Suryaa.co.in

Telangana

విదేశాల్లో దేశ ప్రతిష్ఠతను దెబ్బ తీస్తే ఊరుకోం

– రాహుల్‌కు ఎంపీ డీకే అరుణ హెచ్చరిక

మహబూబ్‌నగర్‌: అమెరికాలో భారత దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన అరుణమ్మ ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు రాహుల్ గాంధీ అండగా నిలవడం సిగ్గు చేటు అన్నారు. భారత దేశంలో ఉంటూ.. ఇక్కడ స్వేచ్ఛ లేదని మాట్లాడటం చేతకానితనమన్నారు. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని దుమ్మెత్తిపోశారు.

జమ్మూ కాశ్మీర్ లో దేశ-వ్యతిరేక విధానాలకు మద్దతిస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి విదేశీ వేదికలపై భారతదేశానికి వ్యతిరేక ప్రకటనలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రతిసారి దేశ భద్రతను, రక్షణ రంగాన్ని తక్కువ చేసి మాట్లాడటం అలవాటు అయిపోయిందని విమర్శించారు. తన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలను రాహుల్ దెబ్బతీస్తున్నారన్నారు. ఇప్పటికయినా బేషరతుగా ఈ దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE