మద్యం ద్వారా 5 ఏళ్లలో, జగన్ రెడ్డి 10 వేలకోట్ల అక్రమార్జన

– 34 నెలల్లో కొత్త మద్యం విధానం ద్వారా 7,000 కోట్లు దోచేసిన జగన్
ముఖ్యమంత్రి, ఆయన మనుషుల కబ్జాలో రాష్ట్రం లోని అన్ని డిస్టలరీలు
జగన్ అధికారం లోకి వచ్చిన తరువాతే 103 సొంత బ్రాండ్లను మార్కెట్లోకి వదిలాడు
• పేదల రేషన్ బియ్యాన్ని కూడా మద్యం తయారీకి తరలిస్తున్నారు.
• మద్యం ఆదాయం తోనే సంక్షేమమని ప్రభుత్వం సిగ్గులేకుండా చెపుతోంది.
• రాష్ట్రం లో జే బ్రాండ్స్, సారా మరణాలు, అక్రమమద్యంవ్యాపారం పై జ్యుడిషియల్ విచారణ కు ముఖ్యమంత్రి సిద్ధమా?
టీడీపీ ఎమ్మెల్యేల ఉమ్మడి మీడియా సమావేశం లో ప్రభుత్వానికి సవాల్

అవాస్తవాలు అవలీలగాచెప్పడం.. అసత్యాలు వల్లెవేయడంలో జగన్ రెడ్డిని మించినవారు భూమ్మీదేలేరు : కింజరాపు అచ్చెన్నాయుడు
మంగళగిరి : వైసీపీప్రభుత్వం ప్రజలకు సమస్యలు సృష్టించడంలో దిట్టగా మారింది. ప్రజలప్రాణాలకంటే ముఖ్యమైన సమస్య ఇంకోటి ఏముంటుందో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్రప్రజలు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని గ్రహించాలి. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే ఎందుకుచెప్పలేదు? భర్తతాగితేనే భార్యకు చేయూత, తండ్రి జేబుగుల్లచేసుకుంటేనే బిడ్డకు అమ్మఒడి ఇస్తానని ఎందుకు అనలేదు? 2015 డిసెంబర్ 8న ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం హామీఇచ్చాడు.

ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్రంలోఎక్కడా మద్యంఅనేది లేకుం డా చేస్తానన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో మాట్లాడుతూ, మద్యం ఆదాయాన్ని క్రమక్రమంగా తగ్గిస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాననిషేధం అనిచెప్పాడు.. ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మద్యం అమ్మేలా చూస్తానన్నాడు… మద్యంఆదాయం క్రమక్రమంగాతగ్గేలా చేస్తానన్నాడు…ఏదీచేయలేదు.

2014-15లో రాష్ట్రంలో రూ.11,569కోట్లరూపాయల మద్యంఅమ్మితే, 2021-22లో రూ.24,714కోట్లరూపాయల విక్రయాలుజరిగాయి. ఆదాయం తగ్గించడమంటే మద్యంవిక్రయాలు పెంచడమా జగన్మోహన్ రెడ్డీ? మద్యంపై రూ.16,500కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థికమంత్రే అసెంబ్లీలోచెప్పారు. ఇవన్నీ వాస్తవాలో కాదో.. జగన్మోహన్ రెడ్డి సమాధానంచెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే 5ఏళ్లలో రూ.10వేలకోట్ల ఆదాయం వ్యక్తిగతంగాచేరుతోంది. అదెలాగంటే ప్రభుత్వలెక్కల్లో చూపుతున్న మద్యంఅమ్మకాలు కాకుండా.. తనసంపాదనకోసం ముఖ్యమంత్రి తనవారితో అమ్మిస్తున్న మద్యంవేరే ఉంది. రోజుకి ఎన్నికేసులు మద్యంఅమ్మకాలు ప్రభుత్వలెక్కల్లో చూపుతున్నారో…ఎన్నికేసులు మద్యంజగన్మోహన్ రెడ్డి ఖజానా నింపడంకోసం అమ్ముతు న్నారో ఆలెక్కలు కూడా బయట పెడతాము.

మద్యం దుకాణాలు, మద్యంతయారీ కంపెనీలు అన్ని తనగుప్పెట్లో పెట్టుకున్నాడు. అవన్నీ తనచేతిలో ఉంటేనే తనకు రూ.10వేలకోట్లు వస్తాయని ముఖ్యమంత్రి లెక్కలేశాడు. తనఆదాయంకోసం, జాతిపిత పుట్టినరోజునాడే కొత్తమద్యంపాలసీ తెచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. మాప్రాణాలకుతెగించి మరీ ప్రజలప్రాణాలు కాపాడటానికి ముఖ్యమంత్రితో పోరాడుతున్నాం. మద్యంఅమ్మకాలు, తయారీ, ముఖ్యమంత్రికి అందుతున్న రూ.10వేలకోట్ల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించమంటే మమ్మల్ని బయటకు పంపారు. అవాస్తవాలు అవలీలగా చెప్పడంలో ముఖ్యమంత్రిని మించినవారు భూమ్మీదే ఎవరూఉండరు. చంద్రబాబు హయాంలోనే మద్యంకంపెనీలు వచ్చాయంటున్న జగన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు రద్దుచేయలేదు?

పేరుకే రాష్ట్రంలో డిస్టిలరీలు.. వాటిని నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి బినామీలే. జే-బ్రాండ్స్ ఏవీతానుతేలేదంటున్న జగన్ రెడ్డి… వినియోగదారుడు కోరిన మద్యాన్ని రాష్ట్రంలో ఎందుకు అమ్మడం లేదు? జగన్మోహన్ రెడ్డి అమ్మేపిచ్చిమద్యం తాగడంతప్ప…వినియోగదారులకు కావాల్సిన మద్యం లభించడంలేదు. రాష్ట్రంలో సీబ్రాండ్… ఎల్ బ్రాండ్ లు (చంద్రబాబుబ్రాండ్.. లోకేశ్ బ్రాండ్ ) మాత్రమే ఉన్నాయంటున్న జగన్ రెడ్డి… తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ బ్రాండ్లు ఉంటాయని గుర్తిస్తే మంచిది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన గ్రేట్ బ్రాండ్ సీ-బ్రాండ్ ( చంద్రబాబుబ్రాండ్). ఎల్ బ్రాండ్ (లోకేశ్ బ్రాండ్) అనేది యువతఆశలు…ఆశయాలకోసం పనిచేసే బ్రాండ్. ఇటీవలే సమాచారహక్కుచట్టం కింద తాముసేకరించిన సమాచారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోకొత్తగా 103రకాల మద్యంబ్రాండ్లు తీసుకొచ్చారని తెల్సింది. ఆసమాచారంకూడా మావద్ద ఉంది.. దాన్నికూడా సభలో చర్చపెడితే చూపిస్తాం.

నిన్న ముఖ్యమంత్రి సభలో చదివిన బ్రాండ్లు అన్నీ.. కేవలం అనుమతి కోరుతూ, మద్యం తయారీ కంపెనీలు చేసుకున్న దరఖాస్తులకు సంబంధించినవే. మాకు ఫలానాబ్రాండ్ .. ఫలానా పేరుతో కావాలంటూ మద్యంతయారీ కంపెనీలవారు.. ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఏకంగా అవన్నీ చంద్రబాబు రాష్ట్రంలో అమ్మించేశారన్నట్టుగా సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలంటే భయం.. ఆయననోటినుంచి నిజంవస్తే… అదే ఆయనకు చివరిరోజు అవుతుందని ఆయనకు తెలుసు. అందుకే ఎప్పుడూ నిజంచెప్పడు. ముఖ్యమంత్రి నిన్నసభలోచెప్పిన బ్రాండ్ల పేర్లన్నీ అనుమతికోసం మద్యంతయారీదారులు పెట్టుకున్న దరఖాస్తులకుసంబంధించినవే. జగన్మోహన్ రెడ్డి చెప్పిన బ్రాండ్లన్నీ చంద్రబాబుగారు గతంలోనే నిర్ద్వందంగా తిరస్కరించారు. మద్యంబ్రాండ్లు అనేవి కొనుగోలు చేసేవారి ఇష్టాలప్రకారంఉంటాయా… లేక ప్రభుత్వఇష్టప్రకారం అమ్ముతారా?

డబ్బిచ్చి కొనేవాడికి ఏదికావాలో అదిఇవ్వకుండా……తాముఏదిఇస్తే అదే తీసుకోవాలి… అదీతాముచెప్పిన ధరకే వినియోగదారుడు తీసుకోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యంఅమ్మకాలున్నాయి. తాముచెప్పేవి అబద్ధాలే అయితే ముఖ్యమంత్రి ఎందుకు అసెంబ్లీలో చర్చించడంలేదు? తమవి అబద్ధాలు అని ఆధారాలతో సహా సభలోచర్చించి నిరూపించే ధైర్యం జగన్ రెడ్డికి లేదు. కానీ ముఖ్యమంత్రే రాష్ట్రంలోసాగుతున్న మద్యంమాఫియాకు డాన్ అని తాము ఆధారాలతో సహా నిరూపిస్తాం. తమ డిమాండ్ ను గౌరవించిసభను నడపగల ధైర్యం ముఖ్యమంత్రికిఉందా?

