Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో విశ్వగురు స్ధానంలో భారత్

– 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
– వైద్య ఆరోగ్య మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్

అమరావతి : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా తోటి భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. 75 ఏళ్ల క్రితం ఈ రోజున….వివక్ష, అసమానత మరియు దోపిడీతో కూడిన శతాబ్దాల విదేశీ పాలనకు ముగింపు పలికే భారత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకొని మన భవితను మనమే నిర్మించుకునే బాధ్యతల్ని మన చేతుల్లోకి తీసుకున్నాం.

1950లో ఈ రోజున అమల్లోకొచ్చిన రాజ్యాంగం ద్వారా భారతదేశ‌ ప్రజలు నిర్ణయించిన మేరకు చట్టబద్ధమైన మరియు ప్రజాస్వామ్య పాలనా వాతావరణంలో సార్వభౌమ భారతదేశంలోని పౌరులంద‌రికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించి సోదరభావాన్ని పెంపొందించడం మన పవిత్ర రాజ్యాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గత 75 ఏళ్ల‌లో గణతంత్ర భారత్ వివిధ రంగాలలో పురోగతిని చూసింది కానీ… కొంద‌రి పాలకుల దుష్పరిపాలన, అవినీతి మరియు అసమర్ధత కారణంగా అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఎద‌గ‌లేక‌పోయం.

ఎన్నో అవకాశాలను జారవిడుచుకొని అమల్యాసమయన్ని కోల్పోయాం. మన ప్రజల శక్తిసామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. ఎమెర్జెన్సీ కాలంలో దేశ స్థాయిలోనూ, రాష్ట్రాల్లో ప‌లు సందర్భాల్లో రాజ్యాంగ స్ఫూర్తి పై దాడులు జరిగినా ప్ర‌జ‌లు వాటిని ఎదిరించి తిప్పికొట్టారు. 2019-24లో మన రాష్ట్రంలో తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ప్రజలు తమ స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఏకమై గత సంవత్సరం ఎన్నికల్లో రాజ్యాంగ వ్యతిరేక శక్తులను గుణ పాఠం చెప్పారు.

2014 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శక్తివంతమైన మరియు దార్శనిక నాయకత్వంలో గణతంత్ర భారత దేశం అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిర్భవించడానికి ధృడంగా కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈ చారిత్రాత్మక రోజున, సమృద్ధిగా ఉన్న మన విస్తృత శ్రేణి మానవ, మేధో, సాంస్కృతిక మరియు సహజ వనరుల్ని ఉత్తమ స్థాయిలో ఉపయోగించుకుంటూ…విశ్వగురువుగా ఆవిర్భవించడం ద్వారా మన మాతృభూమి భారతదేశాన్ని అన్ని రంగాలలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి దేశంగా తీర్చిదిద్దేందుకు మనం పునరంకితమ‌వుదాం.

LEAVE A RESPONSE