Suryaa.co.in

Editorial

రోజాపై మళ్లీ ఐరెన్‌లెగ్ ట్రోల్!

– కుంభమేళాకు వెళ్లిన రోజా
– తొక్కిసలాటలో 30 మంది మృతి
– రోజా లెగ్ మహత్యమేనంటూ సోషల్‌మీడియాలో ట్రోలింగ్

( సుబ్బు)

మాజీమంత్రి, వైసీపీ నేత ఆర్‌కె రోజా సుదీర్ఘకాల విరామానంతరం మళ్లీ ‘ఐరెన్‌లెగ్’గా ట్రోల్ అవుతున్నారు. గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు, ఐరన్‌లెగ్ అన్న ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. తర్వాత వైసీపీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఆ ట్రోలింగ్‌కు తెరపడింది. మళ్లీ ఇప్పుడు మహాకుంభమేళా నేపథ్యంలో, ఆమెపై ఐరెన్‌లెగ్ ట్రోల్ మొదలయింది.

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ కోటిమందికి పైగా భక్తులు కుంభమేళాకు వెళ్లి, పుణ్యస్నానాలు చేస్తున్న విషయం తెలిసిందే. దేవుడిని బాగా నమ్మే మాజీ మంత్రి రోజా కూడా ప్రయాగరాజ్‌కు వెళ్లి పుణ్యస్నానం చేశారు. అందులో తప్పేమీలేదు.

కానీ రోజా కుంభమేళాకు వెళ్లిన వేళావిశేషం ఫలితంగానే, అక్కడ తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారంటూ.. సోషల్‌మీడియాలో తెగ ట్రోలింగ్ మొదలయింది. రోజా అక్కడకు వెళ్లకపోతే 30 మంది భక్తులు హాయిగా స్నానాలు చేసి ఇళ్లకు చేరేవారని, రోజా అక్కడకు వెళ్లడం వల్ల ఆమె పాదమహత్యం ఫలితంగా, అంతమంది ఒకేసారి వైకుంఠయాత్రకు వెళ్లారంటూ నెటిజన్లు శరపరంపరగా ట్రోల్ చేస్తున్నారు.

ఐరన్‌లెగ్ మహత్యం మళ్లీ మొదలయింది.. అమ్మా రోజా దయచేసి మీరు దేశప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సాహసాలు చేయకండి.. మీ పర్యటన కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం.. కావాలంటే మీకు నిలువెత్తు విగ్రహాలు కొని పంపిస్తాం. ఇంట్లోనే పూజలు చేసుకోండి. అంతేగానీ ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావద్దు. మీ కాళ్లు మొక్కుతాం.. మీకు అంతగా వెళ్లాలనుకుంటే మీ జగనన్న మాదిరిగా ఇంట్లోనో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్‌లోనో ఎంచక్కా సెట్టింగ్‌వేసుకుని అక్కడికి వెళ్లినట్లు ఫీలవండి.. అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. పాపం రోజా!

LEAVE A RESPONSE