అయ్యన్నపాత్రుడు..సుధాకర్ యాదవ్.. ఆదికేశవులు నాయుడు అని కొందరు టీడీపీ నేతల పేర్లుచెప్పిన ముఖ్యమంత్రి, మద్యం తయారీ కంపెనీలన్నీ టీడీపీ వారివే అంటున్నాడు. వారికి అసలు ఇప్పుడు మద్యంకంపెనీలు లేనేలేవు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని లాగేసుకొని, తన వాళ్లకు అప్పగించాడు.

అయ్యన్న పాత్రుడుపేరుతో ఉన్న డిస్టిలరీ కంపెనీని ఎప్పుడో విజయసాయిరెడ్డి తీసేసుకున్నాడు. చంద్రబాబునాయుడు పెట్టిన పథకాలను తీసేసిన జగన్మోహన్ రెడ్డి.. ఆయన పెట్టాడనిచెబుతున్న డిస్టిలరీ కంపెనీలను ఉంచుతాడా? ముఖ్యమంత్రి సభలో చెప్పినవన్నీ అబద్ధాలే. కాదని చెప్పే ధైర్యం ఆయనకు ఉంటే, తక్షణమే మద్యం అమ్మకాలు.. సారా మరణాలపై అసెంబ్లీలో చర్చకు అనుమతించాలి.

మద్యంతయారుచేస్తోంది.. అమ్ముతోంది.. ప్రజలజేబులు కొల్లగొడుతోంది…. ఆఖరికి ఆ మద్యంలో ఏమీలేదని దొంగసర్టిఫికెట్లు ఇప్పిస్తోంది అంతా జగన్మోహన్ రెడ్డే. టీడీపీవారిని ఇళ్లల్లోనుంచి బయటకే రానివ్వని ముఖ్యమంత్రి.. మద్యం అమ్ముకోనిస్తాడా? ప్రజలు మరీ అంతపిచ్చోళ్లని ముఖ్యమంత్రి భావిస్తే అతనికే నష్టం.

ఓట్ల కోసం మద్యనిషేధమన్న జగన్ రెడ్డి… ఇప్పుడేమో ప్రజల సంక్షేమంకోసమే కల్తీమద్యం..నాటుసారాతో ప్రజలప్రాణాలు తీస్తున్నామంటున్నాడు : అనగాని సత్యప్రసాద్
మహిళా ఓట్ల కోసమే మద్యపాననిషేధాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఓట్లకోసం నిషేధమనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి…ఇప్పుడు సంక్షేమంకోసమే ప్రజలప్రాణాలు తీసే మద్యంఅమ్ముతాను అంటున్నాడు. తాము సభలోలేనప్పుడు వాస్తవాలు దాచి, సభలో అబద్ధాలుచెప్పాడు. సారావల్ల మరణించినవారి పోస్ట్ మార్టమ్ నివేదికల్లోని అంశాలతో పాటు, జేబ్రాండ్స్ లోని కల్తీవిషపదార్థాలపై చర్చించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? జగన్మోహన్ రెడ్డిది..ఆయనబినామీలవికాకుండా ఇతరులకు చెందిన ఒక్కడిస్టిలరీ అయినా రాష్ట్రంలో ఉందా?

వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న జగన్ రెడ్డి….తన సంపాదనకోసమే కొత్తమద్యం పాలసీతెచ్చాడు. తెలంగాణలో డిస్టిలరీలుఉంటే.. ఏపీలో మద్యంతయారీ మొలాసిస్ ఉంది. ఏపీలో మద్యంతయారీ కంపెనీలకుఅనుమతులుఇవ్వడానికి చంద్రబాబు ఆలోచనచేశారుగానీ.. దాన్ని అమలుచేయలేదు. చంద్రబాబుగారు కొత్తడిస్టిలరీలకు అనుమతులిచ్చినా..ఏనాడూకల్తీమద్యాన్ని, ప్రోత్సహించలేదు. చంద్రబాబుగారి హాయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒకటీరెండు డిస్టిలరీలు అన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బినామీలే నడుపుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు టీడీపీవారి డిస్టిలరీలుఉంటే వాటినెందుకు మూసేయడంలేదు? పేదలకు ఇస్తున్నబియ్యాన్ని వైసీపీనేతలే కొని, వాటినుంచేమద్యం తయారుచేస్తున్నారు. మద్యంతయారీ , అమ్మకాలు..సరఫరా.. హలోగ్రామ్ లేబుళ్లు అంటించడం సహా, అంతా ముఖ్యమంత్రి మనుషులే చేస్తున్నారు. పల్లీలు అమ్మేవాడుకూడా ఫోన్ పే లాంటివి వాడుతుంటే, జగన్ రెడ్డి ఎందుకు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అమలుచేయడు?

నాటుసారావల్ల చనిపోయినవారి వివరాలను ముఖ్యమంత్రి వక్రీకరిస్తు న్నాడు. ప్రజల్లోకివచ్చి కల్తీమద్యం, నాటుసారాఅంశాలపై సమాధానంచెప్పే ధైర్యం జగన్మోహ న్ రెడ్డికి ఉందా? మద్యపాననిషేధం చేస్తాననిచెప్పిన వ్యక్తి, ఆడబిడ్డలతాళిబొట్లు తెంచుతూ సిగ్గులేకుండా సంక్షేమం అనిచెప్పుకుంటున్నాడు. నాటుసారా మరణాలపై సభలో చర్చించే ధైర్యం ముఖ్యమంత్రికిఉంటే, మేంసిద్ధంగాఉన్నాము. రాష్ట్రంలో సాగుతున్న జేబ్రాండ్స్ మద్యంవ్యాపారం.. కల్తీసారా అమ్మకాలన్నీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు, వైసీపీ నేతలే సాగిస్తున్నారు.

మద్యం, సారా అమ్మకాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. : ఏలూరి సాంబశివరావు
మద్యనిషేధం హామీపై సమాధానంచెప్పుకుండా ముఖ్యమంత్రి ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నాడు. ఏకపక్షంగా అసెంబ్లీ నడిపించి, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హాలీవుడ్ సినిమారేంజ్ లో మద్యంమాఫియాను సృష్టించాడు… గ్రామస్థాయిలోకూడా దానివ్యాప్తి విశృంఖలమైంది. తనకునమ్మకస్తులైన అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి, మద్యంఅమ్మకాలు సాగిస్తున్నాడు.

వాసుదేవరెడ్డికి అర్హత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ని చేశాడు. సత్యప్రసాద్ అనేవ్యక్తికి సదరు కార్పొరేషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. జగన్ రెడ్డి కొత్తమద్యం పాలసీ… ఆయనకు ఇప్పటికే రూ.7వేలకోట్లు తెచ్చిపెట్టింది. వైసీపీకార్యకర్తలతో మద్యం దుకాణాలు నడిపిస్తూ, వాలంటీర్ల సాయంతో మద్యం డోర్ డెలివరీ చేపట్టాడు. మద్యం సరఫరా కాంట్రాక్ట్ లన్నీ వైసీపీఎంపీ మిథున్ రెడ్డి బంధువులే నిర్వహిస్తున్నారు.

అక్రమ మద్యాన్ని నివారించడంకోసం చంద్రబాబు తీసుకొచ్చిన హాలోగ్రామ్ విధానాన్ని జగన్ రెడ్డి తొలగించాడు. మద్యం దుకాణదారులు.. తయారీదారులు… సరఫరాఃదారులకు విధిగా జేట్యాక్స్ కట్టాలనే షరతుపెట్టాడు. రూ.10, రూ.12కితయారయ్యే క్వార్టర్ మద్యంసీసాను ముఖ్యమంత్రి రూ.250 నుంచి రూ.300కు అమ్ముతున్నాడు. మద్యంతాగేవారందరికీ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న దోపిడీగురించి తెలుసు. ప్రభుత్వంచూపిన లెక్కల్లోనే రూ.7వేలకోట్ల అవినీతి మద్యంఅమ్మకాల్లో బయటపడింది.

కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన ఆదాయం కట్టకుండా లక్షలకేసుల మద్యాన్ని వైసీపీకార్యకర్తలు గడపగడపకు సరఫరా చేస్తున్నారు. లెక్కాపత్రంలేకుండా వేలకోట్లమద్యాన్ని స్థానికవైసీపీనేతలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు.. జడ్పీటీసీలు.. సర్పంచ్ లు 175 నియోజకరవర్గాల్లో అమ్మేస్తూ, ముఖ్యమంత్రి ఖజానా నింపడానికి శ్రమిస్తున్నారు. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో నాటుసారా, కల్తీమద్యం అమ్మకాలు సాగుతున్నాయి.

వాటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతామనే తమను అసెంబ్లీనుంచి బయటకు పంపారు. చంద్రబాబుగారు పరిశ్రమలు తీసుకొచ్చి సంపదసృష్టించి, పేదలకు పంచాలని చూస్తే, జగన్మోహన్ రెడ్డి మద్యం ఆదాయాన్ని అమ్మఒడికి, ఆడబిడ్డలకు ఇస్తున్నానని సిగ్గులేకుండా గొప్పలుచెప్పుకుంటున్నాడు. రాబోయే రోజుల్లోకూడా మద్యంపై వచ్చే ఆదాయంపై అప్పులు తేవడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. రాష్ట్రంలో మద్యంమాఫియా ఎంతలా వేళ్లూనుకుందో…దానికి సమాంతరంగా బియ్యం మాఫియా విస్తరిస్తోంది .

మద్యం తయారీలో గతంలో చెరకునుంచి మొక్కజొన్న నుంచి వచ్చే ముడిపదార్థాలు వాడేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని, బియ్యంనూకను మద్యం తయారీ (ఈఎన్ఏతయారీ) కి వినియోగిస్తున్నారు. మొక్కజొన్న, చెరకు ముడిపదార్థాలైన 1 టన్నుమొలాసిస్ నుంచి 240 లీటర్ల మద్యంతయారైతే.. 1టన్ను మొక్కజొన్ననుంచి 530లీటర్లు తయారవుతుంది. 1టన్ను బియ్యంనుంచి 550 లీటర్ల మద్యం తయారవుతోంది. పేదలఆకలితీర్చే రేషన్ బియ్యాన్ని కే.జీ.రూ. 20ల చొప్పున ప్రభుత్వంలోని వారే మద్యంతయారీకంపెనీలకు తరలిస్తున్నారు.

ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీవారే నేరుగా పేదలనుంచి రేషన్ బియ్యాన్ని కొంటున్నారు. ఈ విధమైన వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలు తమవద్దఉన్నాయి. అలానే మద్యంతయారీ… దాని సరఫరా…అమ్మకాలుకూడా వైసీపీవారే చేస్తున్నారు. ప్రజలముక్కుపిండి మరీ ముఖ్యమంత్రి మద్యంఅమ్మకాలపై ఇప్పటికే రూ.7వేలకోట్లవరకు కాజేశాడు. రాబోయేరోజుల్లో మరో 5వేలకోట్లు కాజేయడానికి పథకరచన చేశాడు. రాష్ట్రంలో అమ్ముతున్న 25లక్షలకేసుల మద్యంలో 11లక్షలకేసుల మద్యం జేబ్రాండ్ల తాలూకా మద్యమే. మిగిలిన మద్యంఅంతాకూడా ముఖ్యమంత్రికి జేట్యాక్స్ కట్టే డిస్టిలరీకు చెందినదే. తాముచెబుతున్న ప్రతి అంశానికి తమవద్ద ఆధారాలున్నాయి.

వాటిని పరిశీలించి, ప్రజల ముందు ఉంచే ధైర్యం ముఖ్యమంత్రికిఉంటే….తక్షణమే మద్యంఅమ్మకాలు, నాటుసారా మరణాలపై చట్టసభలో చర్చచేపట్టాలి. నాటుసారా మరణాలఅంశంతోపాటు.. రాష్ట్రంలోవేళ్లూనుకున్న మద్యంమాఫియాపై సీబీఐ విచారణకు…న్యాయవిచారణకు ఆదేశించే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా అని నిలదీస్తున్నాం. ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని కూడా వైసీపీవారే కాజేస్తున్నారు. రాష్ట్రంలో తాగేవారి సంఖ్యపెరుగుతుంటే, మద్యంఅమ్మకాలు పెరగాలి..కానీ తగ్గుతాయా? 35లక్షల కేసుల అమ్మకాలు జరగాల్సిఉంటే… 22లక్షలు.. 25లక్షల కేసులు ప్రభుత్వలెక్కలప్రకారం అమ్ముతున్నారు.

మిగిలిన మద్యాన్ని ముఖ్యమంత్రి లెక్కలో అమ్ముతూ. … అలావచ్చే ఆదాయాన్ని జగన్ రెడ్డి ఖజానాకు చేరుస్తున్నారు. ముఖ్యమంత్రి దోచుకుంటున్న సొమ్ముఅంతా పేదప్రజలనుంచి రక్తం పీల్చి కాజేస్తున్నదే. ఆసొమ్మంతా ఆయననుంచి రికవరీచేయాలంటే దానికి న్యాయవిచారణ ఒక్కటే మార్గమని డిమాండ్ చేస్తున్నాం.

ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యందోపిడీకి కోటి 39లక్షలమంది బలిఅవుతున్నారు : మంతెన రామరాజు
మమ్మల్ని సభనుంచి బయటకుపంపి, ముఖ్యమంత్రి, ఆయనపార్టీసభ్యులు వారికివారు డబ్బాలుకొట్టుకుంటూ, డబ్బులుపోగేసుకునే వ్యవహారాలునడిపితేఎలా? రాష్ట్రంలో పిల్లలతోకలిపి 5.46కోట్లమంది జనాభాఉంటే, వారిలో 365రోజులు తాగేవారు… 37లక్షల మంది వరకుఉన్నారు. 37లక్షలమంది నిత్యంతాగడంవల్ల వారితోపాటు, వారికుటుంబాల్లోని వారుకలిపి కోటి39లక్షలమంది నానాఅవస్థలుపడుతున్నారు.

మద్యంతాగేవారికి సంబంధించిన ప్రతికుటుంబంనుంచి ఈప్రభుత్వానికి ఏటా రూ.54వేలవరకు ఆదాయం వస్తోంది. ఒక్క కుటుంబంనుంచే మద్యంపై ఈ ప్రభుత్వానికి రూ.54వేలు వస్తే..ఇతరత్రా రూపాల్లో ఎంతవస్తుందో ఆలోచించండి. పొగతాగడం.. మద్యంసేవించడం ఆరోగ్యానికి హానికరమని చెప్పి, ప్రజలను వాటికి దూరంగా ఉంచాల్సినప్రభుత్వమే వాటి అమ్మకాలతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. కరోనా సమయంలో కూడా ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం తగ్గలేదు. అందుకు కారణం రాత్రీపగలు తేడాలేకుండా ఈ ముఖ్యమంత్రి సాగించిన సారా, మద్యం అమ్మకాలే. మద్యంఅమ్మకాలకుతోడు, నిత్యావసరాలు..కూరగాయల ధరలు ఇతరత్రా వస్తువుల ధరలు రెండింతలు పెంచిమరీ ముఖ్యమంత్రి కరోనాసమయంలో ప్రజలను దోచుకున్నాడు.

ప్రభుత్వంఅమ్ముతున్న నాటుసారా విక్రయాలు పశ్చిమగోదావ రిలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలుకూడా దారుణంగా పెరిగాయి. జనవరినుంచి చూస్తే నాటుసారాకు సంబంధించి 187వరకు కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం నిజంగా మద్యందుకాణాలు తగ్గిస్తే, ఆదాయం ఎందుకుతగ్గడంలేదని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెబుతున్నవి వాస్తవాలో.. మేం చెబుతున్నవి వాస్తవమో తేలాలంటేసభలో మద్యంఅమ్మకాలు..నాటుసారా విక్రయాలపై ముఖ్యమంత్రి చర్చచేపట్టాలి.

సభలో ఏంఅంశంపైనైనా చర్చించేముందు తమ అభిప్రాయాలు..ఆలోచనలను ప్రజల్లోకి వెళ్లేలాచేయాల్సిన బాధ్య ప్రభుత్వానికి లేదా? అలాచేయగల ధైర్యం ఈప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేవనిఅర్థమైంది. కాబట్టే టీడీపీసభ్యులు లేకుండానే ఉభయసభలనుతూతూమంత్రంగా నడిపిస్తున్నారు. ప్రతిపక్షసభ్యులు లేకుండా సభలనునడుపుతున్న పాలకులు వారిపైశాచికత్వాన్ని, పచ్చి అబద్ధాలను… సత్యదూరమైన మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనిచూస్తున్నారు.

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియాసమావేశంలో టీడీపీ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మలరామానాయుడు, పయ్యావుల కేశవ్, డోలాబాలవీరాంజనేయస్వామి, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్ రావు, వేగుళ్లజోగేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్,పీ.వీ.జీ.ఆర్. గణబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply