Suryaa.co.in

Andhra Pradesh

కమ్మవారి చరిత్రను చిన్నచూపు చూస్తే సహించేది లేదు

– జగన్‌కు కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిన్న బుధవారం పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ తీవ్రంగా ఖండిస్తూ, జగన్‌ను బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆరోపించారు.

జగన్ మోహన్ రెడ్డి కమ్మవారి చరిత్ర తెలియకపోతే మేము చరిత్ర పుస్తకాలు పంపిస్తాం. వాటిని చదివి జ్ఞానం పెంపొందించుకోవాలని కోరుతున్నామని కమ్మవారిని కమ్మవారి చరిత్రను చిన్నచూపు చూస్తే సహించేది లేదని నాటి స్వాతంత్ర నుండి నేటి రైతు పోరాటం వరకు కమ్మవారు అనేక రంగాలలో ప్రముఖ పాత్ర పోషించారని ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన సామాజిక వర్గాన్ని అవమానించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సమితి గౌరవ సలహాదారులు రాజశేఖర్ మాట్లాడుతూ “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం మానవత్వం గల చర్యగా అభినందనీయం. అయితే, ఈ సందర్భాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ, కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించేలా, అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం మరియు ఖండనీయం.

ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయి, వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడతాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్‌ను హెచ్చరిస్తున్నాము అని అట్లూరి రాజశేఖర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు, లింగం వెంకట గోపీనాథ్, ఈడ్పుగంటి రవి కిరణ్, కోశాధికారి కోటపాటి పిచ్చియ్య చౌదరి, సహాయ కార్యదర్శి పొట్లూరి సత్య పనేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE