– ఆంధ్రాలో అవినీతిపరులు జగన్, పెద్దిరెడ్డి!
– శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి: రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే అతన్ని మించినవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అనురాధ మాట్లాడారు.
జగన్ పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. లక్షల కోట్లు దోచేశారు. 420 సీఎంగా గూగుల్ లో దర్శనమిచ్చే వ్యక్తి జగన్. కాగా అతని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి పుంఖాను పుంఖాలుగా బయటికొస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు, రాత్రంతా దోపిడీలు చేస్తుంటారు. ఇలాంటి స్లిప్ట్ పర్సనాల్టీ గలవారు ఎక్కడా ఉండరు. అతని అవినీతి సామ్రాజ్యాన్ని పీలేరు మొదలుకొని అచలంచలుగా పెంచుకుంటూ మండల స్థాయి మొదలుకొని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి వరకు పాకింది.
అవినీతి సామ్రాజ్యాన్ని అన్నిదిక్కులా విస్తరించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నేనేపాపం ఎరుగను, నాకేమీ తెలియదు అని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అనురాధ అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తన ప్రెస్ మీట్ లో తాను అమాయకుడినని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా చేయలేదా? చేయలేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకున్నారు. శివశక్తి డెయిరీ ద్వారా రైతుల నుండి తక్కువ ధరకు పాలు కొని ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా? మదనపల్లిలో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైల్ దగ్ధం అయితే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ముందస్తు బెయిలు ఎందుకు తెచ్చుకున్నారు?
అసైన్డ్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? సాండ్ మాఫియాలో కోట్లు సంపాదించి అవినీతి సొమ్మును కూడగొట్టుకుంది వాస్తవం కాదా? ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఒక ఎకరం మొదలుకొని వెయ్యి ఎకరాల వరకు భూములు కొట్టేసిన బాపతి మీరు. నేనేమీ ఎరగను, నాకు ఏ సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? మీ పుంగునూరు ఓటర్ లిస్టు కన్నా మీ అవినీతి పాపాల లిస్టే పెద్దదిగా ఉంది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అసైన్డ్ భూములు కాజేసిన మాట వాస్తవం కాదా? 982 ఎకరాల భూమి కబ్జా చేశారని మీడియాలో సైతం వచ్చింది. మీరు దానికి వివరణ ఇచ్చే పరిస్థితిలో లేరు.
పుంగునూరు మండలం రాగాని పల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? రేణిగుంట ఎయిర్ పోర్టులో 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో మధ్యలో 20 ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది? ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసిన పరిస్థితి. గవర్నమెంట్ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోతదల పథకాలు అని చెప్పి తమ స్వార్థం కోసం పనులు మొదలు పెట్టారు. ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆవులపల్లిలో నేతిగుట్ల పల్లెల్లోని ప్రజల్ని రాత్రికి రాత్రి ఖాళీ చేయించేశారు. అనధికారికంగా ఖాళీ చేయించి వాళ్ళ ఉసురు పోసుకున్నారు. మీరు ఇలా చేసినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు వంద కోట్లు ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి చేశారో అందరికీ తెలుసు. అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేటీఆర్ తో కుమ్మక్కై ఏం చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఇంత అవినీతి చేసి, ఇన్ని కబ్జాలు చేసి, ఇంతమందిని ఏడిపించారు. చిన్న పిల్లోడిని అడిగినా కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని ఏం చేసినా పాపం లేదనే మాటే వస్తది తప్ప ఇంకో మాట రాదు. 75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ను మీరు కబ్జా చేయడమే కాకుండా మీ పేరు మీద రాయించుకోవడమే కాకుండా ఏకంగా రోడ్డు వేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు. ఆ గెస్ట్ హౌస్ ఏ అవినీతి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందో మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే.
ప్రస్తుత ప్రభుత్వం దాని మీద కమిటీ వేసింది. అవన్నీ కూడా త్వరలో బయటికి వస్తాయి. కచ్చితంగా నిగ్గు తేలుస్తాము. అక్కడ రోడ్లు ఎవరు ఎవరి సొమ్ముతో వేశారు? పన్నుల రూపేణ ప్రజలు కట్టిన సొమ్ముతోనే రోడ్లు వేశారు కానీ సామాన్య ప్రజలకు ఎక్కడైనా ఒక తట్టెడు మట్టితో ఒక మట్టి రోడ్డు వేసావా? మీరు ఇంత పాపాలు ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగని అన్నట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు వేస్తామనిచెప్పి వీళ్ళ మీద డిఫెర్మేషన్ కేసులు వేయటం దుర్మార్గం కాదా? మదనపల్లిలో ఐదున్నర ఎకరాలు ఉన్న ఒక ఆవిడ. అది కూడా నీ తరపు వాళ్ళందరూ కూడా దానికి కబ్జా చేస్తే ఎలా కబ్జా చేస్తారు? నా పొలం నాకు ఇవ్వండి అని చెప్తే ఆవిడ తాళి బొట్టు కూడా తెంచేశారు.
ఇంతటి అరాచకమా? ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అన్యాయం. అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే, కుప్పంలో నేనే గెలుస్తా, కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తా అన్నారు? ఇప్పుడు ఏమైంది? అక్కడ ముగ్గురు అంటే ఇంకొక అతను మొన్న ఎలక్షన్స్ లో ఇంకో అతను థర్డ్ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆ 6,000 ఓట్లు కూడా వచ్చేవి కావు. ఏదో కన్నులు లొట్టబోయి బయట పడ్డావు. ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని చూడటం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తుంది.
మీ అవినీతి చిట్టా అంతా బయట పెడతాం. మిమ్మల్ని మీ పక్కనున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే, అంతకు ముందున్న మీ తమ్ముళ్ళు, మీ కొడుకులు, ఆ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మీరందరూ ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము తినేసి దేనికి చలనం లేకుండా తయారయ్యారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి సంగతి ప్రభుత్వం తేలుస్తుందని పంచుమర్తి అనురాధ తెలిపారు.