ట్రంప్ నిర్ణయాల ప్రభావం హైదరాబాద్ లో కూడా ప్రభావం చూపుతోంది. అన్ని మల్టీ నేషనల్ కంపెనీలు.. టీసీఎస్ లాంటి ఇండియన్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ సంస్థ అమెజాన్ కూడా హైదరాబాద్ కార్యాలయాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది.
ఏ – ఐ సాంకేతికత అందుబాటులోకి రావడం, కరోనా పాండమిక్ సమయంలో అవసరానికి మించి ఉద్యోగులను నియమించామని, ఇపుడు మానవ వనరుల అవసరం తగ్గిపోయిందని, ఖర్చులు కూడా అంచనాలను మించిపోతున్నందున దాదాపు ముప్పై వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నామని సంస్థ యాజమాన్యం చెబుతోంది..
కానీ ట్రంప్ ఒత్తిడి ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా వెళ్ళిపోయి నాలుగేళ్లు అయ్యాక.. ఇపుడు ఆ కారణం చూపడాన్ని తొలగింపుకు గురైన ఉద్యోగులు తప్పు పడుతున్నారు..
ఏ – ఐ వల్ల ఊహించినంత మెరుగైన సేవలు అందించడం సాధ్యం కాదని.. కేవలం అధిక లాభాల కోసం ఉద్యోగులను తొలగిస్తున్నారని, తక్కువమంది ఉద్యోగుల చేత వెట్టి చాకిరి చేయించుకోవడమే లక్ష్యంగా అమెజాన్ సంస్థ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని తొలగింపుకు గురైన ఉద్యోగులు విమర్శిస్తున్నారు..
ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించిన హైదరాబాద్ కార్యాలయం.. సంస్థ పే రోల్ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.