– తన హాయాంలో డ్వాక్రాసంఘాలకు చేసిన సాయంపై పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలని ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నాం
• ఆసరాపేరుతో జగన్ డ్వాక్రాఅక్కచెల్లెమ్మలకు పెద్దటోకరా వేశాడు
• మార్చి 25న జగన్ మూడోవిడత రుణమాఫీ బటన్ నొక్కితే, నేటికీ డ్వాక్రామహిళల ఖాతాల్లో డబ్బుపడలేదు
• ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం
• అబద్ధాలు, మోసాలతో జగన్ చేతగాని ముఖ్యమంత్రిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు
– టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా భావించడంలేదని, ఆయన్ని బటన్ సీఎం, ఫేక్ సీఎం, సైకో సీఎంగా పిలుచుకుంటున్నారని, అక్కచెల్లెమ్మలకు న్యాయంచేస్తానంటూ మహి ళల ఓట్లుదండుకున్న జగన్, ఆసరాపేరుతో వారికి కోట్లరూపాయల టోకరావేశాడని, టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికారసమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంటసునీత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
“తాడేపల్లిలో కూర్చొని తనజేబులు నింపుకోవడం తప్ప ముఖ్యమంత్రి ఏనాడు డ్వాక్రామహి ళలకు ఏంచేసింది లేదు. ఆసరాపథకం కింద జగన్మోహన్ రెడ్డి మార్చి25న బటన్ నొక్కితే, నేటికీ డ్వాక్రామహిళల అకౌంట్లలో డబ్బులుపడలేదు. ఉత్తుత్తిబటన్ నొక్కుళ్లతో పాలన చేసే ముఖ్యమంత్రి ఫేక్ ముఖ్యమంత్రి కాడా? అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో కేవలం రెండువిడతలు మాత్రమే డ్వాక్రారుణమాఫీ చేశాడు. మూడోవిడత సొమ్ము నేటికీ మ హిళల ఖాతాల్లో వేయలేదు. 4వ విడత మాఫీసొమ్ము జగన్ ఇస్తాడనే నమ్మకం మహిళలకు లేదు. మహిళల ఖాతాల్లో పడాల్సిన రుణమాఫీ సొమ్ముని జగన్ తనప్యాలెస్ కు మళ్లించుకున్నాడా?
పబ్లిసిటీకోసం ఉత్తుత్తిబటన్లు నొక్కడంతప్ప, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుపడిందో లేదో ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు
జగన్ తన పబ్లిసిటీ కోసమే ఉత్తుత్తి బటన్లు నొక్కుతున్నాడుగానీ, తరువాత లబ్ధిదారుల ఖా తాల్లో డబ్బుపడిందా లేదా అని ఎందుకు ఆలోచించడు? తమకు ఇంకాడబ్బురాలేదని డ్వా క్రామహిళలు మండల, జిల్లా కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఉపయోగంలేదు . ఖాళీచెక్కులుఇచ్చారు ఖాతాల్లో డబ్బులుపడలేదు అంటుంటే, సీసీలు, ఏపీఎంలు, మాకే జీతాలు సరిగా రావడంలేదని చెప్పి బావురుమంటున్నారు. జగన్ జగన్నాటకంలో డ్వాక్రా మహిళలకు అడుగడుగునా మోసమే ఎదురవుతోంది. డ్వాక్రామహిళల్ని ఏంఉద్ధరించాడని ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వారితో పాలాభిషేకాలు చేయించుకున్నాడు? తనసభలు, సమా వేశాలకు రాకపోయినా, ప్రజల్ని తరలించకపోయినా పనిగట్టుకొనిమరీ డ్వాక్రామహిళల్ని వేధి స్తున్న ముఖ్యమంత్రిని ఇప్పుడేచూస్తున్నాం.
చంద్రబాబుపాలనలో పనితీరుతో ప్రజలమనస్సులు గెలుచుకున్న డ్వాక్రామహిళలు, నేడు ప్రజలకుముఖంచూపించలేని దుస్థితికి వచ్చారు
చంద్రబాబుగారి హయాంలో డ్వాక్రాసంఘాలు ఎలా ఉండేవో, డ్వాక్రామహిళలు ఎంత సంతో షంగా ఉండేవారో జగన్ తెలుసుకోవాలి. తాడేపల్లిప్యాలెస్ వదిలి జగన్ ప్రజల్లోకి వెళ్తే, వారు తనను ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది. గతప్రభుత్వంలో డ్వాక్రాసంఘాలు పనితీరుతో ప్రజలమనసులు గెలుచుకున్నాయి. కానీ నేడు జగన్ జమానాలో డ్వాక్రామహిళలు ప్రజలకు ముఖంకూడా చూపించలేని దుస్థితిలోఉన్నారు. జగన్ ని నమ్మడమే వారికి పెద్ద శాపంగా మారింది. అభయహస్తం పథకంకింద డ్వాక్రామహిళలు దాచుకున్న రూ.2వేలకోట్ల సొమ్ముని కూడా జగన్ కాజేశాడు. డ్వాక్రారుణమాఫీ చేయలేని అసమర్థసీఎం, వారి పొదుపు సొమ్ము దిగమింగిన అవినీతిసీఎం అక్కచెల్లెమ్మలను ఉద్ధరిస్తాడా? డ్వాక్రామహిళలంటే జగన్ పల్లకీలుమోసే బోయీలుకాదు. తనసభలు, ప్రభుత్వకార్యక్రమాలకు రావడంలేదని డ్వాక్రామహిళలు రావడంలేదని, జగన్ వారిని ఇబ్బందిపెట్టిన ఘటనలు కోకొల్లలు. సభలకు వచ్చినవారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వెళ్లకుండా వారిని నిర్బంధించలేదా?
4ఏళ్లలో డ్వాక్రామహిళలకు జగన్ ఏం చేశాడో చెప్పాలి. వారికి చేసిన సాయంపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా
జగన్ తనపాలనలో డ్వాక్రామహిళలకు ఏంచేశాడో సమాధానంచెప్పాలి? వారికిచేసిన మం చిపై ముఖ్యమంత్రితో, ప్రభుత్వంతో బహిరంగచర్చకు తాముసిద్ధమని సవాల్ చేస్తున్నాం. తన పాలనలో డ్వాక్రామహిళలకు చేసినసాయంపై, పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. జగనన్న గృహనిర్మాణం పథకానికి డ్వాక్రా మహిళల పొదుపుసొమ్ముని వినియోగించే ప్రయత్నంచేసిన జగన్ గ్రూపుల్లోని సభ్యుల మధ్యే తగాదాలుపెట్టి చోద్యంచూస్తున్నాడు. డ్వాక్రా మహిళలకు ఇదిగో ఈ సాయం చేశానని ముఖ్యమంత్రి చెప్పగలడా? డ్వాక్రాసంఘాలకు ఒక్కోగ్రూపుకు చంద్రబాబుగారు రూ.5లక్షల పావలావడ్డీరుణం అందిస్తే, దాన్ని రూ.10లక్షలకు పెంచుతానని చెప్పిన జగన్, చివరకు రూ.3లక్షలకుకుదించాడు. డ్వాక్రాగ్రూపుల రుణపరిమితి పెంచవచ్చని ఆర్బీఐచెప్పినా కూడా ఈ ముఖ్యమంత్రి కావాలనే దాన్నితగ్గించారు. రుణపరిమితి తగ్గిపోవడంతో డ్వాక్రా సంఘాలు, మహిళల ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ఈ సమస్యపై జగన్ ఏనాడైనా ఆలోచించారా?
చంద్రబాబు హాయాంలో ప్రభుత్వంలో, పాలనలో కీలకంగా వ్యవహరించిన డ్వాక్రామహిళలు, జగన్ హాయాంలో ప్రభుత్వకార్యక్రమాలు, బహిరంగసభలకు జనాల తరలింపుకే పరిమితమయ్యారు
చంద్రబాబు ప్రభుత్వంలో, పరిపాలనలో డ్వాక్రామహిళల భాగస్వామాన్నిపెంచారు. ఇసుక రీచ్ ల నిర్వహణ, ధాన్యంకొనుగోళ్ల వంటి పెద్దపెద్దబాధ్యతల్ని వారికి అప్పగించి, వారి సమర్థతను ప్రపంచానికి తెలియచేశారు. డ్వాక్రామహిళలు చెప్పినపని సక్రమంగా, సమర్థవం తంగా చేస్తారని నమ్మిన ఏకైక వ్యక్తి చంద్రబాబుగారు ఒక్కరే. అందుకే వారికాళ్లపై వారు నిల బడేలా మహిళల్ని ప్రోత్సహించారు. గతప్రభుత్వంలో డ్వాక్రామహిళలే సాధికారమిత్రలుగా ప్రతిఇంటిగడపతొక్కి, ప్రభుత్వపనితీరు, సంక్షేమపథకాల అమలుపై దృష్టిపెట్టారు.
జగన్ రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, డ్వాక్రాసంఘాల్ని నిరుపయోగంగా మార్చాడు. డ్వాక్రా మహిళలంటే జగన్ దృష్టిలో సభలు, సమావేశాలకు ప్రజల్ని తరలించే వారు మాత్రమే. ఖాళీ చెక్కులతో ఆసరాపేరుతో మహిళలకు టోకరావేసిన జగన్ మరోమోసానికి తెరతీ శాడు. అన్నిజబ్బులకు ఒకటే మందుఅన్నట్లు, ఏంచెప్పినా జగన్ బటన్ నొక్కుతాను అంటు న్నాడు. పోలవరం, అమరావతి నిర్మాణాలపై ప్రశ్నించినా, అభివృద్ధి ఏదన్నా.. డ్వాక్రామహి ళలకు రుణమాఫీ సొమ్ము అందలేదన్నా, రైతులకు పరిహారం ఇవ్వలేదన్నా బటన్ నొక్కే పనిలోనే జగన్ ఉన్నాడు.
ప్రజలకు ఏం ఒరగబెట్టాడని, ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి తన బొమ్మతో కూడిన స్టిక్కర్లను గోడలపై వేయిస్తున్నాడు?
ప్రజలసంక్షేమంపై, రాష్ట్రాభివృద్ధిపై జగన్ కు చిత్తశుద్ధి లేదు. ఫిబ్రవరిలో కల్యాణమస్తు పథ కానికి నిధులు ఇచ్చానన్నాడు. ఇప్పటివరకు ఆపథకం సొమ్ము అర్హులకు చేరలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముకోసం వేలాదివిద్యార్థులు రోడ్లెక్కే పరిస్థితివచ్చినా ముఖ్యమంత్రిలో చలనంలేదు. అధికారంలోకి వచ్చి 4ఏళ్లు దాటుతున్నా, ఆచరణసాధ్యంకాని మోసపూరిత మాటలతో జగన్ ఇప్పటికీ ప్రజల్ని వంచిస్తూనే ఉన్నాడు.
అబద్ధాలు, మోసాలతో జగన్ చేత గాని ముఖ్యమంత్రిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని వాడు, డ్వాక్రామహిళలకు రుణమాఫీసొమ్ము ఇవ్వనివాడు, రైతులకు పంటలబీమా సొమ్ము అందించలేనివాడు సిగ్గులేకుండా ఏముఖంపెట్టుకొని జనాలఇంటిగోడలపై తనబొమ్మతో కూ డిన స్టిక్కర్లు వేయిస్తున్నాడు? నాడు-నేడు పేరుతో టీడీపీప్రభుత్వం నిర్మించిన భవనాలకు వైసీపీరంగులేశారు. అంగన్ వాడీభవనాలు, ప్రాథమికఆరోగ్యకేంద్రాలు ఎలాంటి సమస్యల్లో ఉన్నాయో తెలుసుకోండి.” అని సునీత సూచించారు.