రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన వైరస్ ను పారద్రోలాల్సిన బాధ్యత మోదీకి లేదా?

-బెయిల్ పై ఉన్నవారంతా జైలుకెళ్తారని బీజేపీనేతలు అంటున్నారు.. అదెప్పుడు జరుగుతుంది?
– రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టిందని, అందుకు అవసరమైన మందు ప్రదాని మోదీ వద్ద ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఏపీకి పట్టిన వైరస్ ను అంతమొందించడంకోసం ప్రధాని మోదీ వెంటనే తనదగ్గరున్న మెడిసిన్ (మందుని) వాడాలి. వైరస్ పట్టిన రాష్ట్ర ప్రజలు కుళ్లి కృశించే వరకు మందువేయరా?
• వివేకాహత్యకేసుదర్యాప్తు తీరుపై కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు సమీక్ష చేయలేదు? ఎవరిని సంతోషపెట్టడానికి అలా వ్యవహరిస్తోంది.
• నెల్లూరుజిల్లా అధికారపార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా లోకల్ మాఫియాతో పోలీసులు చేతులుకలిపింది నిజమేనా? ఎమ్మెల్యేవ్యాఖ్యలపై డీజీపీ సమాధానంచెప్పాలి.
• మద్యపాననిషేధం అమలుచేస్తానన్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మద్యంఅమ్మకాలు 60శాతం పెరిగాయని చంకలుగుద్దుకుంటారా? ఇది ప్రజా ప్రభుత్వమా…లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

భారతీయ జనతా పార్టీ నిన్న నిర్వహించిన సభలో మాట్లాడిన జాతీయస్థాయి నాయకులు రాష్ట్రప్రభుత్వానికి వైరస్ పట్టిందని, ఆ వైరస్ కు మందు మోదీవద్ద ఉందని చెప్పుకొచ్చారని, మరి అలాంటప్పుడు ఆ మందును వెంటనే వేయకుండా, మోదీగారు ఎందుకు జాప్యంచేస్తున్నారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ఏపీ ప్రభుత్వానికి వైరస్ పట్టిందని గత రెండున్నరేళ్ల నుంచి తాము కూడా మొత్తుకుంటున్నాం. బీజేపీ వాళ్లు ఇప్పుడైనా గుర్తించారు సంతోషం. కానీ వైరస్ పట్టినప్పుడు, దాన్ని నిర్మూలించడానికి వెంటనే మెడిసిన్ ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నదే తమ ప్రశ్న.మాయలఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు, జగన్మోహన్ రెడ్డి జుట్టు మీరు పట్టుకొని సిట్ స్టాండ్ అంటూ ఆడిస్తారా? మరి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయి కదా.. దానికేం చేస్తారని బీజేపీ వారిని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన వైరస్ ను పారద్రోలాల్సిన బాధ్యత మోదీగారికి లేదా అని ప్రశ్నిస్తున్నాం. అన్నీ తెలిసీ ఎందుకిలా ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతూ, రాష్ట్రప్రజలను ఇబ్బంది పెడతారా? రాష్ట్రప్రభుత్వానికి వైరస్ పట్టిందనేవిషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసు.

వైరస్ కు మీ వద్ద ఉన్నప్పుడు దాన్ని వేయకపోవడం కేంద్రప్రభుత్వ ఘోరతప్పిదంకాదా? మందు మీ దగ్గ ర ఉంచుకొని దాన్ని ఎప్పుడువేస్తారని శ్రీ మోదీజీని ప్రశ్నిస్తున్నాం. మోదీగారు, ఇప్పటికైనా స్పందించి, రాష్ట్రం వైరస్ బారిన పడకముందే ఆ మందేదో వేయాలని విజ్ఞప్తిచేస్తున్నాం.

అలానే బీజేపీకి చెందిన మరోజాతీయ నేత మాట్లాడుతూ, బెయిల్ పై ఉన్నవారంతా జైలుకెళ తారని చెప్పుకొచ్చారు. దానిఅర్థం ఏమిటి? ఆమాట ఆయన ఇప్పుడు చెబుతున్నారు …తాము తమపార్టీ ఎప్పటినుంచో చెబుతున్నాం. సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్లు ఉండి, 16నెలలు జైల్లోఉండివచ్చిన వ్యక్తి గురించి

జడ్జీలుకూడా కామెంట్లు చేశారు. అతనికి బెయిల్ ఇవ్వడాని కి కూడా ఒకదశలో నిరాకరించారు.చావు తప్పి కన్నులొట్టపోయి బెయిల్ తెచ్చుకున్నాడు. మరి అలాంటివ్యక్తిపై ఉన్న కేసుల గురించి మీరుగానీ, కేంద్రలో ఉన్న మీప్రభుత్వం గానీ ఎప్పుడైనా సమీక్షించిందా? అవినీతికిపాల్పడిన రాజకీయనేతలపై ఉన్న కేసులవిచారణను సంవత్సరంలో పూర్తిచేస్తామన్న మోదీగారి మాటలు కార్యాచరణకు నోచుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నాం?

