తెలంగాణాలో పూల పండగ ఆడవాళ్లదే ఐనా, ప్రకృతిలో దొరికే ఆ రంగురంగు పూలతో ఎత్తైన బతుకమ్మను పేర్చే ఆనవాయితీ మాత్రం తరతరాలుగా మగ మహారాజులదే! పట్టు బట్టలు ధరించి మహరాణుళ్లా తయారై ఇంటి ముంగిళ్లలో రాత్రి పొద్దు పోయేదాక ఆడీ, పాడీ దగ్గరలో ఉన్న వాగులోనో, చెరువులోనో, కాలువలోనో నిమజ్జనం కోసం బతుకమ్మను తీసుకెళ్లడానికి సైతం ఆడవాళ్లకు మగవాళ్లు తోడుగా వెళ్తుంటారు! ఆలూమగల ఆదర్శవంతమైన జీవనవిధానానికి అద్దం పట్టే ఉన్నతమైన, నిండైన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమే తెలంగాణా పువ్వుల పండగ! అందరికీ పెద్ద బతుకమ్మ శుభాకాంక్షలు.
– సూరజ్ భరద్వాజ్