Suryaa.co.in

Andhra Pradesh

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దయ ఉంటే సద్విద్య మనతో ఉన్నట్టే

– హిందూ దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి
– కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

రామచంద్రపురం, మార్చి 3 : శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దయ ఉంటే సద్విద్య మనతో ఉన్నట్లేనని, రాష్ట్రంలో హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. సోమవారం రామచంద్రపురంలోని స్వయంభూ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం నవమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో అయన ముఖ్యఅతిథిగా పాల్గొని వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సప్తనది జలాలతో స్వయంభూ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష చామంతి పూలతో పూజా కార్యక్రమం, అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాల పరిరక్షణతో పాటు, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పలు పటిష్ట చర్యలు తీసుకున్నారని అన్నారు. రామచంద్రపురంలో స్వయంభూ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం కలిగి ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టమని కొనియాడారు.

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దయ ఉంటే సద్విద్య మన వెంట ఉన్నట్టేనని, అమ్మవారిని నిత్యం పూజించడం ద్వారా జ్ఞాన సముపార్జన పొందవచ్చని అన్నారు. ఈ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వాసంశెట్టి సత్యoను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కూటమి నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.

LEAVE A RESPONSE