Suryaa.co.in

National Telangana

చైనాలో అయితే కేసీఆర్‌ను ఉరి తీసేవారు

కేసీఆర్ ఓపెన్ కోర్టుకు ఎందుకు హాజరుకాలేదు?
– వన్‌టువన్ ఎందుకు అడగలేదు?
– కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: ఇప్పటి వరకు విచారణకు వచ్చిన అందరూ కమిషన్ ముందు ఓపెన్ కోర్టులో సమాధానాలు చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఎందుకు వన్ టు వన్ అడిగారో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

చైనాలో ఇలాంటి కమిటీ వేస్తే, రెండు రోజుల్లో కేసీఆర్‌ను ఉరి వేసేవారన్నారు. కేసీఆర్‌కు ఏ దేశంలో అత్యున్నత అవార్డు ఇస్తారో చెప్పాలన్నారు.
కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారు? వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలన్నారు. కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు ప్రభుత్వానికి కుట్ర చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 48 లక్షలు ఎకరాలకు నీళ్లు అందించినట్టు వారు చేబితే సమర్థించే వాళ్ళమన్నారు.

కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టు చైనాలో కట్టి ఉంటే ఉన్నతమైన అవార్డు వచ్చేదని కేటీఆర్ అంటున్నారు, చైనాలో ఇలాంటి ప్రాజెక్టు కేసీఆర్ కట్టి ఉంటే ఈరోజు ఆయనను ఉరి తీసేవార న్నారు. రూ. 30 వేల కోట్లు అయ్యే ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు.

LEAVE A RESPONSE