– టెమాసెక్ స్ట్రాటజిక్ హెడ్ రవి లాంబాతో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్టాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… శరగవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో టెమాసెక్ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి.
ఎపి ఇండస్ట్రియల్ క్లస్టర్‌లలో REIT మోడల్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయండి. వైజాగ్, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయండి. అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్ తో కలసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. వైజాగ్, తిరుపతిలో సెమా టెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డాటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించండి.
ఎపిలో మూడు అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్లు, 20 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయి. పవర్ ట్రాన్స్ మిషన్ ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
రవి లాంబా మాట్లాడుతూ… రాబోయే మూడేళ్లలో భారత ఫైనాన్షియయల్ సర్వీసెస్, హెల్త్ కేర్ రంగాల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాం. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.