Suryaa.co.in

Andhra Pradesh

రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా?

-చంద్రబాబు రైతుల్ని కలిసివెళ్లాకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యంకొనుగోళ్లు మొదలెట్టింది
– ప్రభుత్వం సకాలంలో స్పందించి ముందస్తు జాగ్రత్తలు తీసుకొనిఉంటే నేడు రైతులు సర్వంకోల్పోయి రోడ్డునపడేవారు కాదు
• రైతులు సర్వంకోల్పోయి కష్టాల్లో ఉంటే, ఆదుకోలేని ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా?
• ప్రభుత్వం ఏప్రియల్ 1 నుంచే ధాన్యంకొనుగోళ్లు జరిపి, రైతులకు సకాలంలో డబ్బులిచ్చి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేదికాదు.
• చంద్రబాబు ఐదేళ్లలో ఇన్ పుట్ సబ్సిడీకింద రైతులకు రూ.3,759కోట్లుఇస్తే, జగన్ నాలుగేళ్లలో ముక్కిమూలిగి రూ.1911కోట్లు ఇచ్చాడు.
– శేషు టీడీపీ అధికారప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర

వైసీపీప్రభుత్వం సకాలంలో స్పందించి ముందస్తుచర్యలు తీసుకోనందునే అకాలవర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గోదావరిజిల్లాల్లోని రైతులతో పాటు, కృష్ణాడెల్టా ప్రాంతంలోని రైతాంగం పంటలుకోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అలాంటివారిని ఆదుకోవాల్సిన మంత్రే వారిని ఎర్రిపప్ప అనడం బాధాకరమని టీడీపీ అధికారప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

రైతుల్ని ఎర్రిపప్పలు అని అవమానించిందికాక, ఆపదానికి కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి కారుమూరి తక్షణమే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
“ రైతుల్ని ఎర్రిపప్ప అన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆ పదానికి బుజ్జికన్నా అనే సరికొత్త నిర్వచనం చెప్పారు. ఆయనమాటప్రకారమే మేంకూడా మంత్రిని ఎర్రిపప్పా అనే సంబోధిస్తూ, ఎర్రిపప్ప మంత్రిగారు ఇప్పటికైనా రైతుల్ని అవమానించడం మానుకోండి. వారిని దుర్భాషలాడటం ఎంతవరకు సబబో మీరే సమాధానంచెప్పండి. గోదావరి జిల్లాల రైతుల్ని అవమానించిన మంత్రి కారుమూరి తనతప్పు తెలుసుకొని వెంటనే వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గోదావరిజిల్లాల్లో రైతుల్ని పరామర్శించి వెళ్లాకే ప్రభుత్వంలో కదలికవచ్చింది. ఆఘమేఘాల మీద హుటాహుటిన ధాన్యంకొనుగోళ్లకు తెరలేపింది. గతంలో కూడా గో దావరి ప్రాంతంలో వరదలువచ్చి ధాన్యంరైతులు దెబ్బతింటే, చంద్రబాబుగారు ప్రభుత్వం తరు పునే ధాన్యంకొనుగోళ్లు జరిపించారు. ప్రతిధాన్యం గింజా కొని రైతులకు సకాలంలో డబ్బులు ఇచ్చారు. అలానే తిత్లీ, హుద్ హుద్ వంటి తుఫాన్ల సమయంలో ఆయన సకాలంలో స్పందించి వ్యవస్థల్ని అప్రమత్తంచేసి, ప్రజల్ని రైతుల్ని ఆదుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టారు. ఏప్రియల్ 1వ తేదీనుంచి వరికోతలుప్రారంభమైతే, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరపలేదు. సకాలంలో ధాన్యం సేకరించని ప్రభుత్వనిర్లక్ష్యమే నేడురైతుల కష్టాలకు కారణం. తడిచిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి కూడా రైతులకు సరైన స్థలాలులేవు. మొలకెత్తిన ధాన్యం, మొక్కజొన్న కళ్లముందే కుళ్లిపోతుంటే ఏలూరుజిల్లా రైతాంగం బోరుమంటోంది.

17శాతం కంటే తేమఎక్కువ ఉంటే ధాన్యంకొనమని చెప్పడం రైతుల్ని వంచించడం కాదా?

రైతులవద్ద ఉన్నధాన్యం మొత్తం కొనాలని కోరుతూ, నేడు ఏలూరు జిల్లా కలెక్టర్ని కలిస్తే, ఆయన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం కొంటామంటున్నారు. తేమశాతం 17శా తానికంటే ఎక్కువ ఉంటే ధాన్యంకొనమని కలెక్టర్ ఖరాకండిగా చెప్పేశారు. పాలకులనిర్లక్ష్యం తో చేతికందాల్సిన అన్నదాత కష్టం నీళ్లపాలైతే దానికి ప్రభుత్వం బాధ్యతవహించదా? ప్రభు త్వ నిర్వాకంతో రైతులునష్టపోతే, ధాన్యం తడిసిపోతే, వారికి న్యాయంచేయాల్సింది ఎవరు? రైతులుమరలా వ్యవసాయం చేసేదిశగా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే ఇలా నిర్లక్ష్యంగా నిర్ల జ్జగా వ్యవహరించడం సిగ్గుచేటు. నష్టపోయినరైతులకు అర్థరూపాయి సాయంకూడాచేయరా?

