ఇటీవలి తమిళనాడు కరూర్ సంఘటన, జగన్ పర్యటనలో చనిపోయిన ఘటనలు పరిశీలించాక, ఈ పోలీసు అధికారి తమ బృందంతో జగన్ నర్సీపట్నం రోడ్డు పర్యటనకు హెలికాప్టర్ ద్వారా వెళ్లమని చాలా ఓపికగా.. చక్కగా వివరించారు.
కానీ అవతల వున్నది వైకాపా మూర్ఖులు కదా?
‘వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనలో ఎలాంటి మార్పులేదు’, ఈనెల 9వ తేదీన నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.
విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గానే వెళ్తారు. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా ఆగేదే లేదు. వాతావరణం బాగ లేకపోయినా హెలీకాప్టర్ లో వెళ్లమనడం ఏంటి? ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి ప్రభుత్వానికి తెలీదా?
9న నర్సీపట్నం పర్యటనకు జగన్ వెళ్లబోతున్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్ పర్యటనను అడ్డుకోవడం అంటే పోలీసుల చేతగాని తనమే. భద్రత కల్పించలేనప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రభుత్వం అంగీకరించినట్టే. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ పర్యటన కొనసాగుతుంది.
జనం వస్తే రోప్ పార్టీలను పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జగన్ ఎక్కడా మైకులు పెట్టి మాట్లాడే పోగ్రామ్లు లేవు. మెడికల్ కాలేజీని చూసి మీడియాతో మాట్లాడుతారు. మధ్యలో ఎవరైనా జనం ఫిర్యాదులు ఇస్తే తీసుకుంటారు. జగన్ పర్యటనకు వెళ్లొద్దని నాయకులకు నోటీసులు ఇస్తున్నారు.
ఇలాంటి బెదిరింపులతో మమ్మల్ని అణచివేయలేరు. అయినాసరే జగన్ పర్యటనను ఆపగలిగారా? నర్సీపట్నం పర్యటన కూడా అలాగే కొనసాగి తీరుతుంది. పోలీసు అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డుమార్గాన వెళ్తారు’ అని మరోసారి స్పష్టం చేశారు కన్నబాబు.
చెవిటి వాడి ముందు శంఖం ఊదటం… వైకాపాకు చెప్పడం రెండూ ఒక్కటే.
ఈ భారీ వర్షాల్లో ఏమన్నా ప్రజలకు పులిహోర పొట్లాలు తీసుకెళుతున్నాడా? లేదు కదా. జగన్ కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చెయ్యకపోవడంతో పనులు ఆపేసి అసంపూర్ణంగా ఆగిపోయిన నిర్మాణం దగ్గర ఎగచూసి, ఆహా అని ఒక సెల్ఫీ తీసుకొని, వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే కదా. వర్షాలు ఆగాక హెలికాప్టర్లో వెళ్లవచ్చు కదా. ఇప్పుడు అంత కొంపలు మునిగే లెక్కన వెళ్లి “ఆహా..” అనకపోతే జనానికి ఏమన్నా బోర్ కొడుతుందా? జనం ప్రాణాలు తీసి ఆనందించడం, పోలీసులను నిందించడం ఎందుకు?
ఇటీవల పెళ్లిళ్లకు హెలికాప్టర్లో వెళుతున్నాడు కదా. సగం పెళ్లి వాళ్లు పెట్టుకొంటే వెళతాడా? అధికారంలో వున్నప్పుడు తాడేపల్లి నుండి ఇరవై కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడాడు కదా. జేబులో నుండి హెలికాప్టర్‌కు దుడ్లు తియ్యాలంటే అంత గింజుకోవడం ఎందుకు?
– చాకిరేవు