Suryaa.co.in

Andhra Pradesh

ఒక నీచుడికి మరో నీచుడి పరామర్శనా?

• రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు
• రెండు రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్ళి జగన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటున్నాడు

• మానవతామూర్తి భువనమ్మ ని అసభ్యకరంగా మాట్లాడిన అరాచకవాదిని పరామర్శించేందుకు మరో అరాచకవాది పరామర్శకు వెళ్ళడం విచిత్రం
• వంశీపై ఉన్న అన్ని ఆరోపణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే శాశ్వతంగా వంశీ జైల్లోనే ఉంటాడు
• వైసీపీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలు, అవినీతిపై విచారణ జరుగుతోంది
– వైసీపీలో ఉన్న 90 శాతం మంది నాయకులు జైలుకు వెళ్ళనున్నారు.
• నిజంగా జగన్ రెడ్డి ప్రజాపక్షపాతి అయితే అసెంబ్లీకి రావాలి
-తప్పకుండా అతనికి మైక్ ఇస్తాం.. ప్రతీ విషయంపై చర్చించిస్తాం
– మంత్రి ఎస్ సవిత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు

మంగళగిరి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి జగన్ రెడ్డి మిర్చి యార్డుకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ప్రభుత్వంపై విషం చిమ్మడాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఖండించారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ…

“పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి అధికారం కోల్పోయాక మహిళలు, రైతుల మీద ప్రేమ పుట్టింది. రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా రైతులంటూ దగా చేశాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మేము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోవడం చూసి జీర్నించుకోలేక ప్రభుత్వంపై జగన్ రెడ్డి నత్యం విషం చిమ్ముతున్నాడు. మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉన్నా బేఖాతర్ చేశాడు. వైసీపీ పార్టీ చీటీని జగన్ రెడ్డే చింపేశాడని ప్రజలకు అర్థమై 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ రెడ్డి బుద్ధి రాలేదు” అని అన్నారు.

రైతులపై జగన్ రెడ్డి కపట ప్రేమ

“మిర్చి రైతులకు అండగా ఉంటానని పెద్ద డ్రామాకు తెరలేపాడు. మహానుభావా నువ్వు మిర్చి యార్డుకు వస్తే మాకు ఇంకా నష్టం చేకూరుతుందని రైతులు గగ్గోలు పెట్టారు. దాంతో వైసీపీ మూకలను రైతన్నలు వేషాలు వేయించి యార్డులో పంపించారు. 2014-19, 2019-24, నేడు ఉన్న మిర్చి ధరలపై చర్చకు జగన్ రెడ్డి సిద్ధమా? 2017లో క్వింటా మిర్చి ధర రూ.7 వేలు పలికినప్పుడు రైతులు నష్టపోకూడదని రూ.1,500 బోనస్ ఇచ్చి వారిని చంద్రన్న ఆదుకొని రైతుల పక్షపాతిగా నిలిచారు.

నాటి నుంచి నేటు వరకు రైతున్నల సంతోషం కోసం చంద్రబాబు గారు, లోకేష్ గారు అహర్నిసలు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ రెడ్డి పెట్టిపోయిన రూ.1,680 కోట్ల ధాన్యం బకాయిలను ఈ మంచి ప్రభుత్వం విడుదల చేసింది. నాణ్యతమైన ఎరువులు, మందులు, డ్రిప్ ఇరిగేషన్, పనిముట్లను ప్రభుత్వం అందిస్తుంది. గత ఐదేళ్లలో రైతన్నలకు జగన్ రెడ్డి ఏం చేశాడు?” అని ప్రశ్నించారు.

ఇక్కడ అల్లర్లు సృష్టించి బెంగళూరు పోయి పబ్జీ ఆడుతుంటాడు

“కడపకి వెళ్తే ఎంతోమంది కాంట్రాక్టర్లు అర్జీలు ఇస్తున్నారు. త్రాగు నీరు సమస్య పెరిగిపోయింది. బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్లను కూడా జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు. ముఖ్యంగా సాగు, త్రాగు నీరు లేక రాయలసీమ ప్రజలు ఇబ్బందులుపడ్డారు. 2019 ఎన్నికల్లో కొత్త ప్రాజెక్టులు కడతాను, రిజర్వాయుర్లు పూర్తి చేస్తాను, కాలువలు వెడల్పు చేసి ప్రతీ ఎకరాకు నీరు ఇస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశాడు. అన్నమయ్య డ్యాం మెంటెయిన్ చేయలేని వ్యక్తి జగన్ రెడ్డి. నిజంగా రైతులకు జగన్ రెడ్డి మంచి చేసి ఉంటే ఎందుకు పరదాలు కట్టుకొని తిరిగాడు.

నేడు ప్రజలంటే ప్రాణం అన్నట్లు రోడ్డుపై తిరుగుతున్నాడు. రెండు రోజులు విజయవాడలో ఉండి అల్లర్లు రేపి 4 రోజులు బెంగళూరుకు వెళ్ళి పబ్జీ ఆడుకుంటాడు. జగన్ రెడ్డిని చూసి వైసీపీ నాయకులు ఆందోళనలో పడిపోయారు. పార్టీ ఉనికిని కాపాడేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. నేడు రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోంది. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ వంశీని అరెస్ట్ చేసింది. పోలీసులు ఎక్కడున్నా వదిలిపెట్టను, బట్టలూడదీస్తానని జగన్ రెడ్డి వాడిన భాష సరైనది కాదు. పిచ్చి బాగా ముదిరితే లండన్ వెళ్ళి మందుల డోస్ పెంచుకోవాలి” అని సూచించారు.

ఎంతో మందికి విద్య, వైద్య దానం చేస్తూ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలందిస్తున్న భువనమ్మ గారిపై అసెంబ్లీ సాక్షిగా వంశీ అసభ్యకరంగా మాట్లాడాడు. జగన్ రెడ్డి పైశాచికానందం పొందాడు. అతన్ని పరామర్శించేందుకు జగన్ రెడ్డి వెళ్ళడం సిగ్గు చేటు. మహిళల పట్ల జగన్ రెడ్డికి అసలు గౌరవమే లేదు. సొంత చెల్లిని, తల్లిని గెంటేసిన నీఛుడు జగన్ రెడ్డి. సెక్షన్‌లు కూడా జగన్ రెడ్డే చెప్పి నాపై, అచ్చెన్నాయుడు పై, అయ్యన్నపాత్రుడు పై, జేసీ ప్రభాకర్ రెడ్డి పై, రఘురామకృష్ణంరాజు పై, కొల్లు రవింద్ర పై ఇలా అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతీ ఒక్కరిపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. చివరకు భవిష్యత్త్ తరాలకు దార్శనికతను పరిచయం చేసిన చంద్రబాబు గారిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు” అని తెలిపారు.

ప్రజా పక్షపాతి అయితే జగన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి

“ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మేము పోరాటం చేశాం. అసెంబ్లీ సాక్షిగా ప్రజల తరఫున గళం విప్పాం. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చకు రావాలి. మీకు మైకు ఇచ్చే బాధ్యత మాది. తప్పకుండా జగన్ రెడ్డి మాట్లాడేందుకు సమయం కేటాయిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలు, దౌర్జన్యాలు, కుంభకోణాలపై చర్చించుకుందాం” అని సవాల్ చేశారు.

పోలీసులను బెదిరించే విధంగా జగన్ రెడ్డి వ్యాఖ్యలు: సుజయకృష్ణ

అనంతరం మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ…”జైల్లో ఉన్న అరాచకవాది వల్లభనేని వంశీని పరామర్శించి పోలీసులను బెదిరించే విధంగా జగన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయి. ఐదేళ్ళు గన్నవరం నియోజకవర్గంలో ఎన్నెన్ని అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు వల్లభనేని వంశీ చేశాడు. మహిళలు, దళితులు, బీసీలను ఊచకోత కోసిన వంశీ గురించి జగన్ రెడ్డి బాధపడుతున్నాడు. చరిత్రలో ఎన్నడూ దేశంలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై మరో రాజకీయ పార్టీ దాడులు చేయలేదు.

జగన్ రెడ్డి ఆదేశాలతో దేవాలయంలాంటి టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినందుకు గాను పూర్తి ఆధారాలతో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాంటి వ్యక్తికి జగన్ రెడ్డి వత్తాసు పలుకుతూ పోలీసును బెదిరించడం కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నా. వంశీపై ఉన్న అన్ని అవినీతి, అక్రమ, దౌర్జన్యాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే శాశ్వతంగా వంశీ జైల్లోనే ఉంటాడు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలు, అవినీతిపై విచారణ జరుగుతోంది.. వైసీపీలో ఉన్న 90 శాతం మంది నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయం” అని అన్నారు.

LEAVE A RESPONSE