ఇక సామాన్యులకు న్యాయవ్యవస్థపై, ప్రభుత్వంలోని వారి వ్యాఖ్యలపై ఎక్కడ నమ్మకం కుదురుతుందని ప్రశ్నిస్తున్నాం. అసలు అన్నికేసులున్న వ్యక్తి ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే ప్రజలు చేసిన పెద్దతప్పు. రాజకీయాల్లో అవినీతి రాజ్యమేలి, అది అధికారంలోకి వస్తుందని ఆనాడు రాజ్యాంగాన్ని రాసినవారు అనుకోలేదు. లేకపోతే, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సహా, ఆనాటిమహానుభావులంతా ఎక్కడో ఏదోఒక మెలి క పెట్టేవారు. ఇలాంటివాళ్లు అధికారంలోకి రాకుండా, శాసనకర్తలుగా మారకుండా కచ్చితంగా భారతరాజ్యాంగం నిరోధించేది. అవసరాన్నిబట్టి, కాలమానపరిస్థితులను బట్టి రాజ్యాం గాన్ని సవరించాలనికోరుతున్నా.

లేకపోతే 16నెలలు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నవ్యక్తి, నేడు ముఖ్యమంత్రిగా ఉండి చట్టాలు ఎలాచేస్తాడని ప్రశ్నిస్తున్నాం. ఏదో ఒకటి కన్విక్షన్ అయితేనే అతన్నినేరస్థుడిగా పరిగణించండి అన్నచిన్నమాటను పట్టుకొని, అతన్ని ఇప్పటికీ సమాజంలో చలామణీ కానిస్తారా? ఇవన్నీచూస్తుంటే భారతదేశ వ్యవస్థలు ఎటుపోతున్నాయి అని బాధగా ఉంటోంది. ఏ వ్యవస్థలు అయితే దర్యాప్తుచేసి, రూ.43వేలకోట్లు అన్యాక్రాంతం చేశాడని గుర్తించాయో, ఏ వ్యవస్థలు అయితే ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాయో, అవేవ్యవస్థలు సదరువ్యక్తులకు సాష్టాంగపడుతూ, సెల్యూట్లు చేస్తుంటే, భారత రాజ్యాంగగొప్పతనం ఏముంటుందని నేనుప్రశ్నిస్తున్నా. ఇదంత గమనించాక భారతదేశ రాజ్యాంగాన్ని సవరించాల్సిన బాధ్యత లేదా అని ప్రధానిమోదీ గారిని ప్రశ్నిస్తున్నాం.

కేవలం సంవత్సరంలోనే అవినీతిపరులైన రాజకీయనేతల ఆటకట్టిస్తానన్న మోదీగారి వ్యాఖ్యలు ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడం బాధాకరం. ఈ పరిస్థితి ఇలానేకొనసాగితే చంచల్ గూడ, రాజమహేంధ్రవరంసహా దేశవ్యాప్తంగా ఉన్నజైళ్లల్లో ఉండేవారు రేపు నామి నేషన్లు వేయరా? అందుకే డిమాండ్ చేస్తున్నాం. న్యాయవ్యవస్థ విలువలు కాపాడేలా మోదీగారు తక్షణమే రాజ్యాంగసవరణకు పూనుకోవాలి. లేకుంటే ఇలాంటి వారే పూర్తికాలం అధికారంలో ఉంటారు. ఏదోబలమైన కారణం చేతనే ప్రధానిగారు రాష్ట్రానికి పట్టిన వైరస్ కు మందు వేయకుండా ఆగుతున్నారు.

మందు తనదగ్గరున్నాకూడా మోదీగారు ఎందుకు వేయడంలేదని రాష్ట్ర బీజేపీ నేతల్ని ప్రశ్నిస్తున్నాం… వారు సమాధానంచెప్పాల్సిందే. రాష్ట్రానికి పట్టిన వైరస్ తో ప్రజలు, రాష్ట్రం సర్వనాశనమయ్యేవరకు మందువేయరా? కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్యఉన్నలూలాచీ ఏమిటని ప్రశ్నిస్తున్నాం. వైరస్ పట్టిన రాష్ట్ర్రప్రజలు కుళ్లికృశించే వరకు మందువేయరా?

పక్కనున్న పశ్చిమబెంగాల్లో చీమచిటుక్కుమంటే కేంద్రాబలగాలు ఎందుకు దిగుతు న్నాయి. అక్కడజరిగే చిన్నచిన్న గ్రూపుతగాదాలకంటే దారుణమైన ఘటనలు 100రెట్లు ప్రభావంచూపే ఘటనలు ఏపీలో చాలాజరిగాయి. సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షపార్టీ కార్యాలయం పైనే దాడిజరిగింది. ప్రతిపక్షనేతలపై తప్పుడుకేసులుపెడుతూ జైళ్లకు పంపు తున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ అక్కడి డీజీపీకి నోటీసులిచ్చి, ఆరాష్ట్రంలో ఎందుకు శాంతిభద్రతలు లోపించాయని నిలదీశాడు.

మరి ఇక్కడ ఏపీకి వైరస్ వచ్చిప్రజలంతా ఇబ్బందులుపడుతున్నాకూడా, వైరస్ కు మందు వేసి ప్రజలను కాపాడరా? కనీసం ఏంజరుగుతోందని ఒక్కచిన్న సమీక్ష కూడా చేయరా? వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుపై కేంద్రప్రభుత్వం ఒక్కరోజైనా చిన్నసమీక్ష కూడా ఎందు కు చేయలేదు? హత్యజరిగి రెండేళ్లు దాటింది. సీబీఐ విచారణ నత్తనడనకనసాగుతోంది. ఎవరు హత్యచేశారో కేంద్రానికి సమాచారం లేదా? ఇంటిలిజెన్స్ వ్యవస్థ మీకుచెప్పలేదా?

ప్రధానప్రతిపక్షనేత అయిన చంద్రబాబునాయుడి ని ఇంటినుంచి బయటకురాకుండా ఆయనఇంటి గేట్లకు తాళ్లుకట్టినప్పుడే కేంద్రబలగాలు రావాలి. కానీ అలాజరగలేదు. మీరు మీరు కలిసి రాష్ట్రం సర్వనాశనం అయ్యేవరకు మేలుకోరా? ఏంజరిగినా ముఖ్యమంత్రి బయ టకు రారు. ఎవరు ఏమైపోయినా, రాష్ట్రం ఎటుపోయినా ఆయన స్పందించడు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎలా?
వైసీపీ శాసనసభ్యుడైన నెల్లూరుజిల్లాకు చెందిన వ్యక్తి, రాష్ట్రంలో లోకల్ మాఫియా పెచ్చరిల్లు తోందని, ఆ మాఫియాలో పోలీసులుకూడా ఉన్నారని, దాన్ని నిర్మూలించకపోతే సామాన్యు లకు రక్షణలేదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సవాంగ్ గారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం. అలాంటివ్యాఖ్యలు చేసిన అధికారఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి, మాఫియాలో మునిగితేలుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమం త్రికి, డీజీపీకి లేదా అనిప్రశ్నిస్తున్నాం.

మద్యం అమ్మకాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగాయని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నాం.
విడతలవారీగా మద్యపాననిషేధం అమలుచేస్తానన్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మద్యంఅమ్మకాలు 60శాతం పెరిగాయని చంకలుగుద్దుకుంటారా? ఇది ప్రజా ప్రభుత్వమా…లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? అమ్మకాలు పెరిగాయని చంకలు గుద్దుకుంటున్న వారు మద్యపాననిషేధం చేస్తారా? ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకోరు ముఖ్యమంత్రి, ఇన్ని అబద్ధాలుచెప్పేవ్యక్తి రాష్ట్రానికి అవసరమా ? ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడంకూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దారుణాలపై ఇక్కడి గవర్నర్ (కేంద్రప్రభుత్వం) ఎందుకు స్పందించడంలేదు? గౌరవప్రధానమంత్రి వర్యులు, రాష్ట్రానికి పట్టిన వైరస్ ను నిర్మూలించడానికి తనవద్దఉన్న మందువాడాలి. అలానే అవినీతిపరులైన రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణ త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలి. పెద్దపెద్ద స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు కూడా ఈ వ్యవహారంపై ఆలోచనచేయాలని విజ్ఞప్తిచేస్తున్నా.

Leave a Reply