Suryaa.co.in

Telangana

సీఎం సారీ చెబితేనే సర్వే వివరాలు చెబుతా!

– ఎన్యూమరేటర్‌కు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి షరతు
– గతంలో సర్వేని తిట్టిన రేవంత్ వీడియో ప్రదర్శన
– బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి(స్వంత గ్రామం వేల్పూర్ నందు) కులగణన సర్వే చేయటానికి వచ్చిన అధికారులు
– నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఎలా రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే

బాల్కొండ: ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి కులగణన సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌పై ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. గత తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వేను విమర్శించిన, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి అందుకు క్ష మాపణ చెబితేనే సర్వే వివరాలు చెబుతానని, మెలికి పెట్టిన మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. అప్పటి రేవంత్ వీడియో సర్వేకు వచ్చిన ఆ ఎన్యూమరేటర్‌కు చూపించి హడలకొట్టారు.

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల ల వివరాలు ఎలా సేకరిస్తారని అధికారులను ప్రశ్నించారు. నాకు వివరాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ నాడు BRS ప్రభుత్వం చేపట్టిన సర్వే ను తప్పు అంటూ వివరాలు సేకరించడానికి అడ్డమైన వాళ్ళను ఇంటికి పంపిస్తారా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పిన తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

గడువులోపు సర్వే పూర్తి చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని పేద బడుగు బలహీనర్గాలతో పాటు మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వే ద్వారా ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే పేరిట,టివి ఫ్రిడ్జ్,స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణలోకి తీసుకుని.. సంక్షేమ పథకాలు ప్రజలకు ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఎమ్మెల్యే అన్నారు.

LEAVE A RESPONSE