– జగ నేమీ అమాయకుడు కాదు
– జగన్ను పట్టించుకోవడం మానండి
– జగన్ ట్రాప్లో కూటమి ఇరుక్కుంటుందా?
– జగన్ కోరుకుంటున్నదే కూటమి చేస్తుందా?
నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి ‘మావిగన్’ అని ప్రకటించగానే అందరిలా నేను కూడా నవ్వుకున్నాను. ఇంత అసాధ్యమైన, అసంభవమైన ప్రపోసల్ ఎలా ప్రకటిస్తున్నాడు అని నేను కామెడీగా 2-3 పోస్ట్లు పెట్టాను. కానీ, పార్లమెంట్ లో 40 పార్టీలు “హా” అని ఆమోదించిన బిల్ ను మారుస్తాను అని ఎలా అంటున్నాడు అన్నప్పుడు ఒక ఆలోచన స్ఫురించింది.
కూటమి సైనికులారా! ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఈ ప్రకటనలకు మనం నవ్వుకుంటున్నామా? లేక వాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నామా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక పిచ్చివాడిలా’ చూస్తూ, అతని మాటలకు పేరడీలు చేస్తూ, వీడియోలు ఎడిట్ చేస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మన విజయమా? లేక అతని కుట్రపూరితంగా వ్యూహమా?
జగన్ అనే వాడు ‘కమెడియన్’ కాదు… ఒక స్థిరమైన ‘కుట్రదారుడు’! అతని ఆలోచనలు, కుట్రలు పని చేస్తాయ లేదా అతనికి అనవసరం.
గతాన్ని మర్చిపోకూడదు కదా: తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ దృష్టికి వెళ్లేంత స్థాయిలో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి అతను. 18 నెలలు జైల్లో ఉన్నా, వేల కోట్ల అక్రమాస్తుల కేసులను దశాబ్ద కాలం మేనేజ్ చేస్తూ, పాదయాత్రతో అధికారాన్ని దక్కించుకున్నాడు. ఇది ఒక అమాయకుడు చేసే పని కాదు.
నారాసుర రక్త చరిత్ర: సొంత బాబాయ్ హత్యను సైతం ప్రత్యర్థుల మీదకు నెట్టి, ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ ప్రజలను నమ్మించి 2019లో గెలవలేదా? అది అతని మైండ్ గేమ్ కాదా?
ప్రస్తుత ట్రాప్: మొన్న ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్ గురించి అబద్ధాలు చెప్పినా, నిన్నటి ‘మావిగన్’ రాజధాని ప్రతిపాదన అయినా… అతనికి తెలుసు మనం వాటిని ట్రోల్ చేస్తామని. అతను కోరుకునేది కూడా అదే!
అతని అసలు అజెండా ఏంటంటే
అతని లక్ష్యం జస్ట్ అధికారం. అది ఉంటేనే, కేసులు నుండి బయటపడగలడు, లేదా సమయాన్ని సంపాదించుకోగలడు. సో ఆ అధికారానికి ఎన్ని అడ్డా దారులైన ఉపయోగించి దగ్గరగా ఉండాలి. దానికి షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇవి …..
మన సమయాన్ని వృధా చేయడం: లోక్సభలో పెమ్మసాని , పురందేశ్వరి రాష్ట్ర ప్రయోజనాల గురించి అద్భుతంగా మాట్లాడుతుంటే… మనం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం మానేసి, జగన్ చెప్పిన పిచ్చి మాటలను ట్రోల్ చేయడంలో బిజీ అయిపోయాం.
కూటమి విజయాలను మరుగున పడేయడం: చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తెస్తున్న పెట్టుబడులు, పెన్షన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి Positive Propaganda జరగకుండా మనల్ని జగన్ చుట్టూ తిప్పుకోవడమే ఆయన ప్లాన్.
నరేటివ్ సెట్ చేయడం: మనం ఎంత ఎక్కువ అతని గురించి పోస్టులు పెడితే, సోషల్ మీడియాలో అంత ఎక్కువ అతని పేరే వినిపిస్తుంది. నెగటివ్ అయినా సరే, తనే చర్చలో ఉండాలనేది జగన్ సైకో మార్కు పాలిటిక్స్.
మనం ఏం చేయాలి?
ఫ్రెండ్స్ ! జగన్ అనే ఒక ‘ఫెయిల్డ్ లీడర్’ను విమర్శిస్తూ కూర్చుంటే ఆయన ట్రాప్ లో పడ్డట్టే. మన ఫోకస్ మార్చాలి:
– కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికీ చేరవేయండి.
– అమరావతి నిర్మాణం, పోలవరం పనులు, కొత్త పెట్టుబడుల గురించి పోస్టులు పెట్టండి.
– జగన్ చేసే విన్యాసాలను లైట్ తీసుకోండి… వాటికి ఇచ్చే ప్రచారం అతనికి ఆక్సిజన్ లాంటిది.
గుర్తుంచుకోండి: జగన్ మనం అనుకుంటున్నట్టు ఒక ‘Eccentric’ మాత్రమే కాదు… మన ఎనర్జీని వేస్ట్ చేసి, మన సమయాన్ని వాడుకుంటున్న విషయాన్ని గమనించండి.
మన అజెండా మన ప్రభుత్వం – మన అభివృద్ధి!
అతని అజెండా తను మాత్రమే వార్తల్లో ఉండటం!
ఇప్పుడు మన ఎజెండా ఏంటో మనం డిసైడ్ చేసుకోవాలి!!
– సతీష్ మండవ