Suryaa.co.in

Telangana

పి ఎఫ్ సొమ్ములు వాడుకోవడం చట్ట విరుద్ధం

– డబ్బులు రాక రిటైర్ ఉద్యోగుల్లో రోజుకు ఒక్కరు చనిపోతున్నారు
– రిటైర్మెంట్ ఉద్యోగుల ఆందోళనలకు మా మద్దతు
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని వివిధ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉద్యోగులకు రిటైర్ మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్ మెంట్ తర్వాత ఏదో ఒక జబ్బుతో భాధ పడుతుంటారు.

డబ్బులు రాక రిటైర్ ఉద్యోగుల్లో రోజుకు ఒక్కరు చనిపోతున్నారు. గుండె ఆగి ఏ రిటైర్ ఉద్యోగి చనిపోయినా అది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది. ఇటీవలనే సోమి రెడ్డి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు డి ఈ ఓ కార్యాలయం దగ్గరే గుండెపోటు తో చనిపోయారు. పది వేల మంది రిటైర్ ఉద్యోగులకు 4 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది.ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపైనా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.

పాత పెన్షన్ విధానం తెస్తామని చెప్పి మోసం చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద ప్రభుత్వం ఉద్యోగుల కింద నెలకు కట్ చేసిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం జమ చేయడం లేదు. ఉద్యోగుల జీతం నుంచి నెలకు జమ చేయాల్సిన డబ్బులను ప్రభుత్వం వాడుకుంటోంది.

రెండున్నర లక్షల సీపీఎస్ ఉద్యోగుల నుంచి నెలకు వంద కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి దాకా 1300 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఉద్యోగుల అకౌంట్లలో వేయకుండా సొంత అవసరాలకు వాడుకుంది. ఇక ఉద్యోగుల సమస్యల పై ఊరుకునే ప్రసక్తే లేదు.పి ఎఫ్ సొమ్ములు వాడుకోవడం చట్ట విరుద్ధం.

ప్రైవేటు కంపెనీలు పి ఎఫ్ మొత్తాన్ని జమ చేయక పోతే కేసులు పెడతారు. అలాగే ఉద్యోగుల సొమ్మును ప్లాన్ అకౌంట్లో జమ చేయని శాఖాధిపతుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

యూనిఫైడ్ పెన్షన్ ఉద్యోగుల పాలిట గుదిబండ: బీ ఆర్ ఎస్ నేత జి .దేవీప్రసాద్

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం కింద ఉద్యోగుల నుంచి కట్ చేస్తున్న మొత్తం ప్లాన్ అకౌంట్ల లో జమ కావడం లేదు.ప్లాన్ అకౌంట్లలో ఏ ఉద్యోగి కి ఎంత జమ చేశారో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. 24 వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము విషయం లో అకౌంట్లు గందర గోళం గా ఉన్నాయి. అసలే కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ ఉద్యోగుల పాలిట గుదిబండ గా మారింది

సీపీఎస్ రద్దు చేస్తామని ఓ వైపు హామీ ఇచ్చి ఆ విధానం కింద నియమితులైన వారిని ప్రభుత్వం వేధిస్తోంది. సీ పి ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలి. కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి.2026 కు ముందు రిటైర్ ఆయినఉద్యోగుల రిటైర్ మెంట్ బెనెఫిట్ల విషయం లో కేంద్రం తెచ్చిన చట్టాలు హానికరంగా ఉన్నాయి.

ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయం లో ఇచ్చిన హామీలు సరిగా అమలు కావడం లేదని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి.ఉద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.

సీ పి ఎస్ ఉద్యోగులు ,రిటైర్ మెంట్ ఉద్యోగుల ఆందోళనలకు మా మద్దతు ఉంటుంది

మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి

రాష్ట్రం లో రేవంత్ పాలన విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్రంలో 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీల పై కొత్త విధానం తీసుకు వస్తున్నారు. సరైన మార్గదర్శకాలు లేకుండా కొత్త తనిఖీల విధానం సరికాదు. ఉప మండల విద్యాధికారుల నియామకం లేక తనిఖీ విధానం సరికాదు. స్కూల్ అసిస్టెంట్లను తనిఖీల్లో భాగస్వామ్యం చేస్తే విద్యార్థులకు భోధన పై ప్రభావం పడుతుంది.

వెంటనే తనిఖీల్లో లోపాలను కింది స్థాయి నుంచి గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.కొత్త విధానం పై ఇటు ఉపాధ్యాయులు ,అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.ప్రెస్ మీట్ లో సుమిత్రానంద్ ,భుజంగ రావు, హమీద్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE