– పరిశీలించిన మంత్రి నారాయణ
విజయవాడ: విజయవాడలోని వరద ప్రాంతాల్లో జోరుగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్ లో భాగంగా డ్రైనేజీ పై బ్లీచింగ్ చల్లారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఏమన్నారంటే… పాయకాపురంలో కొన్ని ప్రాంతాల్లో నీరు ఇంకా నిల్వ ఉంది. రేపు సాయంత్రానికి మొత్తం నీరు తగ్గిపోతుంది. నీరు తగ్గిన 24 గంటల్లో గా సాధారణ పరిస్థితి తీసుకొస్తాం.. వరద తగ్గిన ప్రాంతాల్లో మంగళవారం కల్లా శానిటేషన్ పూర్తి అవుతుంది. వర్షం రావడం వల్ల కొద్దిగా పనులకు అంతరాయం కలిగింది… డ్రైనేజ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం.. నీరు ఉన్నప్పటికీ చెత్తను తొలగించకుంటే అంటు వ్యాధులు వస్తాయి. అందుకే నీటిలో ఉన్న చెత్త తొలగిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తున్నాం.