Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు మనిషా? యంత్రమా?

వయసు 75 ఏళ్ళు… అయినా విశ్రాంతి ఎరుగని యోధుడు! యూరోప్ పర్యటన ముగించుకుని, నేరుగా ఢిల్లీలో దిగాడు. కనీసం జెట్ లాగ్ విశ్రాంతి తీసుకోకుండా.. నేడు, కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కీలక చర్చలు!

ఉదయం 10:30 గంటలకు సీఆర్ పాటిల్‌తో భేటీ… పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై సమగ్ర చర్చ… ఆంధ్రప్రదేశ్ జీవనాడి కోసం చంద్రబాబు అంకితభావం!

ఉదయం 11:15 గంటలకు అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో సమావేశం… కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంతనాలు… రాయలసీమ ప్రజల న్యాయం కోసం చంద్రబాబు పట్టుదల!

మధ్యాహ్నం 12 గంటలకు పీయూష్ గోయల్‌తో చర్చలు… రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోసం చంద్రబాబు ప్రయత్నాలు!

మధ్యాహ్నం 1:40 గంటలకు అమిత్ షాతో కీలక సమావేశం… మే 2న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు మోదీ రాక… పర్యటన ఏర్పాట్లపై చర్చలు… ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తు కోసం చంద్రబాబు ప్రణాళికలు!

రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై చర్చ… రాజకీయ వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే చంద్రబాబు చాణక్యం!

ఒకవైపు 75 ఏళ్ల వయసు, మరోవైపు ప్రయాణాలు… అయినా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు సంకల్పం చెక్కుచెదరలేదు. ఆయన చూపించే శ్రద్ధ, ఆయన చేసే కృషి, ఆయనలోని పట్టుదల రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు అలుపెరుగని పోరాటం కొనసాగుతూనే ఉంది.

LEAVE A RESPONSE