హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో తనిఖీలు

– ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు
– భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలి: పోలీసులు

నగరంలోని బీజేపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు మరోసారి భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇటీవల పట్టు బడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉండటం, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో పోలీసులు కలియతిరిగి కొలతలు తీసుకున్నారు.

యూపీలో ఎంపీ అసదుద్దీన్ ఘటన తర్వాత పోలీసులు అప్రమతమయ్యారు. కార్యాలయం చుట్టూ పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే అవకాశముందని గతంలో నిఘావర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో కార్యాలయానికి భద్రత కల్పించాల్సి‌ బాధ్యత పోలీసులదే అని బీజేపీ పేర్కొంది.

ఈ క్రమంలో పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో‌ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. అయితే భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.