– ఆడబిడ్డను మంత్రులు తుమ్మల , పొన్నం అవమానించారు
– కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఓట్లు వేస్తే తుమ్మల మంత్రి అయ్యారు
– ఈ ఇద్దరు మంత్రులు చనిపోతే మీ భార్యలు ఏడవరా?
– మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తాతా మధు
హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా? తుమ్మలకు అసలు మానవత్వం ఉందా? ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారు. కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఓట్లు వేస్తే అదే సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారు.
అదే సామాజికవర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుంది? తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలి. పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుచనిపోతే ఉప ఎన్నికలు వచ్చాయి.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారు. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ స్పందించి ఉంటే బాగుండేది.
రాజీవ్ గాంధీ చనిపోతే దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫోటోలతో ప్రచారం చేయలేదా? ఆడబిడ్డను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అవమానించారు. మంత్రుల భాషను మహిళలు వినాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో మంత్రులకు,కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకుపుడుతోంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మహిళా లోకాన్ని అవమానించే విధంగా మాట్లాడారు.
ఈ ఇద్దరు మంత్రులు చనిపోతే మీ భార్యలు ఏడవరా? మంత్రులు చెప్పాలి. ఇలాంటి నికృష్టమైన మంత్రులు తెలంగాణలో ఉండటం దురదృష్టకరం. ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ చనిపోతే అందరూ సానుభూతి చూపారు. పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి, విజయారెడ్డిని పక్కన పెట్టుకుని మాగంటి సునీతపై కామెంట్స్ చేశారు.
పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు, రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితపై గెలిచారు. ఆడబిడ్డలు,భర్తలు చనిపోయిన వారిని అవమానించే విధంగా మంత్రులు మాట్లాడారు. తెలంగాణ మహిళా సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలి.