Suryaa.co.in

Telangana

పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టం

– రేవంత్ చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని రాజన్నను మొక్కుకున్నా
– 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి?
– చెంపలు వేసుకొని రుణమాఫీ చెయ్యి
తెలంగాణ నెంబర్ 1 స్థానం కోల్పోయింది
– వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి హరీష్ రావు

వేములవాడ: ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వర స్వామిని కొలుస్తారు. కోరిన మొక్కులు చెల్లిస్తారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టు వేసి మాట తప్పాడు. పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది, ప్రజలకు శాపం అవుతుంది. రేవంత్ రెడ్డి చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావద్దని వేములాడ రాజన్నను మొక్కుకున్నా. జ్ఞానోదయం చేయాలని వేడుకున్నా.

ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు మద్దతు ధర రాక, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర రాక దళారులకు పంట అమ్ముతున్నారు. పౌర సరఫరాల మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు, బిఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసింది.వడ్లకు బోనస్ ఇచ్చాం అని మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు.

రైతు బంధు ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుణ్ణి కోరుకున్నా. దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ రెడ్డి. భయం లేదు భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అన్నారు మాట తప్పారు. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి? కడితేనే రుణమాఫీ చేస్తం అన్న నిబంధన ఏమిటి?

నువ్వు చేసే తప్పుకు రైతులు ఎందుకు శిక్ష వేశావు. రుణమాఫీ పాక్షికంగా చేసావు. 31 రకాల కారణాలు చెప్పి సగానికి పైగా రుణమాఫీ జరగలేదు. తక్షణమే రుణమాఫీ చేసి దేవుడు దగ్గర వేడుకో. చెంపలు వేసుకొని రుణమాఫీ చెయ్యి.

కేసీఆర్ మీద మాట్లాడే నైతికత ఉండదు. కెసీఆర్ లేకుంటే ఉద్యమం లేదు, రాష్ట్రం లేదు, నువ్వు సీఎం అయ్యే వాడివి కాదు. కేసీఆర్ అన్న మాటలో తప్పు ఏం ఉంది? మీ పాలనలో ఏం పొందారు తెలంగాణ ప్రజలు? ఏం కోల్పోయారు చెప్పడానికి నేను సిద్ధం. పొందారో చెప్పడానికి నువ్వు సిద్ధమా?

అప్పులు, రైతుల సమస్యలు, ఆసుపత్రులు, తాగు నీరు, సాగు నీరు, కరెంట్, విద్య, వైద్యం.. ఇలా అన్ని అంశాల్లో చర్చ చేసేందుకు నేను సిద్ధం.

36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. కోవిడ్ ఉన్న సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారు. పోలీసులె తమ పోలీసులు కొట్టేలా చేసావు. నేతన్నలు ఆత్మహత్యల పాలు చేస్తున్నావు. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత ను వీపులు పగిలేలా కొట్టినవు.

దళిత బంధు కోల్పోయారు. గొర్రెలు కోల్పోయారు. చేప పిల్లలు కోల్పోయారు. దళిత బంధు కోల్పోయారు. రైతుబంధు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఎ కోల్పోయారు. శాంతిభద్రతలు కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కు కోల్పోయారు. తెలంగాణ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. మొత్తంగా తెలంగాణ నెంబర్ 1 స్థానం కోల్పోయింది.

కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ 1 ఉంటే రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఇప్పటికైనా పగా, ప్రతీకారం మాను. సీనియర్లను పరిగణనలోకి తీసుకో. తెలంగాణ కోసం పోరాడింది పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ. కెసిఆర్ వందేళ్ళ అభివృద్ధి చేస్తే, రేవంత్ ఏడాది కాకముందే వందేళ్ల వెనుకకు రాష్ట్రాన్ని తీసుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు.

రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతు బంధు ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాల్ని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE