Suryaa.co.in

Telangana

అంగుష్ట మాత్రుడు రేవంత్ ..కేసీఆర్ తో పోలికా ?

– ఏ బేసిన్ ఎక్కడుందో తెలియదు? దేవాదుల ఎక్కడుందో తెలియదు
– కేసీఆర్ వచ్చి మీకు ఏం చెప్పాలి?
– బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించాలి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: ఎన్నికల రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం. ఇద్దరే ఎంపీలు ఉన్న బీజేపీ నుండి ప్రధానమంత్రిగా మోడీ మూడో సారి అయ్యాడు. గెలిచే పార్టీలో చేరి సీఎం అయ్యారు. రేపు మీరు ఆ పార్టీలో ఉంటారో, పోతారో తెలియదు. ప్రతి దానికి కేసీఆర్ రావాలని అనడం ఏంటి? వీధి పోరాటం ఏమైనా చేస్తారా ? మీరు ప్రజలకు ఏం చేస్తారో ? ఏం ధీమా ఇస్తారో ? చెప్పాలి.

ఏ బేసిన్ ఎక్కడుందో తెలియదు? దేవాదుల ఎక్కడుందో తెలియదు. మరి కేసీఆర్ వచ్చి మీకు ఏం చెప్పాలి?

తెలంగాణ ప్రాజెక్టులు, కేంద్రం తీరుపై నిండు శాసనసభలో కేసీఆర్ సమూలంగా వివరించారు .. అప్పుడు నీవున్న పార్టీ సభ నుండి పారిపోయింది. మీరు లేవనెత్తే అంశాలకు శాసనసభలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు లేదా గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు సమాధానం ఇస్తారు. వారు చెప్పే అంశాలకు ప్రజలు కన్విన్స్ అవుతారో లేదో చూద్దాం. మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో .. దమ్ముంటే వీళ్లకు కూడా అంతే సమయం మైక్ కట్ చేయకుండా ఇవ్వండి

తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదు అని అనేకమార్లు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశాడు .. మరి ఇఫ్పుడు ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? కేంద్రం ఎందుకు వివక్ష చూపుతుంది .. అధికారం కోసం ఆంధ్రప్రదేశ్ కు అనుమతులు ఇస్తారా ?

విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టినా అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనుమతి తీసుకోవాలని చెప్పింది. కానీ అసలు సమావేశమే ఏర్పాటు చేయకుండా రూ.82 వేల కోట్లతో గోదావరి బనకచర్లకు అనుమతులు ఎందుకు ? కేంద్రం ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం వెనక అసలు వ్యవహారం కేంద్రంలో చంద్రబాబు మద్దతు ఇవ్వడమే కారణం కాదా ?

బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించాలి .. దానికి ఎలాంటి అనుమతులు కేంద్రం ఇవ్వకూడదు. దానికి ఎలాంటి అనుమతులు వచ్చినా తెలంగాణకు శాశ్వత ప్రమాదం తప్పదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులను అడ్డుకోవాలి. కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద మాట్లాడడం మానేసి బనకచర్ల అనుమతుల మీద కేంద్రంతో పోరాడాలి. ఒక్కసారైనా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సీఎం, మంత్రులు పూర్తిగా పరిశీలించారా ? అసలు నీళ్లు ఎలా పారుతాయో వీరికి తెలుసా ?

గతంలో కేసీఆర్ ప్రభుత్వం గుట్టలకు, రాళ్లకు రైతుబంధు ఇచ్చామని ప్రచారం చేశారు. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల రూ.25 వేల కోట్లు అనర్హులకు అందాయని చెప్పారు. వాటన్నింటినీ సరి చేశాకే రైతుభరోసా ఇస్తామని కాలయాపన చేయడానికి చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకే రైతుబంధు ఇచ్చింది .. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకే రైతుభరోసా వేశారు.

LEAVE A RESPONSE