చంద్రబాబు పర్యటన తర్వాత ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది
చంద్రబాబు గోదావరిజిల్లాల్లో పర్యటించి వెళ్లాక ప్రభుత్వం 1,393 కోట్లవిలువైన ధాన్యం మాత్రమే కొనుగోలుచేసింది. కానీ క్షేత్రస్థాయిలో రూ.2,500కోట్ల విలువైన ధాన్యం ఉంది. కొన్న ధాన్యానికికూడా ప్రభుత్వం ఇంకా డబ్బుచెల్లించలేదు. కళ్లాల్లోనే మగ్గిపోతున్న ధాన్యా న్ని కాపాడుకోవడానికి జగన్ ప్రభుత్వం అటుసరిపడినన్ని గోతాలు ఇవ్వకుండా, తడిచిన రంగుమారిన ధాన్యం కొనకుండా రైతులు ఎలా కోలుకుంటారో ప్రభుత్వం సమాధానంచెప్పాలి. పంటలబీమాసొమ్ము జగన్ ప్రభుత్వం సకాలంలో చెల్లించనందునే రైతులు నేడు తీవ్రంగా నష్టపోయారు. రైతులపక్షాన తామే బీమాసొమ్ము మొత్తంచెల్లిస్తామన్న జగన్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోకుండా రైతులపుట్టి ముంచింది. గతంలో కూడా చంద్రబాబు అసెంబ్లీలో నేల పై కూర్చొని నిరసనతెలిపితేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థరాత్రి పంటలబీమా బకాయిలు విడుదలచేసింది.

చంద్రబాబు ఐదేళ్లలో ఇన్ పుట్ సబ్సిడీకింద రైతులకు రూ.3,759కోట్లుఇస్తే, జగన్ నాలుగేళ్లలో ముక్కిమూలిగి రూ.1911కోట్లు ఇచ్చాడు
చంద్రబాబుహాయాంలో ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.3,759.51 కోట్లను రైతులకు చెల్లించడం జరిగింది. 2016-17లోనే రూ.1820కోట్లుచెల్లించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం నాలుగేళ్లలో ముక్కిమూలిగికేవలం రూ.1911కోట్లు మాత్రమే చెల్లించాడు. రైతువ్యతిరేకి, దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి పాలనలో రైతులకు తీవ్రనష్టం జరుగుతోంది. రైతుభరోసా కేంద్రాలు అవినీతి, మోసాలకు కేంద్రాలుగా మారాయి. ఒకబస్తా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రైతునుంచి రూ.220వరకు వసూలుచేస్తోంది. ధాన్యంగోతాలు కూడా ఇవ్వలేని ఈప్రభుత్వం ఒక ప్రభుత్వ మా? నానాఅవస్థలుపడి గోతాలుసంపాదించి, సొంతఖర్చులతో ధాన్యం మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడకూడా మిల్లర్లతో కలిసి ప్రభుత్వం దోచుకుంటోంది. మిల్లర్లపై, దళారులపై కుంటి సాకులుచెప్పి, రైతుల్ని దోచుకోవడానికే ఈ ప్రభుత్వంఉందా? సకాలంలో రైతులవద్ద ధాన్యంకొని, వారికి వెంటనే డబ్బులిచ్చి న్యాయంచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ముఖ్య మంత్రికిలేదా?

జగన్ వచ్చాక రైతులకు ఒక్క చిన్న పరికరం ఇచ్చిందిలేదు. ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు, హార్వె స్టర్లు, ఇంజన్లు, పవర్ స్ప్రేయర్లు, రుణమాఫీ ఏవీలేకుండాపోయాయి. ఇంతదుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడూచూడలేదు. అప్పులు, నవరత్నాలపేరుతో నవమోసాలు తప్ప రాష్ట్రంలో ఏవర్గానికి ఏం ఒరిగిందిలేదు. మిరప, పొగాకు, ఇతరవాణిజ్యపంటలు నష్ట పోయినరైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతివరి రైతుకి జగన్ ప్రభు త్వం ఎకరాకు రూ.30వేలు పరిహారమివ్వాలి. ప్రతిధాన్యం గింజా జగన్ ప్రభుత్వమే కొనాలి. తానుఇచ్చినహామీప్రకారం జగన్ తక్షణమే రూ.3వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏర్పా టు చేయాలి. మంత్రి కారుమూరి రైతుల్ని అవమానించినందుకు వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 12వతేదీన చంద్రబాబు తలపెట్టిన పాదయాత్రను రైతులువిజయవంతం చేయాలి. ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని వేధించడం, రజనీకాంత్ లాంటివారిని విమర్శించడం మాని జగన్మోహన్ రెడ్డి రైతులవెతల గురించి ఆలోచించాలి.” అని శ్యామచంద్రశేషు సూచించారు.

LEAVE A RESPONSE