Suryaa.co.in

Telangana

తెలంగాణ నీ బాబు జాగీరా రేవంత్ రెడ్డి ?

– రాహుల్ ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ?
– అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ చొప్పున భోజనాలకే ఖర్చు
తనను కోసినా పైసలు పుట్టవన్న రేవంత్ కి ప్లేటు కు లక్ష రూపాయలు కట్టే శక్తి ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పాలి?
– భారత్ సమ్మిట్ కు 30 కోట్ల రూపాయలు అతిధుల కోసమే ప్రభుత్వం ఖర్చు
– రాహుల్ హాజరయ్యారు అంటే అది పార్టీ కార్యక్రమం కిందనే లెక్క
– ప్రభుత్వo దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి
– అత్యంత పొదుపు తో అడుగులు వేయాలి
– రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలంగాణలో స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు
-అసెంబ్లీలో బీ ఆర్ ఎస్ విప్ కె .పి .వివేకానంద

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తనను చీరినా రాష్ట్ర ఖజానా లో పైసలు లేవు ,ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేను అని చేతులెత్తేసిన విషయం మనందరికీ గుర్తున్న విషయమే. నదుల్లో నీళ్ళు కిందకు పోతున్నా నిధులు లేక ప్రాజెక్టులు కట్టలేక పోతున్నాము అని రేవంత్ రెడ్డి గారు వాపోయారు.
అప్పు పుట్టడం లేదనీ ఎవరి దగ్గరికైనా వెళితే చెప్పులు దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చిందని కూడా ఏడ్చినంత పని చేశాడు. సీఎం చెప్పింది నిజమైతే రాష్ట్ర ప్రభుత్వo దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అత్యంత పొదుపు తో అడుగులు వేయాలి. రేవంత్ రెడ్డి చెబుతుంది ఒకటి చేస్తోంది మరొకటి. దుబారా ఖర్చులు తగ్గించకపోగా తన సొంతానికి ,వంది మాగధులకు ప్రభుత్వ సొమ్ము దోచి పెట్టే పనులు చేస్తున్నాడు.

హైదరాబాద్ లో ఇటీవల రాహుల్ గాంధీ హాజరైన భారత్ సమ్మిట్ కు 30 కోట్ల రూపాయలు అతిధుల కోసమే ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే దుబారా ఎంత గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా అన్నీ ఖర్చులు కలిపితే ఖర్చు 200 కోట్లు దాటిందనే అంచనా ఉంది.

ఆర్ టీ ఐ కింద కరీం అనే వ్యక్తి దరఖాస్తు చేస్తే తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ అరకొర సమాచారమిచ్చింది. రాహుల్ గాంధీ హాజరయ్యారు అంటే అది పార్టీ కార్యక్రమం కిందనే లెక్క. పార్టీ ప్రోగ్రాం కు ప్రభుత్వం నిధులు ఖర్చు చేయడానికి తెలంగాణ నీ బాబు జాగీరా రేవంత్ రెడ్డి ? భారత్ సమ్మిట్ ను పెట్టుబడులు ఆకర్షించడానికి ఏర్పాటు చేస్తే రాహుల్ గాంధీ ని ఎందుకు పిలిచారు ? రాహుల్ గాంధి ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ?
ఫార్ములా ఈ కార్ రేసింగ్ తెలంగాణ ప్రతిష్ట ను అంతర్జాతీయ స్థాయిలో పెంచితే మా నేత కే టీ ఆర్ పై అక్రమంగా కేసు పెట్టారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ తో ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని నీల్సన్ సంస్థ గణాంకాలు వెల్లడించాయి.

కేసు పెట్టాల్సి వస్తే భారత్ సమ్మిట్ కు 200 కోట్లు దుబారా చేసిన రేవంత్ పై పెట్టాలి. ఏడు వందల కోట్ల పెట్టుబడులు ఫార్ములా ఈ రేసింగ్ తో రాష్ట్రానికి తెచ్చినందుకు, కే టీ ఆర్ పై కేసు పెట్టడం రాజకీయ దురుద్దేశం కాదా ? ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న రేవంత్ పైనే కేసు ఎందుకు పెట్టకూడదు?

అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ చొప్పున భోజనాలకే ఖర్చు చేశారు. తనను కోసినా పైసలు పుట్టవన్న రేవంత్ రెడ్డి కి ప్లేటు కు లక్ష రూపాయలు కట్టే శక్తి ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పాలి. అందాల పోటీలతో అపఖ్యాతి మూట కట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి వచ్చిన పేరు ఏమీ లేదు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే తప్పు అంటే కొత్త విగ్రహాలను కలెక్టరేట్లలో పెడతారా ? కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడమే కాదు . తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే. సీఎం ఇంకో సారి ఢిల్లీ పోతే యాభై సార్లు పోయినట్టవుతుంది త్వరలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోబోతున్నారు.

సీఎం ఢిల్లీ టూర్లు కూడా పార్టీ నేతలను కలవడానికే తప్ప రాష్ట్రం కోసం కాదు. సీఎం ఈ ఢిల్లీ టూర్ల ఖర్చు కూడా దుబారానే తప్ప రాష్టానికి ఒరిగింది లేదు. రాష్ట్రం తో సంబంధం లేని అనేక మందిని సలహాదారులు గా రేవంత్ నియమిస్తున్నాడు. తన స్నేహితులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వ ఖజానా పై రేవంత్ భారం మోపుతున్నారు.

ప్రతిపక్షం లో ఉండగా సలహాదారుల నియమాకాలపై బీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని తప్పు బట్టిన రేవంత్ రెడ్డి ఇపుడు అదే పని ఎందుకు చేస్తున్నారు? రేవంత్ ప్రభుత్వ దుబారా ఖర్చుల పై విచారణ జరిపితే అసలు విషయాలు బయటికి వస్తాయి. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు చేసింది తక్కువ. ప్రచారానికి పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు

అందాల పోటీల ప్రకటనలకు విచ్చల విడిగా ఖర్చు పెట్టారు. ఇవుడు కూడా ప్రతి చిన్న కార్యక్రమానికి కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నారు. సోషల్ మీడియా లో కేసీఆర్ ,కే టీ ఆర్ ల వ్యక్తిగత హననానికి కూడా ప్రభుత్వ సొమ్మే వాడుతున్నారని మాకు సమాచారముంది .అది కూడా బయట పెడతాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంకా కట్టనే లేదు. అంతా అయిపోయింది. కొత్తగా కట్టించే బిల్డింగ్ లలో పిల్లలు చదువుతున్నారనే రీతిలో యాడ్స్ ఇచ్చుకుంటున్నారు.

ఇదే రేవంత్ రెడ్డి గతం లో ప్రకటనల పై వైఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దుబారా విషయం లో రేవంత్ సర్కార్ అన్ని హద్దులను దాటి అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వమంటే పిసినారి తనాన్ని ప్రదర్శిస్తోంది .రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండదు. అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి 170 కోట్ల లంచం ఇచ్చి పదివేల కోట్ల తెచ్చారు. 170 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. దీనిపై ఏసీబీ కేసు పెట్టి విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతానంటున్న కలెక్టరేట్ లు కట్టింది కెసిఆర్. దోచుకున్న సొమ్మును దాచుకోవటానికి రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్తున్నాడు.

రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలంగాణలో స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తును సంచి తో పాటు ఉన్న చేయి గుర్తుగా మార్చుకోవాలి. ప్రెస్ మీట్ లో మన్నె గోవర్ధన్ రెడ్డి ,పల్లె రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE