ్యమంత్రి, మంత్రులు జబ్బలుచరుచుకుంటున్నారని, కుప్పంలో వైసీపీ గెలుపు చూశాక వీళ్లగెలుపు చెడ, అక్కడ గెలిచింది ఒక గెలుపేనా అనిపిస్తోంది. కుప్పం మున్సి పాలిటీపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దదండయాత్రే చేశారు. డబ్బుతోపాటు, ఎన్నికలకమిషన్ ను, పోలీసులను, దొంగఓటర్లను నమ్ముకొని గెలిచి, సిగ్గులేకుండా జబ్బలు చరుచుకుంటున్నారా?
కుప్పం మున్సిపాలిటీ గెలిచామని ముఖ్యమంత్రి, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో ఏంచేస్తే గెలిచారో ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియదా? అక్కడ గెలవడానికి సామదానబేధ దండోపాయాలు ఉపయోగించారు. చివరకు దొంగఓట్లతో గెలిచి, సిగ్గుశరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. అమాయకులైన మహిళల్ని పుంగనూరు, ఇతర నియోజకవర్గాలనుంచి దొంగఓట్లకోసం కుప్పానికి తరలించారు. వైసీపీనేతలు, మంత్రులు నిర్వాకంతో మహిళలు చీరచెంగులతో ముఖాలు దాచుకొని సిగ్గుతో తలదించుకున్నారు.
కుప్పంలో వైసీపీగెలుపుని ప్రజలు అసలులెక్కేసుకోవడం లేదు. కుప్పంలో ఎవరి పని అయిపోయిందో, కొద్దిరోజుల్లోనే మంత్రులందరికీ తెలిసొస్తుంది. ప్రజలు వైసీపీతోనే ఉన్నారనే నమ్మకం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, పార్టీని మూసేయడానికి కూడా తాముసిద్ధమే. తాము విసిలే సవాల్ కు సిద్ధమైతే అధికారపార్టీ తక్షణమే అసెంబ్లీనిరద్దుచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కుప్పంలో మకాంవేస్తే, ముఖ్యమంత్రి సిగ్గులేకుండా బొకేలిచ్చి శుభాకాంక్షలు చెబుతున్నాడు.
బేతంచర్లలో టీడీపీ నాయకుడే లేకపోయినా, 6స్థానాలు గెలిచాము. రాష్ట్ర ఆర్థికమంత్రి సొంతవార్డులో వైసీపీ ఓడిపోయింది. దానిపై ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడేం? బుగ్గనకు బొకేఇచ్చి శుభాకాంక్షలు చెప్పడానికి ముఖంచెల్లలేదా? ప్రజలసమస్యలపై చర్చించడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదు. అందుకే ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి ముఖంచాటేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోరాడిన టీడీపీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. నాయకులతో పనిలేకుండా చాలాచోట్ల కార్యకర్తలే అధికారపార్టీ ఆగడాలు, ఆకృత్యాలకు ఎదురొడ్డి నిలిచారు.
12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే, 7 మున్సిపాలిటీల్లో కార్యకర్తలు హోరాహోరీగా పోరాడారు. రెండింటిలో టీడీపీ విజయం సాధించింది. ఇంకోదానిలో గెలవడానికి అవకాశముంటే, వైసీపీ అక్కడ రాజకీయంచేస్తోంది. 7 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 30శాతం ఓట్లువచ్చాయని ముఖ్యమంత్రే చెప్పారు. మరిప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 46శాతం ఓట్లు పొంది, తనప్రాభవాన్ని పెంచుకుంది.
వైసీపీకి, టీడీపీకి పడినఓట్లను సరిపోల్చిచూస్తే అధికారపార్టీకి 49శాతం ఓట్లువస్తే, టీడీపీకి 45శాతం ఓట్లువచ్చాయి. 5, 6 జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసిందనేది వైసీపీకాదనలేని వాస్తవం. గుంటూరుపట్టణంలో 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 1280 ఓట్లతోగెలిస్తే, ఇప్పుడు అదేస్థానంలో జరిగినఎన్నికలో టీడీపీ అభ్యర్థి 680ఓట్లతో గెలిచారు.
వైసీపీప్రభుత్వం అమలుచేసే సంక్షేమపథకాలు, నవరత్నాలు రాళ్లు గుంటూరు డివిజన్లో పనిచేయలేదా? దాచేపల్లిలో వైసీపీ 11వార్డుల్లో గెలిస్తే, టీడీపీ 7స్థానాలు గెలిచింది. రెండుచోట్ల జనసేన ఇతర అభ్యర్థులు గెలిచారు. టీడీపీగెలిచినచోట్ల ఓర్వలేనితనంతో ఇప్పటికీ చేయాల్సిన దారుణాలు చేస్తూనే ఉన్నారు. జగ్గయ్యపేటలో వైసీపీఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అక్కడ ఓడిపోతామని తెలిసి, ఎమ్మెల్యే వైసీపీ వారిని పోగుచేసి రచ్చచేయడానికి సిద్ధమయ్యాడు. పోలీసులు లేకపోతే వైసీపీ విజయమే లేదు. డీజీపీకే వైసీపీ విజయాన్ని అంకితం చేయాలి. ఈ ఫలితాలు చూసి తాము సంతోషిస్తున్నాం.
గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే 12శాతం నుంచి 30శాతం సీట్లు టీడీపీ గెలిచింది. కోర్టు జోక్యంతో నామినేషన్లు వేసేదుస్థితి కల్పించినవారు, గెలిచామంటూ సంబరాలు చేసుకోవడం కంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇకనైనా వాగుడు, ప్రగల్భాలు కట్టిపెట్టి, ప్రజల్లో విశ్వాసముందని ప్రభుత్వానికిఉంటే, వెంటనే అసెంబ్లీని రద్దుచేసి, తక్షణమే ఎన్నికలకు వెళ్లాలి. టీడీపీ కార్యకర్తలు ఎన్నికల్లో పోటీచేయడానికి, ఆఖరికి రోడ్లమీదకు రావడానికి కూడా గతంలోభయపడ్డారు. అలాంటివారే రోడ్లపైకి వచ్చి, తాజాఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలికారు. చేతగాని ఎన్నికల కమిషన్ సాయంతో, పోలీసులఅండతో కుప్పంలో గెలిచారు.
కుప్పంపై ప్రభుత్వం పెద్ద దండయాత్రే చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలఓట్లతో గెలిచిన మంత్రి, దొంగఓట్లు వేయించి, సిగ్గులేకుండా నవ్వుతున్నాడు. తెలుగుదేశం పార్టీనే లేకుండా చేయాలని చూశారు. ప్రభుత్వ అరాచకాలుచూసి ఏడునెలల ముందుజరిగినఎన్నికలను తాముబాయ్ కాట్ చేశాము. కొన్నిచోట్ల పొత్తులు ఎక్కడికక్కడ స్థానికనేతలు పెట్టుకున్నారు. దొంగఓట్లు వేసినవారిని పట్టుకొని , ఒక్కకేసుకూడా బుక్ చేయలేని డీజీపీ, అసలు ఆపదవిలో ఉండటానికి అర్హుడేనా ? అందుకే అన్నది ఇప్పుడు వైసీపీ విజయాలన్నీ డీజీపీకే అంకితం చేయాలని. దొంగఓటర్లను పట్టించడానికి మీడియా ఎంత ప్రయత్నిం చేసిందో రాష్ట్రమంతా చూసింది కదా?
ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతవ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలతో తేలిపో యింది. 2019 ఎన్నికలముందు తాముకూడా కాకినాడలో, నంద్యాలలో గెలిచాము.. ఆరునెలల తర్వాత ఓడిపోయామా..లేదా? ఈ ప్రభుత్వానికి అంతకంటే దారుణమైన పరాభవం ప్రజలనుంచి ఎదురుకాబోతోంది. వైసీపీవారే చెప్పారుకదా.. ఏడునెలలక్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 30శాతం ఓట్లువచ్చా యని, కమలాపురం, బేతంచర్ల, దర్శిమున్సిపాలిటీల ఓట్లను లెక్కిస్తే, టీడీపీకి 46శాతం ఓట్లువచ్చినట్లు స్పష్టమవుతోంది. దాచేపల్లిలో వైసీపీ ఎలా ప్రవర్తించిం దో రాష్ట్రమంతాచూసిందికదా.. ప్రజలు దుర్మార్గులకు స్థానం ఇవ్వకూడదనే అక్కడ ఢీ అంటే ఢీ అన్నారు.
16చోట్ల ఎన్నికలు జరిగితే, ఉదయంనుంచి కుప్పం గురించే చెప్పుకుంటే ఎలా? ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఈ ఫలితాలు ముమ్మాటికీ ప్రభుత్వపతనానికి నాంది అనడంలోఎలాంటి సందేహం లేదు. దర్శిలో టీవీ9వారు , సాక్షివారు టీడీపీ దొంగఓట్లు వేయించిందని ఎందుకు చూపించలేదు? దొంగఓట్లపై ఇంకా దేనికి ఫిర్యాదుచేయడం? కళ్లముందు అంతా కనిపిస్తుంటే, డీజీపీ ఇంకా సమర్థిస్తూనేఉన్నాడు. రాష్ట్రమంతా గంజాయి గుప్పు మంటుంటే, ఈ డీజీపీ ఎక్కడా గంజాయివాసనే లేదని చెప్పి, తనపరువు తానే తీసుకున్నాడు. అలానేఎన్నికల కమిషనర్ కూడా… నిన్న విలేకరులతో మాట్లా డి కుప్పంలో ప్రశాంతంగా ఉందని చెప్పి, తనస్థాయిని తానే దిగజార్చుకున్నారు.