పోలీసులు ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ – 2000 ద్వారా ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం కల్పించిన హక్కుల ద్వారా సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని సూచించింది.
★ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 2000 ద్వారా ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
★ అధికరణ 226 కింద హైకోర్టులో రిట్ దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొంది.
★ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే రిట్ దాఖలు చేయడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.
★ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యనించింది.
★ తమ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఇటీవల పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.
★ ఎస్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
★ వాటిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం.. కాగ్నిజబుల్ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
★ ఒకవేళ ఎస్ఐఆర్ నమోదు చేయకపోతే మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు.
★ హైకోర్టు కంటే మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించటం మరింత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమార్గమని స్పష్టం చేస్తూ.. వ్యాజ్యాలను కొట్టేవేసింది.
★ తన వ్యాజ్యాన్ని కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.నాగమణి అనే పిటిషనర్ ధర్మాసనం ముందు అప్పీల్‌కు వెళ్లారు.
★ పిటిషనర్ తరఫు న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ ..లలిత కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు కాగ్నిజబుల్ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసిందన్నారు.
★ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆసరాగా చేసుకొని పోలీసులు ఫిర్యాదులను తిరస్కరించే ప్రమాదం ఉందన్నారు.
★ దీంతో ప్రజలు న్యాయబద్ధ హక్కును కోల్పోతారని వాదించారు.
★ ఆ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది.
★ సీఆర్పీసీ సెక్షన్ 200, 154(3),156(3) ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని గుర్తుచేస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలంటూ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది.