Suryaa.co.in

Andhra Pradesh

పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి?

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైకాపా నెత్తుటి దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైకాపా రౌడీ మూక దారుణంగా హత్య చేసింది. వివాద రహితుడైన రామారావును హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి? వైకాపాకు రోజులు దగ్గరపడే టిడిపి కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోంది. రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. రామారావు కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE