Suryaa.co.in

Telangana

గిరిజన మహిళను అవమానించడం బాధాకరం

సోనియా వ్యాఖ్యలు భారతీయుల మనోభావాలను దెబ్బతీశాయి.
– బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి

హైదరాబాద్: రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. “బోరింగ్”, “రబ్బరు స్టాంప్” అనే అహంకార వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడియే. రాష్ట్రపతి హోదాను కించపర్చడం, గిరిజన మహిళను అవమానించడం దారుణం. గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తులు ఉన్నత పదవులు చేపడితే సహించలేరు. గిరిజన మహిళను అవమానించడం బాధాకరం.

సోనియా వ్యాఖ్యలు భారతీయుల మనోభావాలను దెబ్బతీశాయి.కాంగ్రెస్ వైఖరిని మహిళా సమాజం, దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.ప్రజాస్వామ్యాన్ని అవమానించిన సోనియా గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను, కేంద్ర ప్రభుత్వ పథకాలతో దేశ ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించారు.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాష్ట్రపతిపై “బోరింగ్”, “అలసిపోయారు”, “రబ్బరు స్టాంప్” అంటూ విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా సాధికారత గురించి మాటలు వల్లెవేసే కాంగ్రెస్ నాయకులు.. ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిని గౌరవించాలనే విజ్నత లేకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసి నట్లుగానే భావిస్తున్నాం.

LEAVE A RESPONSE