– సర్జరీ తర్వాత సైఫ్‌కు అంత ఫిట్‌నెస్ ఎక్కడిది?
– సైఫ్ బాడీ లాంగ్వేజ్‌పై అనుమానం
– ఐదు రోజుల్లోనే అంత ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఎలా నడిచారు?
– శివసేన నేత సంజయ్ నిరుపమ్ అనుమానం
ముంబయి: దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ నటుడు సైఫ్ అత్యంత వేగంగా రికవరీ అవ్వడంపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ అనుమానం వ్యక్తం చేశారు. కత్తిపోట్లకు గురైన సైఫ్… లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఐదు రోజుల తర్వాత మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆయన హుషారుగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు.
ఇదే విషయమై సంజయ్ నిరుపమ్ అనుమానం వ్యక్తం చేశారు. ” సైఫ్‌కు ఆరు కత్తిగాట్లు, 3 లోతైన గాయాలయ్యాయి. 2.5 అంగుళాల కత్తి అతనికి గుచ్చుకుంది. అతనికి డాక్టర్లు సర్జరీ చేశారు. కానీ ఐదు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సైఫ్, ఏమీ పట్టనట్లు హుషారుగా నడుస్తూ కనిపించాడు. ఇంత త్వరగా కోలుకోవడం సాధ్యమేనా? గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సైఫ్ ఐదు రోజుల్లోనే అంత ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఎలా నడిచారు. సైఫ్ బాడీ లాంగ్వేజ్‌పై అనుమానం వస్తోందని ” అనుమానం వ్యక్తం చేశారు.